Home /News /technology /

BEST PHONES TO BUY IN INDIA UNDER RS 35000 IN JULY UMG GH

Phones Under Rs.35K: మంచి మిడ్‌రేంజ్ మొబైల్ కోసం చూస్తున్నారా..? మీ కోసం ది బెస్ట్ ఫోన్స్ సెలక్ట్ చేశాం.. ఓ లుక్కేయండీ..!

రూ.35 వేలలో బెస్ట్ మొబైల్

రూ.35 వేలలో బెస్ట్ మొబైల్

ఇండియాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ ఎక్కువ అవుతోంది. రూ.35వేల ప్రైస్ రేంజ్‌లో కొత్త ఫోన్లను కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. 5G టెక్నాలజీ, టాప్ కెమెరాలు, బెస్ట్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది.

ఇండియాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ ఎక్కువ అవుతోంది. టాప్ కంపెనీలన్నీ రూ.30వేల నుంచి రూ.35వేల ప్రైస్ రేంజ్‌లో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. 5G టెక్నాలజీ, టాప్ కెమెరాలు, బెస్ట్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. మీరు కూడా ఈ రేంజ్‌లో మంచి డివైజ్ కోసం చూస్తుంటే.. ఈ నెలలో మార్కెట్లో లభిస్తున్న ఈ టాప్ ఫోన్లపై ఓ లుక్కేయండి..

* Samsung Galaxy A52s
గెలాక్సీ A52s ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC చిప్‌తో పనిచేస్తుంది. IP67 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్ దీని సొంతం. రూ. 30,000 ధర విభాగంలో ఈ ఫీచర్‌ అరుదుగా ఉంటుంది. 6.5-అంగుళాల AMOLED HDR 10+ స్క్రీన్‌, 800నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్‌తో వచ్చే 15W ఛార్జర్‌ స్లో చార్జింగ్ స్పీడ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఇదొక్కటే మైనస్ పాయింట్. అయితే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ A52s ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 27,360కు కొనుగోలు చేయవచ్చు.

* Nothing Phone (1)
నథింగ్ ఫోన్ (1) స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గేమింగ్ అవసరాలకు సరిపోతుంది. దీంట్లోని 6.55-అంగుళాల 120Hz OLED స్క్రీన్‌.. HDR 10+ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OSతో రన్ అవుతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది. ఇండియాలో నథింగ్ ఫోన్ (1) ధర రూ. 31,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

* Poco F4
ఈ 5G ఫోన్‌లో హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్ ఉంది. మిడ్-రేంజ్ 5G ఫోన్ సెగ్మెంట్‌లో అత్యుత్తమ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6.67-అంగుళాల E4 AMOLED 120Hz ప్యానెల్‌తో, HDR 10+ సర్టిఫికేషన్‌, 1,300నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు, 67W ఫాస్ట్ ఛార్జర్‌, 4,500mAh బ్యాటరీ, ఇతర ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ఇండియాలో రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేసినా కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?


* Xiaomi 11i హైపర్‌ఛార్జ్
120W ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఛార్జర్ ఫోన్ బ్యాటరీని దాదాపు 15-20 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌కు మద్దతునిచ్చే డ్యూయల్ స్పీకర్‌లు, మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే AMOLED డిస్‌ప్లే వంటివి ఈ ఫోన్ ఫీచర్లు. ఇండియాలో షియోమి 11i హైపర్‌ఛార్జ్ ధర రూ. 26,999. 67W ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చే మోడల్ ధర రూ. 24,999.

* OnePlus Nord 2T
ఈ డివైజ్ 80W ఫాస్ట్ ఛార్జర్‌తో, 4,500mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1,300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని 6.43-అంగుళాల డిస్‌ప్లే.. 90Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సర్టిఫికేషన్‌తో వస్తుంది. బోట్‌వేర్ ఉండదు కాబట్టి ఈ హ్యాండ్‌సెట్ యూజర్లు క్లీన్ ఇంటర్‌ఫేస్‌ను పొందుతారు. వన్‌ప్లస్ నార్డ్ 2T ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 28,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.



* iQOO నియో 6
ఈ లిస్ట్‌లో మంచి పర్పార్మెన్స్ ఇచ్చే 5G స్మార్ట్‌ఫోన్ ఇది. ఐక్యూ నియో 6 ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC చిప్‌తో పనిచేస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జర్‌తో, 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఛార్జర్ ఫోన్‌ను త్వరగా ఛార్జర్ చేస్తుంది. హ్యాండ్‌సెట్‌ AMOLED డిస్‌ప్లే 6.62-అంగుళాల పరిమాణంలో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సర్టిఫికేషన్‌కు మద్దతునిచ్చే హై-ఎండ్ E4 ప్యానెల్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget smart phone, POCO, Samsung, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు