హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Phones Under Rs.20K: బడ్జెట్ ఫోన్లలో ది బెస్ట్ ఇవే.. రూ.20 వేలలో టాప్ మొబైల్స్‌పై ఓ లుక్కేయండీ..!

Phones Under Rs.20K: బడ్జెట్ ఫోన్లలో ది బెస్ట్ ఇవే.. రూ.20 వేలలో టాప్ మొబైల్స్‌పై ఓ లుక్కేయండీ..!

బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

రూ.20 వేలలోపు (Rs. 20K) ధరల్లో చాలా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో వచ్చే ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తాయి. వ్యాల్యూ ఫర్ మనీగా నిలిచే ఈ ఫోన్స్ పెట్టిన ధరకు తగిన ఫీచర్లు, మెరుగైన పర్ఫామెన్స్, పవర్‌ఫుల్ బ్యాటరీని ఆఫర్ చేస్తాయి.

ఇంకా చదవండి ...

రూ.20 వేలలోపు (Rs. 20K) ధరల్లో చాలా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు (Smartphones) అందుబాటులో ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్‌లో వచ్చే ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తాయి. వ్యాల్యూ ఫర్ మనీగా నిలిచే ఈ ఫోన్స్ పెట్టిన ధరకు తగిన ఫీచర్లు, మెరుగైన పర్ఫామెన్స్, పవర్‌ఫుల్ బ్యాటరీని ఆఫర్ చేస్తాయి. మరి ఆ ఫోన్లు ఏవి? వాటి ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐకూ జెడ్5 5జీ

ఐకూ జెడ్5 5జీ 8GB+128GB వేరియంట్ అమెజాన్‌లో రూ.19,990కే లభిస్తోంది. ఇందులో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్‌, 44W ఫాస్ట్ ఛార్జర్‌తో 5000 mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ బ్యాక్‌సైడ్‌లో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా , 2MP మాక్రో కెమెరా ఆఫర్ చేశారు. సెల్ఫీల కోసం 16MP కెమెరా ఇచ్చారు.

పోకో ఎక్స్‌4 ప్రో 5G

పోకో ఎక్స్‌4 ప్రో 5G ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,999కే దొరుకుతుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే అందించారు. బ్యాక్‌సైడ్ 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ స్నాపర్, 2MP మాక్రో కెమెరా అందించగా.. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు. ఇది 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్‌తో లభిస్తుంది.

ఇదీ చదవండి: గేమింగ్ లవర్స్ కు పెద్ద షాక్.. మరో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ !


మోటొరోలా G71 5G

మోటొరోలా జీ71 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.4-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్ ప్రత్యేకమైన ఫీచర్లుగా నిలుస్తున్నాయి. 50MP+8MP+2MP వంటి కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. 16MP ఫ్రంట్ కెమెరా చక్కటి వీడియోలు తీస్తుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 12, One UI 4.1, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను ఇందులో అందించారు. బ్యాక్‌సైడ్ 50MP+8MP+2MP కెమెరాలు ఆఫర్ చేశారు. సెల్ఫీల కోసం 8MP కెమెరా ఇచ్చారు. 5,000 mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌

రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌ 108MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు బ్యాక్‌సైడ్‌లో 8MP అల్ట్రా-వైడ్, 5MP మాక్రో, 2MP డెప్త్ సెన్సార్ ఆఫర్ చేశారు. ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6.67-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5020 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్‌ను ఇచ్చారు. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 6GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,749కి అమెజాన్‌లో లభిస్తుంది.

First published:

Tags: 5g smart phone, Budget smart phone, Smart phones, Tech news

ఉత్తమ కథలు