BEST SMARTPHONES BUYING A NEW SMARTPHONE CHECK OUT THE TOP 5 MODELS FROM DIFFERENT BRANDS GH VB
Best Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? వివిధ బ్రాండ్ల నుంచి వచ్చిన టాప్-5 మోడల్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం, ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జెట్, ఎంట్రీ లెవర్ మోడల్స్‌కు కూడా డిమాండ్ ఉంటుంది. మీరు రీజనబుల్ కాస్ట్‌తో బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఈ 5 మోడళ్లను ఎంచుకోవచ్చు.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్(Smartphone) మార్కెట్లో ప్రీమియం, ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జెట్, ఎంట్రీ లెవర్ మోడల్స్‌కు(Models) కూడా డిమాండ్(Demand) ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో మంచి ఫీచర్లతో(Features) వచ్చిన కొన్ని ప్రీమియం ఫోన్లు(premium Phones) కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మీరు కూడా రీజనబుల్ కాస్ట్‌తో బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఈ 5 మోడళ్లను ఎంచుకోవచ్చు.
* iPhone SE 3
యాపిల్ iPhone SE 3 ఒక కాంపాక్ట్ డివైజ్. ఇది మన్నికైన డిజైన్‌లో వస్తుంది. iOS 15తో మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. కొత్త iPhone SE 3 మోడల్.. A15 బయోనిక్ చిప్, 5G, మంచి బ్యాటరీ ప్యాక్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ డివైజ్ మిడ్నైట్, స్టార్‌లైట్, (PRODUCT)RED వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 4.7-అంగుళాల డిస్ప్లే, ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. IP67 రేట్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ దీని సొంతం. iPhone SE వైర్లెస్ ఛార్జింగ్ కోసం Qi-సర్టిఫైడ్ ఛార్జర్లకు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఐఫోన్ 12 MP వైడ్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 64GB, 128GB, 256GB మోడళ్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 43900.
* Samsung Galaxy S22 Ultra
ఈ ఫోన్ 12 GB RAM, 256 GB స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది Ultra 4NM క్వాల్కామ్ స్నాప్‌గ్రాగన్ 8 Gen 1 octa-core ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ఛార్జింగ్ దాదాపు 1.5 రోజుల పాటు ఉంటుంది. 45W పవర్ అడాప్టర్‌తో ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ HD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌ను ఫోన్ కలిగి ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, క్వాడ్-కెమెరా సెటప్, ఇన్‌బిల్ట్ S పెన్‌తో వచ్చిన ఈ డివైజ్.. బుర్గుండి, ఫాంటమ్ వైట్, ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 1,34,999.
* iPhone 13 Pro Max
ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, Apple A15 బయోనిక్ ప్రాసెసర్, 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 128GB, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. సియెర్రా బ్లూ, గ్రాఫైట్, గోల్డ్, సిల్వర్, ఆల్పైన్ గ్రీన్ కలర్ వేరియంట్లలో ఈ డివైజ్‌ను ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 1,19,900.
* Realme GT 2 Pro
రియల్మీ GT 2 Pro ఫోన్ పేపర్ టెక్ మాస్టర్ డిజైన్‌తో, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 8GB, 12GB RAM వేరియంట్లలో లభిస్తుంది. 6.7-అంగుళాల డిస్ప్లే, 50MP + 50MP ప్రైమరీ కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. Realme GT 2 Pro పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 49,999.
* Xiaomi 11T Pro 5G
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వచ్చిన Xiaomi 11T Pro 5G ఫోన్.. 6.67-అంగుళాల AMOLED HDR 10+ డిస్ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ డివైజ్ 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB RAM, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్లో 108MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ స్పెషల్ అట్రాక్షన్. ఇది సెలెస్టియల్ బ్లూ, మూన్లైట్ వైట్, మెటోరైట్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 39,999.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.