భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులకు కారణమైంది రిలయన్స్ జియో(Jio). ప్రీపెయిడ్ విభాగంలో సంచలనం సృష్టించిన జియో ఎట్టకేలకు ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టింది. మిగిలిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పోలిస్తే రిలయర్స్ జియో మార్కెట్లో ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. టెలికాం రంగంలో ఉన్న పోటీ దృష్ట్యా జియో, ఎయిర్టెల్(Airtel), వొడాఫోన్(Vodafone) సంస్థలు రూ .500 లోపు గొప్ప పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే, ఎయిర్టెల్, వొడాఫోన్ అందించే ప్లాన్లతో పోల్చితే, జియో ఉత్తమ ప్లాన్లను అందిస్తుంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్(postpaid plans)తో అపరిమిత డేటా, కాల్ ప్రయోజనాలున్నాయి.
అపరిమిత కాల్, డేటా మాత్రమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video), హాట్‌స్టార్(Hotstar)తో సహా ప్రధాన OTT ప్లాట్‌ఫార్మ్‌లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తోంది. ప్రముఖ టెలికాం దిగ్గజాలు రూ.500లోపు అందిస్తున్న ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను పరిశీలిద్దాం.
జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ (jio post paid plans)
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కేవలం రూ .399కే పోస్ట్‌పెయిడ్ ప్లాన్(postpaid plan) అందిస్తుంది. ఈ ప్లాన్ కింద ప్రతి నెలా 75GB FUP ఉచిత డేటాను అందిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, వినియోగదారుడు ప్రతి జిబికి రూ .10 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 200GB వరకు డేటా రోల్ఓవర్ (data rollover) సౌకర్యానికి కూడా సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత SMSలు అందుకోవచ్చు.ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే వారికి జియో యాప్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంతేకాక, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP) వంటి ప్రముఖ OTT ప్లాట్ఫార్మ్లను ఉచితంగా యాక్సిస్ చేయవచ్చు.
ఎయిర్టెల్ (Airtel) పోస్ట్ పెయిడ్ ప్లాన్
జియోకు పోటీగా ఎయిర్టెల్(Airtel) రూ .399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ ద్వారా మీకు జియో వలే ఉచిత OTT ప్రయోజనాలు లభించవు. OTT ప్రయోజనాలను కూడా పొందాలంటే ఎయిర్టెల్ కస్టమర్లు రూ .499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద డేటా రోల్ఓవర్ సౌకర్యంతో 75 జీబీ ఎఫ్‌యూపీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు ఎయిర్టెల్ థాంక్స్(Airtel Thanks) యాప్‌కు ఉచిత స్ట్రీమింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, రూ.499తో వచ్చే ప్లాన్‌లో ఎయిర్టెల్ ఉచిత నెట్‌ఫ్లిక్స్(Netflix)ను అందించడం లేదు. ఈ ప్లాన్ కింద మీకు సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ మాత్రం లభిస్తాయి.
Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ప్రముఖ టెక్ దిగ్గజాలు వొడాఫోన్(Vodafone), ఐడియా(Idea)లు ఇటీవలే ఒక్కటై ‘విఐ’ అనే ప్లాట్‌ఫార్మ్‌తో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, వీఐ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం రూ. 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్టాన్తో మీకు ఉచిత OTT సభ్యత్వం మాత్రం లభించదు. ఈ ప్లాన్ కింద ప్రతినెలా కేవలం 40GB FUP డేటా మాత్రమే లభిస్తుంది. అంతేకాక, ఇది 200GB వరకు డేటా రోల్ఓవర్కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. దీనితో మీరు Vi మూవీస్ & టీవీ యాప్(Vi Movies & TV apps)లను కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ మీరు అపరిమిత కాలింగ్‌తో పాటు OTT ప్రయోజనాలను కూడా పొందాలనుకుంటే రూ .499 వోడాఫోన్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని కింద 75GB FUP డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలతో పాటు Vi మూవీస్ & టీవీ యాప్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5 లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Jio 5G, Ott, Vodafone Idea, Zee5