సంక్రాంతి రాకతో మళ్లీ ఫెస్టివల్ సీజన్ మొదలైంది. దీంతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ అన్నీ సేల్స్ పెంచుకునే పనిలో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో వివిధ రకాల మోడళ్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ప్రస్తుతం బడ్జెట్ రేంజ్(రూ.15000)లో కొన్ని మోడల్స్ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవేంటో చూడండి.
Samsung Galaxy F23 5G
అద్భుతమైన ఫీచర్స్‌తో బడ్జెట్ రేంజ్‌లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఇది ఒకటి. 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో ఈ హ్యాండ్ సెట్ ఆకర్షణీయంగా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ స్నాపర్, 2MP మాక్రో కెమెరా ఇందులో ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరాను అమర్చారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీతో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM+128GB వేరియంట్ రూ.14,999కు సొంతం చేసుకోవచ్చు.
Motorola G62 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM+128GB వేరియంట్ ప్రస్తుతం రూ.14,999 ధరతో అందుబాటులో ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ IPS డిస్‌ప్లేతో ఇది లభిస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా(50MP+8MP +2MP) సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Infinix నోట్ 12 5G
ఇన్ఫినిక్స్‌కు చెందిన ఈ 5జీ ఫోన్‌లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoCతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో రియర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ AI లెన్స్‌తో ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్నాయి. Infinix Note 12 6GB RAM+ 64 GB వేరియంట్ రూ.12,999కు అందుబాటులో ఉంది.
Poco M4 Pro 5G
పోకో కంపెనీకి చెందిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB RAM+128GB వేరియంట్ రూ.13,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్షిటీ 810 చిప్‌సెట్ వినియోగించారు. 90 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో ఈ హ్యాండ్‌సెట్ లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్ తో స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. డ్యుయల్ కెమెరా(64 MP +8 MP) సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకత.
Oppo K10
ఒప్పొ కె 10 స్మార్ట్‌ఫోన్ 6GB RAM+128GB వేరియంట్ ధర రూ.13,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP+2MP +2MP) ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, IP5X రేటెడ్ డస్ట్ ప్రూఫ్ డిజైన్ వంటి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart phone, Smartphones