Home /News /technology /

BEST SMARTPHONES AVAILABLE UNDER RS 30000 FROM ONEPLUS NORD TO SAMSUNG GALAXY M42 5G NS GH

Smartphones under Rs 30000: రూ. 30 వేలలోపు ధరతో బెస్ట్​ స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఫోన్లపై ఒక లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే.. ప్రముఖ ప్రముఖ కంపెనీల్లో రూ. 30 వేల లోపు ధరతో లభించే ఫోన్ల వివరాలు మీకోసం.

భారత మార్కెట్​లో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ ఫోన్లకు మంచి డిమాండ్​ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వన్‌ప్లస్, రియల్‌మీ, శామ్‌సంగ్, షియోమి వంటి దిగ్గజ సంస్థలు ఆకట్టుకునే ఫీచర్లతో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నాయి. రూ.30 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్​ఫోన్​ ప్రియులను అట్రాక్ట్​ చేస్తున్నాయి. గతేడాది ఇదే ధరల శ్రేణిలో వన్‌ప్లస్ వన్‌ప్లస్ నార్డ్‌ రిలీజైంది. ఈ ఫోన్​ అతి కొద్ది రోజుల్లోనే గణనీయమైన అమ్మకాలను చూసిన విషయం తెలిసిందే. ఇక, వన్​ప్లస్​ నార్డ్​కు పోటీగా ఇదే ధరల శ్రేణిలో శామ్‌సంగ్, షియోమి నుండి కూడా గతేడాది స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రూ. 30 వేల బడ్జెట్​లో స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం గాడ్జెట్స్ 360 పొడ్​కాస్ట్ ఈ వారం ఎపిసోడ్​ నిర్వహించింది. దీని హోస్ట్ అఖిల్ అరోరా, గాడ్జెట్స్ 360 డిప్యూటీ రివ్యూస్ ఎడిటర్ రాయ్డాన్ సెరెజో, రివ్యూయర్​ ఆదిత్య షినోయ్​ ఈ పోడ్​కాస్ట్​లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత మార్కెట్​లో రూ.30 వేలలోపు అందుబాటులో ఉన్న మోడళ్లు, వాటిలో ఫీచర్లను వివరించారు. వేగవంతమైన చిప్‌లతో పాటు డస్ట్​ కమ్​ వాటర్​ రెసిస్టన్స్, స్టీరియో స్పీకర్లు, హై రిఫ్రెష్ రేట్స్​, ఇంగ్రెస్ ప్రొటెక్షన్ (ఐపి) రేటింగ్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకొని బెస్ట్ స్మార్ట్​ఫోన్లను సూచించారు.
Jio Plans: లాక్‌డౌన్ లో ఎక్కువ డేటా వాడే వారికి జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో తక్కువ ధరకు ఎక్కువ డేటా.. వివరాలివే
itel it2192T Thermo Edition: కేవలం రూ. 1049కే జ్వరాన్ని గుర్తించే ఫోన్.. ఈ కరోనా సమయంలో పక్కన ఉంటే బెటర్.. వివరాలివే

గత కొన్నేళ్ల నుంచి స్మార్ట్​ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. స్మార్ట్​ఫోన్ల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల ధరలు పెరగడమే దీనికి కారణం. అయినప్పటికీ, భారత మార్కెట్​లో తమ బ్రాండ్​ను మరింతగా విస్తరించాలని యోచిస్తోన్న వన్‌ప్లస్.. ప్రీమియం ఫీచర్లతో కూడిన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్​ఫోన్​ను రూ. 29,999 ధర వద్దే ప్రారంభించింది. ఇది విడుదలైన కొద్ది రోజులకే పోటీగా షియోమి ఎంఐ 10 ఐ స్మార్ట్​ఫోన్​ను రూ. 21,999 ధర వద్ద విడుదలైంది. దీనితో పాటు ఇదే ధరల శ్రేణిలో ఎంఐ 11 ఎక్స్ మోడల్​ను కూడా విడుదలైంది.

గాడ్జెట్​ 360 పొడ్​కాస్ట్ రివ్యూ..
ఇక, దక్షిణ కొరియా టెక్​ దిగ్గజం శామ్సంగ్ నుండి రూ. 30,000 ధరల సెగ్మెంట్​లో, కొత్తగా గెలాక్సీ ఎం 42 విడుదలైంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 5జి టెక్నాలజీని అందించింది. ఈ స్మార్ట్​ఫోన్​ రియల్​మీ X7 ప్రో 5 జి మోడల్​కు గట్టి పోటీనిచ్చింది. ఇక, ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుండి నిష్క్రమించిన ఎల్జీ కంపెనీ కూడా గతేడాది ఎల్‌జి వింగ్ పేరుతో రూ. 36,375 ధర వద్ద స్మార్ట్​ఫోన్​ విడుదల చేసింది. ఈ ఫోన్​ ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఇక, ఇదే ధర వద్ద శామ్సంగ్ నుంచి గెలాక్సీ ఎ 52 5 జి అనే మరో మోడల్‌ కూడా విడుదలైంది. ఈ స్మార్ట్​ఫోన్లన్నీ రూ. 30 వేల ధరల శ్రేణిలో బెస్ట్​ మోడల్స్​గా నిలిచాయి. కాగా, గాడ్జెట్​ 360 పోడ్​కాస్ట్​ను అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ పొడ్‌కాస్ట్‌, గూగుల్ పాడ్‌కాస్ట్‌, స్పాటిఫై ప్లాట్​ఫామ్స్​లో వినవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Oneplus, Redmi, Samsung, Smartphone

తదుపరి వార్తలు