Home /News /technology /

BEST SMART BULBS FROM PHILIPS WIPRO XIAOMI AND MORE UNDER RS 1000 IN INDIA GH VB

Best Smart Bulbs: అతి తక్కువ ధరలో లభించే ఎల్​ఈడీ బల్బులు.. వీటిపై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ హోమ్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఉత్పత్తులు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా మంది తమ ఇళ్లలో స్మార్ట్ ఉత్పత్తులు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే వాయిస్ కమాండ్‌తో మానిటరింగ్ చేయగల స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ లైట్లకు డిమాండ్​ పెరుగుతోంది.

ఇంకా చదవండి ...
స్మార్ట్ హోమ్‌లు(Smart Homes), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఉత్పత్తులు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా మంది తమ ఇళ్లలో స్మార్ట్ ఉత్పత్తులు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే వాయిస్(Voice) కమాండ్‌తో మానిటరింగ్ చేయగల స్మార్ట్ స్పీకర్లు(Smart speakers), స్మార్ట్ లైట్లకు డిమాండ్​ పెరుగుతోంది. అయితే మార్కెట్​లో అనేక స్మార్ట్​ ఉత్పత్తులు ఉండటంతో వేటిని కొనాలనే దానిపై చాలా మంది కన్​ఫ్యూజ్​ అవుతుంటారు. అటువంటి వారి కోసం కేవలం రూ. 1000లోపు లభిస్తున్న స్మార్ట్​ ఉత్పత్తులను తెలియజేస్తున్నాం. వాటిని పరిశీలించండి.

New Year Smart Phones: 2022లో విడుదలకానున్న టాప్​ 5 ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్లు ఇవే.. ఫీచర్లు మామూలుగా లేవుగా..


విప్రో E27 9 వాట్స్​ వైఫై స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్
9 వాట్ల విప్రో స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్ అమెజాన్​లో రూ. 656 ధర వద్ద లభిస్తుంది. ఇది 16 మిలియన్ కలర్లతో వస్తుంది. అమెజాన్​ అలెక్సా, గూగుల్​ అసిస్టెంట్​ వంటి వర్చువల్ అసిస్టెంట్‌లకు మద్దతిస్తుంది. ఈ స్మార్ట్ బల్బ్​ను మొబైల్​ యాప్ ద్వారా మానిటర్​ చేయవచ్చు. అమెజాన్​ అలెక్సా లేదా గూగుల్​ అసిస్టెంట్​ ద్వారా వాయిస్‌ కంట్రోల్​ చేయవచ్చు.

ఫిలిప్స్​ స్మార్ట్​ వైఫై ఎల్​ఈడీ బీ22 బల్బ్
ఫిలిప్స్ స్మార్ట్ బల్బ్ విజయ్ సేల్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 10W స్మార్ట్ బల్బ్ మొబైల్ యాప్ కంట్రోల్​తో వస్తుంది. ఇది 16 మిలియన్ కలర్స్​ను వెదజల్లుతుంది. ఈ స్మార్ట్​ ఎల్​ఈడీ బల్బు వాయిస్ కంట్రోల్​కు మద్దతిస్తుంది.

RRB Group D Exam Date: ఆర్​ఆర్​బీ గ్రూప్​ డీ పరీక్షల తేదీ విడుదల.. ఎడిట్​ లింక్ యాక్టివేట్.. వివరాలివే..


రియల్​మీ స్మార్ట్​ వైఫై ఎల్ఈడీ బల్బ్​ (9 వాట్స్​) బీ22
9 వాట్స్​ రియల్​మీ స్మార్ట్ బల్బ్ 25,000 గంటల రేట్ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఇది 16 మిలియన్ రంగులతో వస్తుంది. అమెజాన్​ అలెక్సా, గూగుల్​ అసిస్టెంట్​ను ఉపయోగించి వాయిస్ కంట్రోల్‌ కూడా చేయవచ్చు. అమెజాన్​లో ఇది కేవలం రూ. 799 ధర వద్ద లభిస్తుంది.

సిస్కా బీ22 ఎల్​ఈడీ స్మార్ట్ బల్బ్
7వాట్స్​ సిస్కా స్మార్ట్ బల్బ్ అమెజాన్​లో రూ. 720 ధర వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ అలెక్సాకు మద్దతిస్తుంది. ఈ బల్బ్ 16 మిలియన్ కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. వైఫైకి మద్దతిస్తుంది. ఇది AC 220-240V ఇన్‌పుట్ వోల్టేజ్​కు మద్దతిస్తుంది.

Oppo Find N: డిసెంబర్​ 15న ఒప్పో నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​​.. లీకైన స్పెసిఫికేషన్ల వివరాలివే..


ఎంఐ స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్
జాబితాలోని అత్యంత చౌకైన స్మార్ట్​బల్బ్ ఇదే. షియోమి ఎంఐ స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్​ ఒకే -కలర్​ ఆప్షన్​లో లభిస్తుంది. ఇది వైట్​ కలర్​లోనే అందుబాటులో ఉంటుంది. మొబైల్​ యాప్​ ద్వారా దీన్ని కంట్రోల్​ చేయవచ్చు. ఈ స్మార్ట్ బల్బ్ అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. అమెజాన్‌లో దీన్ని కేవలం రూ. 449 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

పానాసోనిక్ వైఫై స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్ బీ22 9 -వాట్
పానాసోనిక్​ వైఫై స్మార్ట్ ఎల్​ఈడీ బల్బ్ రూ. 623 ధర వద్ద లభిస్తుంది. ఇది 16 మిలియన్ రంగులతో వస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్​కు మద్దతిస్తుంది. వాయిస్ సిగ్నల్​ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Latest Technology, Low cost house, Low cost price, Smart bulbs

తదుపరి వార్తలు