Home /News /technology /

BEST OFFERS ON SMARTWATCHES TWS EARBUDS AND OTHER GADGETS UNDER RS 5000 IN FLIPKART END OF SEASON SALE 2022 UMG GH

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌ దిమ్మతిరిగే ఆఫర్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్..!

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు (Pic: Flipkart)

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు (Pic: Flipkart)

ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించిన ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై బెస్ట్‌ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ట్రాన్సాక్షన్స్‌పై డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.5 వేలలోపు సొంతం చేసుకోగలిగిన డివైజ్‌లు ఇవే..

ఇంకా చదవండి ...
ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించిన ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై బెస్ట్‌ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను ప్రకటించింది. దీంతోపాటు పేటీఎం, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ట్రాన్సాక్షన్స్‌పై డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.5 వేలలోపు సొంతం చేసుకోగలిగిన డివైజ్‌లు ఇవే..

నాయిస్ కలర్ ఫిట్ క్యాలిబర్(Noise ColorFit Caliber)
ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్‌ స్మార్ట్‌వాచ్‌ను రూ.1,999కు సొంతం చేసుకోవచ్చు. పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.40 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ క్యాలిబర్ 1.69-అంగుళాల టచ్-సపోర్టెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉన్న IP68-సర్టిఫైడ్ బిల్డ్‌తో వస్తుంది. స్మార్ట్ వాచ్ 60 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. బాడీ టెంపరేచర్‌, SpO2, హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ ఫీచర్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రూ.40 వేలలో బెస్ట్‌ స్నాప్‌డ్రాగన్ 888 ఫోన్లు ఇవే


నథింగ్‌ ఇయర్‌ 1(Nothing Ear 1)
ఫ్లిప్‌కార్ట్ నథింగ్ ఇయర్ 1 ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.4,999కే అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. TWS ఇవి ట్రాన్స్‌పరెంట్ డిజైన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC) సహా ఇతర ఫీచర్‌లతో వస్తాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వీటిని గరిష్టంగా 34 గంటల పాటు వినియోగించవచ్చు.

ఇదీ చదవండి: వెరీ ఇంట్రెస్టింగ్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు స్పెషల్ పెన్ను.. అసలు దీని కథేంటంటే..!


రియల్‌మీ వాచ్ 2
రియల్‌మీ వాచ్ 2 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,999కు అందుబాటులో ఉంది. పేటీఎం వాలెట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.40 క్యాష్‌బ్యాక్ దక్కుతుంది. స్మార్ట్ వాచ్ 1.4-అంగుళాల కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. SpO2 బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, హార్ట్‌ రేట్‌ మానిటర్‌ ఫీచర్‌లు ఉన్నాయి. 90 స్పోర్ట్స్ మోడ్‌లు, ప్రీలోడెడ్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ధర రూ.2,999(MRP రూ.3,999)గా ఉంది.

ఇదీ చదవండి: అగ్నివీర్స్ కోసం NIOS స్పెషల్ ప్రోగ్రామ్.. 12వ తరగతి పాస్ సర్టిఫికెట్ ఇవ్వనున్న సంస్థ


Mi Boost Pro 30000mAh పవర్ బ్యాంక్
ఫ్లిప్‌కార్ట్‌లో ఎంఐ బూస్ట్‌ ప్రో 30000mAh పవర్ బ్యాంక్‌ను డిస్కౌంట్‌పై రూ.2,499కు కొనవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. పవర్ బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌, పవర్ డెలివరీ(PD) 3.0 సపోర్ట్‌ చేస్తుంది. పవర్ బ్యాంక్ అవుట్‌పుట్ కోసం రెండు USB పోర్ట్‌లను, ఇన్‌పుట్ కోసం USB టైప్-C, మైక్రో-USB పోర్ట్‌లతో వస్తుంది. ధర రూ.2,499(MRP రూ.3,499)గా ఉంది.

ఇదీ చదవండి: నాన్నకు ప్రేమతో ఏం గిఫ్ట్ ఇస్తారు.. మా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి.. ఒకసారి చూడండీ..!


జేబీఎల్‌ బై హర్మాన్ ట్యూన్ 700BT
ఫ్లిప్‌కార్ట్ సేల్ JBL బై హర్మాన్ ట్యూన్ 700BT హెడ్‌ఫోన్స్‌ను డిస్కౌంట్‌పై రూ.3,900కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 27 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. హెడ్‌ఫోన్‌లలో బ్లూటూత్ v4.2, మల్టీపాయింట్ కనెక్టివిటీకి సపోర్ట్‌ కూడా ఉంది. ఇంటర్నల్‌ 3.5mm జాక్ ద్వారా వైర్డు కనెక్టివిటీకి సపోర్ట్‌ చేస్తుంది.

ఇదీ చదవండి: స్మోకింగ్ మానేయాలనుకున్నా సాధ్యం కావట్లేదా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..


JBL ఫ్లిప్ ఎసెన్షియల్
జేబీఎల్‌ ఫ్లిప్ ఎసెన్షియల్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌పై ధర రూ.4,999కు లభితోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లకు 10 శాతం ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. జేబీఎల్‌ ఫ్లిప్ ఎసెన్షియల్ 10 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. IPX7 వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌, బ్లూటూత్ స్పీకర్ డ్యూయల్ ఎక్స్‌టర్నల్ పాసివ్ బాస్ రేడియేటర్‌, బ్లూటూత్ v4.1 కనెక్టివిటీతో వస్తుంది.



రియల్‌మీ బడ్స్ Q2
రియల్‌మీ బడ్స్ Q2 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,999కు లభిస్తున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ అందుతుంది. ఫీచర్ల పరంగా రియల్మీ బడ్స్‌ Q2 బ్లూటూత్ 5.2తో వస్తుంది. ANC సపోర్ట్‌ చేస్తుంది. ఇయర్‌బడ్‌లలో IPX5 వాటర్-రెసిస్టెంట్ బిల్డ్, 88ms ల్యాటెన్సీ ఉన్నాయి. గరిష్టంగా 28 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Flipkart

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు