Home /News /technology /

BEST SECURITY FEATURES IN SMARTPHONES EVK

Android Smartphone: ఫోన్‌లో ఖ‌చ్చితంగా ఉండాల్సిన సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

స్మార్ట్ ఫోన్(Smart Phone) మ‌నం రోజూ ఏ ప‌ని చేయాల‌న్నా.. ఈ రోజుల్లో త‌ప్ప‌ని స‌రి. మ‌నం ఫోన్ మాట్లాడుకోవ‌డంతో పాటు బ్యాంకింగ్‌(Banking), ఆన్‌లైన్ షాపింగ్‌(Online Shoping), మెసేజ్‌లు, ముఖ్య‌మైన స‌మాచారం అంతా ఈ ఫోన్‌లోనే ఉంటున్నాయి. అలాంటి మీ ఫోన్‌ను ఇత‌రులు వినియోగించ‌కోకుండా సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌ని(Security Features) వినియోగిస్తే మేలు. లేకుంటే ఇబ్బంది ప‌డ‌తారు.

ఇంకా చదవండి ...
    స్మార్ట్ ఫోన్(Smart Phone) మ‌నం రోజూ ఏ ప‌ని చేయాల‌న్నా.. ఈ రోజుల్లో త‌ప్ప‌ని స‌రి. మ‌నం ఫోన్ మాట్లాడుకోవ‌డంతో పాటు బ్యాంకింగ్‌.. ఆన్‌లైన్ షాపింగ్‌.. మెసేజ్‌లు, ముఖ్య‌మైన స‌మాచారం అంతా ఈ ఫోన్‌లోనే ఉంటున్నాయి. అలాంటి మీ ఫోన్‌ను ఇత‌రులు వినియోగించ‌కోకుండా సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌ని వినియోగిస్తే మేలు. లేకుంటే ఇబ్బంది ప‌డ‌తారు. సైబ‌ర్ నేరాలు(Cyber crime) ఎక్కువైపోతున్న స‌మ‌యంలో మీరు వినియోగించే సెక్యూరిటీ ఫీచ‌ర్స్(Security Features) మెరుగ్గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే ఇప్పుడు మ‌నం ఫోన్‌లో వాడాల్సిన ముఖ్య‌మైన సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌ను తెల‌సుకుందాం.

    FMWhatsapp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. ఆ మాడిఫికేషన్ యాప్‌తో డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం


    స్క్రీన్ లాక్ సెట్టింగ్స్‌(Screen Lock Settings)
    ఇప్పుడు ఫోన్ వాడే వారంతా స్క్రీన్ లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ వాడుతున్నారు. అయితే లాక్ పెట్టుకొన్నా ఎటువంటి నోటిఫికేష‌న్స్ రావాలో వ‌ద్దో నిర్ణ‌యించుకొంటే బాగుంటుంది. ఏ యాప్‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ రావోలో వ‌ద్దో సెట్టింగ్ చేసుకొంటే ఉప‌యోగంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 లేదా అంత‌కంటే ఎక్కువ వ‌ర్ష‌న్ ఉన్న ఓఎస్‌లోనే ఈ ఆప్ష‌న్స్ ఉన్నాయి.
    ఆటోమెటిక్ లాక్ (Automatic lock)
    చాలా మంది ఫోన్‌ను లాక్ చేయ‌కుండా అలానే ఉంచుతారు. అలా కాకుండా స్మార్ట్ లాక్ ఆప్ష‌న్‌ను(Smart Lock option) సెట్ చేసుకొంటే మీరు ఫోన్ చాలా సేపు లాక్ చేయ‌కుంటే ఆటోమెటిక్‌గా లాక్ అవుతుంది. త‌రువాత ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే మాత్రం ఖ‌చ్చితంగా మీరు పెట్టుకొన్న‌ పిన్ నంబ‌ర్‌, ప్యాట‌ర్న్‌, ఫింగ‌ర్‌ప్రింట్ వినియోగించాలి. ఈ ఆప్ష‌న్ కేవ‌లం ఆండ్రాయిడ్ 10(Android 10), అంత‌కంటే ఎక్కువ వ‌ర్ష‌న్‌లోనే ల‌భిస్తుంది.
    ఫోన్ పోతే.. ఎలా?
    ఫోన్ పోతే ఎలా క‌నిపెట్టాలి అందుకోసం ఏం చేయాలో తెలుసా.. ఫైండ్ మై డివైజ్(find my device) ఫీచ‌ర్‌ను వాడాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. సెక్యూరిటీ ఆప్ష‌న్‌ను(Security option) క్లిక్ చేయాలి.. ఫైండ్ మై డివైజ్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. అక్క‌డ లొకేష‌న్‌ను ఆన్ చేయాలి. ఇది ఆన్‌లో ఉంటేనే మీ ఫోన్ పోయినా కూడా దాని లొకేష‌న్‌ను ట్రేస్(Trace) చేయొచ్చు.

    Google Chrome: గూగుల్ యూజర్లకు అలర్ట్.. అర్జెంట్‌గా క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి


    గూగుల్ ఎకౌంట్ ఫీచ‌ర్స్‌..
    మ‌నం ఎక్కువ‌గా గూగుల్ ఎకౌంట్ల‌ను వినియోగిస్తాం. వాటిని passwords.google.com వెబ్ సైట్‌లోకి వెళ్లి చెక్ పాస్‌వ‌ర్డ్స్ అనే ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్క‌డ పాస్ వ‌ర్డ్‌ను చేంజ్ చేసుకుంటే.. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిన అన్ని సైట్ల‌లో పాస్ వ‌ర్డ్ అప్ డేట్(Update) అవుతుంది. గూగుల్ అకౌంట్‌ల‌(Google Account)ను ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీ చెక‌ప్ చేస్తూ ఉండాలి. గూగుల్ అకౌంట్‌ను భ‌ద్రంగా ఉంచుకోవ‌డం కోసం కొన్ని రిక‌మండేష‌న్స్‌ను సెక్యూరిటీ చెక‌ప్ ద్వారా పొందొచ్చు. అంతే కాకుండా మీరు వినియోగించే యాప్‌ల ప‌ర్మిష‌న్‌ల‌ను(App permissions) ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాలి లేకుంటే మీడేటా సైబ‌ర్ నేర‌గాళ్ల పాల‌వుతుంది. మీరు గూగుల్ క్రోమ్ వాడుతుంటే.. సేఫ్ బ్రౌజింగ్(Safe Browsing) లేకుండా.. ఏది ప‌డితే ఆ వెబ్ బ్రౌజ‌ర్‌లో డేటాను సెర్చ్ చేయ‌కూడ‌దు. సేఫ్ బ్రౌజింగ్ కోసం క్రోమ్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. గూగుల్ క్రోమ్‌ను మీ డీఫాల్ట్ బ్రౌజ‌ర్‌గా(Default Browser) సెట్ చేసుకొని.. దాంట్లోనే నెట్‌ను బ్రౌజ్ చేయండి.
    గూగుల్ ప్లే ప్రొటెక్ట్
    మ‌నం ఫోన్‌లో ఏ యాప్ వాడాల‌న్నా.. గూగుల్ ప్లే అవ‌స‌రం మీరు వాడుతున్న యాప్‌లు స‌రైనవా కాదా అని ప‌రిశీలించుకోవాలి. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొనే ముందు యాప్ స‌రైందా కాదా ప‌రిశీలించుకోవాలి. ఇందుకోసం గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను మీ ఫోన్‌లో ఆన్ చేసుకోవాలి. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి గూగుల్ ప్లే ప్రొటెక్ట్(Google play protection) అనే ఆప్ష‌న్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. యూజ‌ర్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్‌ను స్కాన్ చేస్తూ ఉంటే ఏవైనా ఫోన్‌కు హాని క‌లిగించే యాప్స్ ఉంటే వెంట‌నే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ దాన్ని ఫోన్ నుంచి తొల‌గిస్తుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cyber security, Smartphone

    తదుపరి వార్తలు