Best Smartphones With Great Battery: మార్కెట్‌లో బెస్ట్ బ్యాట‌రీ బ్యాకప్ ఫోన్‌లు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

స్మార్ట్‌ఫోన్(Smart Phone) మ‌నం నిత్య‌జీవితంలో భాగంగా మారియి. ఈ పనులన్నీ చేయడానికి బ్యాట‌రీ(Battery) సామర్థ్యం ముఖ్యం అన్నీ ఫీచ‌ర్ల‌(Features)తో పాటు మెరుగైన బ్యాట‌రీ సామర్థ్యం ఉన్న ఫోన్‌లు కొన్ని మార్కెట్‌(Market)లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకుందాం.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్(Smart Phone) మ‌నం నిత్య‌జీవితంలో భాగంగా మారియి. ప్ర‌తీ ప‌ని ఫోన్ ద్వారానే.. పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్(Office) స‌మాచారం పంచుకోడానికి కూడా ఫోన్‌ల‌తో అవ‌స‌రం ఏర్పడింది. కేవ‌లం ఫోన్‌లు మాత్ర‌మే కాకుండా ఎన్నో మ‌ల్టీటాస్కింగ్(Multitasking) ప‌నుల‌కు ఫోన్ అవ‌స‌రం ఉంది. ఇవ్వ‌న్ని చేయ‌డానికి బ్యాట‌రీ ముఖ్యం అన్నీ ఫీచ‌ర్ల‌తో పాటు మెరుగైన బ్యాట‌రీ సామర్థ్యం ఉన్న ఫోన్‌లు కొన్ని మార్కెట్‌(Market)లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకుందాం.

    మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (Motorola Edge 20 Fusion):
    ధ‌ర - రూ. 21,499
    మార్కెట్‌లో ల‌భిస్తున్న మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ క‌లిగి ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సోంతం. ముఖ్య‌మైంది బ్యాట‌రీ సామ‌ర్థ్యం 5,000mhA ఉంది. అంతే కాకుండా 30W ఛార్జింగ్ సపోర్ట్‌ను ఫోన్ క‌లిగిఉంది.

    పోకో ఎఫ్‌3 జీ (Poco F3 GT 5G):
    ధ‌ర - రూ. 28,999
    మార్కెట్‌లో ల‌భిస్తున్న పోకో ఎఫ్‌3 జీ గేమింగ్(Gaming) ప్రియుల‌కు ఎంతో అద్భుత‌మైన అనుభ‌వాన్ని ఇస్తుంది అన‌డంలో సందేహం లేదు. 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ఈ ఫోన్ సొంతం. 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతోపాటు 20Hz రిఫ్రెష్ రేట్ క‌లిగి ఉంది. 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా(Camera) సెటప్ ఈ ఫోన్ ఫీచ‌ర్స్‌(Fetures). బ్యాట‌రీ(Battery) సామ‌ర్థ్యం 5,065mAhతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ వినియోగ‌దారుల‌కు ఆక‌ట్టుకొంటుంది.

    Ola Electric Scooter: నేటి నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు... ధర ఎంతంటే




    రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్( Redmi Note 10 Pro Max):
    ధ‌ర - రూ. 19,999
    మార్కెట్‌లో త‌న‌దైన ముద్ర వేసిన షియోమి నుంచి వంచిన మొబైల్ రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్.. గేమింగ్ ప్రియుల‌కు అనువైన ఫీచ‌ర్స్ ఉన్న ఈ ఫోన్‌లో108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. బ్యాట‌రీ సామ‌ర్థ్యం 5020mAhగా ఉంద‌. 33W ఫాస్ట్ ఛార్జర్ ఇన్-బాక్స్‌ను ఫొన్‌తోపాటు అందించ‌నున్నారు. మొబైల్‌లో గేమ్‌లు ఆడేవారు ఒక‌సారి చార్జ్ పెడితే అత్య‌ధిక సేపు గేమ్ ఆడొచ్చు.

    శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జీ(Samsung Galaxy M32 5G):
    ధ‌ర - రూ .18,999
    ఇటీవ‌లే ఇండియా మార్కెట్‌లోకి వ‌చ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎం32 మొబైల్ ప‌లు ఫీచ‌ర్లు అందిస్తోంది. 6.5 అంగుళాల డిస్‌ప్లే, HD+ TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లే క‌లిగి ఉంది. 8GB RAM వరకు జతచేయబడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ఈ ఫోన్ సొంతం. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. 5,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యం గ‌ల ఈ ఫోన్ 19 గంట‌ల కాలింగ్(Calling time) టైమ్ (LTE నెట్‌వర్క్) లేదా 20 గంట‌ల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది.

    మోటో జీ60 (Moto G60)
    ధ‌ర - (రూ.17,999)
    ఈ మొబైల్ 6.8-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఐపిఎస్ డిస్‌ప్లేతో పాటు 20Hz రిఫ్రెష్ రేట్ క‌లిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G SoC తో ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. కెమెరా 108 ప్రెమ‌రీ కెమెరా ఈ ఫోన్ సొంతం. Moto G60 టర్బో పవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక‌సారి చార్జ్ పెడితే దాదాపు 54 గంట‌లు ఉంటుంద‌ని సంస్థ పేర్కొంది.
    Published by:Sharath Chandra
    First published: