ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు కనిపించడం చాలా అరుదుగా మారింది. ఆన్ లైన్ క్లాసుల కారణంగా పదేళ్లలోపు పిల్లలకు కూడా పేరెంట్స్ ఫోన్లు కొనించాల్సిన పరిస్థితి. అయితే మధ్య తరగతి ప్రజలు సాధారణంబా బడ్జెట్లో లభించే ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా రూ. 10 వేల నుంచి రూ. 15 వేల మధ్య లభించే ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే ఈ ధరలో కూడా మంచి ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఈ ధరలో లభించే ఫోన్లలో కూడా మంచి హై రిజల్యూషన్ స్క్రీన్, మంచి కెమెరా, ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 10,999 ధరతో మంచి ఫీచర్లు ఉండే మూడు స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇవే..
BSNL Recharge Plans: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. రూ. 187కే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ డేటా.. వివరాలివే
MOTOROLA Moto G30:
రూ. 12 వేలలోపు ధర కలిగిన బెస్ట్ ఫోన్ ఇది. ఈ ఫోన్ 6.50 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. 4 జీబీ ర్యామ్ ఉంటుంది. మెమోరీ 64 జీబీ. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mAh, బ్యాక్ కెమెరా 64 MP+8 MP+2 MP+2 MP, ఫ్రంట్ కెమెరా 13 MP. ఈ ఫోన్ ను రూ. 10, 999కి సొంతం చేసుకోవచ్చు.
POCO M3:
ఈ ఫోన్ 6.53 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662. ఈ మొబైల్ 6 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6000 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. బ్యాక్ కెమెరా 48 MP+2 MP+2 MP, ఫ్రంట్ కెమెరా 8MP. ఈ ఫోన్ ను రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు.
Motorola Moto G9:
ఈ ఫోన్ 6.50 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగ్ 662 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. 500mAh బ్యాటరీ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇక కమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 48 MP+2 MP+2 MP. ఫ్రంట్ కెమెరా 8 MP. ఈ ఫోన్ ను కూడా రూ. 10, 999 ధరతో సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile, Motorola, POCO, POCO India, Smartphones