Best Smart bulbs: స్మార్ట్ టీవీలు, స్మార్ట్ మొబైళ్లు, స్మార్ట్ కార్లు... ఈ రోజుల్లో ప్రతీదీ స్మార్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు మనం ఫిలమెంట్ బల్బులు వాడేవాళ్లం... తర్వాత లెడ్ బల్బులు వచ్చేశాయి. ఇప్పుడు ఏకంగా స్మార్ట్ బల్బులు వచ్చేస్తున్నాయి. వీటిని ఆన్ చెయ్యాలన్నా, ఆఫ్ చెయ్యాలన్నా స్విచ్‌లతో పనిలేదు. మీ చేతిలో స్మార్ట్ మొబైల్, దానికి ఇంటర్నెట్ (వైఫై) కనెక్షన్, బ్లూటూత్ వంటివి ఉంటే చాలు పనైపోతుంది. దీని వల్ల చాలా లాభాలుంటాయి. సపోజ్ మీరు ఐదో అంతస్థులో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో బల్బ్ ఆన్ చెయ్యాలంటే... కింది దాకా వెళ్లాల్సిన పని లేదు. మొబైల్‌తో ఆన్ చేయగలరు. అలాగే... మీరు ఆఫీసుకి వెళ్తారు. రాత్రికి ఇంటికి రావడం కుదరట్లేదు అనుకుంటే... అప్పుడు ఇంట్లోని పసిపిల్లలు టెన్షన్ పడకుండా ఆఫీస్ నుంచే ఇంట్లోని బల్బులను ఈవెనింగ్ ఆన్ చెయ్యవచ్చు. ఇలా స్మార్ట్ బల్బులు మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేస్తున్నాయి.
Halonix Prime Prizm Smart Wi-Fi LED Bulb: హాలోనిక్స్ ప్రైమ్ ప్రిజమ్ స్మార్ట్ బల్బ్... వైఫై ద్వారా పనిచేస్తుంది. దీన్ని గుగుల్ అసిస్టెంట్, అలెక్సా ద్వారా కంట్రోల్ చెయ్యవచ్చు. ఈ బల్బును టాబ్లెట్ ద్వారా ఆన్, ఆఫ్ చెయ్యవచ్చు. ప్రస్తుతం హాలోనిక్స్ కంపెనీ... ఈ స్మార్ట్ బల్బుల తయారీపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
TP-Link LB100 Wi-Fi Smart Bulb LED Bulb: టీపీ లింక్ ఎల్బీ 100 లెడ్ స్మార్ట్ బల్బును కూడా వైఫ్ ద్వారా కంట్రోల్ చెయ్యవచ్చు. మీరు ఎక్కడున్నా వైఫై కారణంగా ఇది ఆన్, ఆఫ్ అవ్వగలదు. ఇంకో సదుపాయం కూడా ఉంది. బల్బు నుంచి వచ్చే కాంతి ఎంత కావాలో కూడా మీరు డిసైడ్ చేయవచ్చు. సాయంత్రం వేళ తక్కువ కాంతి, రాత్రివేళ ఎక్కువ కాంతి వచ్చేలా చేసుకోవచ్చు. తద్వారా మీరు దీన్ని బెడ్ బల్బుగా వాడుకోవచ్చు, నార్మల్ బల్బుగా కూడా వాడుకోవచ్చు. ఇది కూడా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా కంట్రోల్ అవ్వగలదు.
Syska 7- watt smart LED bulb: సిస్కా తయారుచేసిన 7 వాట్ల స్మార్ట్ లెడ్ బల్బులో ఏకంగా 30 లక్షల కలర్స్ ఉన్నాయి. అందువల్ల ఎవరికి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లోకి బల్బును మార్చేసుకోవచ్చు. ఈ బల్బును యాప్ ద్వారా ఆన్, ఆఫ్ చెయ్యవచ్చు. ఇతర ఫంక్షన్లు కూడా యాప్ ద్వారా వీలవుతాయి.
Wipro Garnet 9W Smart Bulb: విప్రో కూడా స్మార్ట్ బల్బులు తెస్తోంది. గార్నెట్ బల్బు 9 వాట్ల కెపాసిటీతో వచ్చింది. దీనికి కూడా కలర్, కాంతిని ఎంతకావాలంటే అంత మార్చుకోవచ్చు. ఇది కూడా స్మార్ట్ మొబైల్లోని యాప్ ద్వారా కంట్రోల్ అవుతుంది. దీన్ని వాడేవారు మొబైల్లో జస్ట్ ఒక క్లిక్ ద్వారా దీన్ని ఎక్కడి నుంచైనా ఆన్, ఆఫ్ చెయ్యగలరు.
ఇది కూడా చదవండి:Zodiac Signs: ఈ రాశుల వారు సోషల్ మీడియా లవర్స్... మొబైల్ వదలరు
ఇలా స్మార్ట్ బల్బ్స్ మన లైఫ్ స్టైల్‌ని మార్చేస్తున్నాయి. ప్రస్తుతానికి వీటి రేటు ఎక్కువే అయినప్పటికీ... క్రమంగా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు టెక్ నిపుణులు.