Phones Under Rs 15K: రూ.15 వేలల్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..! ఓ లుక్కేయండీ..!!
Phones Under Rs 15K: రూ.15 వేలల్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..! ఓ లుక్కేయండీ..!!
ఒప్పో కే10
రూ.15 వేల రేంజ్‌లో ఎక్కువ ఫోన్‌లు మార్కెట్‌లో లభ్యమవుతాయి. ఈ బడ్జెట్‌లో 5G సపోర్ట్ చేసే ఫోన్‌లు కూడా ఉన్నాయి. 6 GB RAM, AMOLED స్క్రీన్‌లు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్‌లను కూడా అందిస్తున్నాయి. భారతదేశంలో జులై నెలలో రూ.15,000లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్‌లు ఇవే..
మోటొరోలా G31 ఆకట్టుకునే ఫీచర్లు, UIతో ఆకట్టుకుంటోంది. ఇది 6.4-అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్, స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 8MP అల్ట్రావైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరా, వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫోన్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్, Mediatek Helio G85 చిప్, 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను పొందే సూచనలు ఉన్నాయి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇండియాలో 6GB RAM/ 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.
ఒప్పో K10 స్మార్ట్‌ఫోన్ IP5X రేటెడ్ డస్ట్ ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, ఒప్పో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్, 6 GB RAM,128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11పై కలర్స్ ఓఎస్ 11 ద్వారా రన్ అవుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాను అందజేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 33W SuperVOOC ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీని అందిస్తోంది. ఇండియాలో 6GB RAM/ 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990గా ఉంది.
అత్యంత సరసమైన 5G ఫోన్‌లలో ఇది ఒకటి. ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో లభిస్తుంది. 6 GB RAM, 128 GB స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 480 SoC ప్రాసెసర్, 48MP ప్రైమరీ షూటర్ ఉంటే క్వాడ్ రియర్ కెమెరాలు, 18W ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ఈ ఫోన్ కీ స్పెసిఫికేషన్స్.
ఇన్‌ఫినిక్స్(Infinix) ఈ సంవత్సరం బడ్జెట్ ఫోన్‌ల బ్రాండ్‌గా ఆకట్టుకుంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 12 5G స్మార్ట్‌ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో బిగ్ 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ ఫోన్ Mediatek డైమెన్సిటీ 810 SoC ద్వారా పని చేస్తుంది. 6 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, AI లెన్స్‌తో పాటు 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ XOS 10.6 UIతో సరికొత్త Android 12పై రన్ అవుతుంది. ఇండియాలో 6GB RAM/ 64 GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999కు లభిస్తుంది.
రెడ్‌మీ నోట్ 11 ఆకట్టుకునే డిస్‌ప్లేతో ఈ విభాగంలో మరో మంచి ఆల్‌రౌండర్. ఇది 6.43-అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 1000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్ ఉంది. 6 GB RAM, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాటన్ 680 SoC ద్వారా పని చేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 64 GBతో వస్తుంది, దీన్ని మెమరీ కార్డ్‌తో పెంచుకోవచ్చు. ఫోన్‌లో 8MP అల్ట్రా-వైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 50MP ప్రైమరీ కెమెరా వెనుకవైపు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 13MP కెమెరా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ MIUI 13తో Android 11పై రన్ అవుతుంది. ఇండియాలో 6 GB RAM/ 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.