Home /News /technology /

BEST SMART PHONES UNDER 15 THOUSAND RUPEES UMG GH

Samsung Phones Under Rs.15K: రూ.15 వేలలో ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? ఈ సాంసంగ్‌ బడ్జెట్ ఫోన్‌లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బడ్జెట్ విభాగంలో బెస్ట్‌ ఫోన్‌లు అందిస్తున్న కంపెనీ శామ్‌సంగ్‌. ఆర్థికంగా భారం కాకుండా, ఫీచర్ల పరంగా తగ్గకుండా సాంసంగ్‌ వివిధ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.15 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ శామ్‌సంగ్‌ బడ్జెట్‌ ఫోన్‌లు ఇవే..

ఇంకా చదవండి ...
బడ్జెట్‌లో రూ.15000లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ సెగ్మెంట్‌లో అవసరాలకు సరిపోయే ఫోన్‌ను సెలక్ట్‌ చేసుకోవడం చాలా కష్టం. బడ్జెట్ విభాగంలో బెస్ట్‌ ఫోన్‌లు అందిస్తున్న కంపెనీ సాంసంగ్‌. ఆర్థికంగా భారం కాకుండా, ఫీచర్ల పరంగా తగ్గకుండా సాంసంగ్‌ వివిధ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.15 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ సాంసంగ్‌ బడ్జెట్‌ ఫోన్‌లు ఇవే..

Samsung Galaxy A03
రూ.15 వేల లోపు ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి సాంసంగ్‌గెలాక్సీ ఏ03 బెస్ట్‌ ఆప్షన్‌. స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల HD+ ఇన్ఫినిటీ V డిస్‌ప్లే, బెటర్‌ వ్యూయబిలిటీ కోసం 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంది. వెనుక భాగంలో F 1.8 ఎపర్చర్‌తో 48 MP ప్రైమరీ కెమెరా, F 2.4తో 2 MP డెప్త్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. తక్కువ వెలుతురులో కూడా కొన్ని మంచి షాట్‌లను క్యాప్చర్ చేయడంలో ప్రధాన కెమెరా మీకు సహాయపడుతుంది. సెల్ఫీల కోసం 5 MP నాచ్ కెమెరాను చేర్చారు. ఇది 1.6 GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 3GB, 4GB RAM వేరియంట్‌లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అయ్యే ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 3 GB RAM + 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 నుంచి ప్రారంభమవుతుంది.

Samsung Galaxy M12
సాంసంగ్‌ గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ ఫోన్‌ 6000 mAh మాన్స్టర్ బ్యాటరీతో వస్తుంది. ఇది 4GB RAM, 64 GB స్టోరేజ్, 6GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్‌లో ట్రూ 48 MP(F 2.0) ప్రైమరీ కెమెరా+ 5 MP(F2.2) అల్ట్రా వైడ్ కెమెరా + 2 MP(F2.4) డెప్త్ కెమెరా + 2MP(2.4) మాక్రో కెమెరా, ఫ్రంట్‌ కెమెరా 8 MP(F2.2) ఉన్నాయి. 8 nm Exynos850(Octa-core) ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. 6.5అంగుళాల 720x 1600(HD+), 90 Hz రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఫీచర్‌ను అందిస్తోంది. 4 GB + 64 GB వేరియంట్ ధర రూ.12,999 నుంచి ప్రారంభమవుతుంది.

Samsung Galaxy M32
సాంసంగ్‌ గెలాక్సీ ఎం32 పవర్-ప్యాక్డ్ ఫీచర్ల కారణంగా ఈ విభాగంలో బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది.
స్మార్ట్‌ఫోన్ 6000 mAh బ్యాటరీ, మీడియాటెక్‌ హీలియో G80 చిప్‌సెట్‌తో పాటు 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. LED ఫ్లాష్‌తో కూడిన 64 MP క్వాడ్ కెమెరా సెటప్, 20 MP నాచ్ కెమెరా ఉన్నాయి. 4 GB RAM + 64 GB Storage వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.

Samsung Galaxy A03s
సాంసంగ్‌ గెలాక్సీ ఏ03ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ 3GB+ 32GB, 4GB+ 64GB వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీకి సపోర్ట్‌ చేస్తుంది. ఇది Helio P35 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్‌ అవుతుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ 13 MP f/2.2(వైడ్ యాంగిల్), 2 MP f/2.4(మాక్రో), ఆటో ఫోకస్‌తో 2 MP f/2.4 (డెప్త్ సెన్సార్) ఉంటాయి. ముందు భాగంలో స్క్రీన్ ఫ్లాష్‌తో 5 MP f/2.2 షూటర్ ఉంటుంది. హెడ్‌ఫోన్‌లను 3.55 mm జాక్‌లో ప్లగ్ చేసి ఇష్టమైన సిరీస్/సినిమాలను ఆనందించవచ్చు. 3 GB RAM+ 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,980 నుంచి ప్రారంభమవుతుంది.

Samsung Galaxy M21
సాంసంగ్‌ గెలాక్సీ ఎం21ని 2021లో లాంచ్ చేసింది. ఫోన్ 6000 mAh బ్యాటరీ సపోర్ట్‌, 6.4-అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ-U డిస్‌ప్లేతో వస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజీ లభిస్తుంది. పవర్‌ఫుల్‌ 10 nm Exynos 9611 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ కెమెరా సెటప్-48 MP (F 2.0) ప్రధాన కెమెరా + 8 MP (F2.2) అల్ట్రా వైడ్ కెమెరా + 5 MP (F2.2) డెప్త్ కెమెరా, 20MP (F2.2) ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.11,499కు (4 GB RAM + 64 GB Storage) లభిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget smart phone, Mobiles, Samsung, Smart phones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు