China Mobiles: చైనా స్మార్ట్ ఫోన్లు కొనొద్దనుకుంటున్నారా? వాటి ప్రత్యామ్నాయ ఫోన్లు ఇవే.. ట్రై చేయండి

China Mobiles: ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రభాగాన ఉన్న చైనాకు ధీటుగా భారత్, కొరియా, యూరప్, తైవాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్నాయి. ఇవి ధర, స్పెసిఫికేయన్స్ విషయంలో చైనా ఫోన్లకు ధీటుగా తమ బ్రాండ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

news18-telugu
Updated: October 22, 2020, 7:54 PM IST
China Mobiles: చైనా స్మార్ట్ ఫోన్లు కొనొద్దనుకుంటున్నారా? వాటి ప్రత్యామ్నాయ ఫోన్లు ఇవే.. ట్రై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు భారత్లోనే కాదు అనేక దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం చైనా బ్రాండ్లు తక్కువ ధరలో ఎక్కువ స్పెసిఫికేయన్ తో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందించడమే. ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రభాగాన ఉన్న చైనాకు ధీటుగా భారత్, కొరియా, యూరప్, తైవాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్నాయి. ఇవి ధర, స్పెసిఫికేయన్స్ విషయంలో చైనా ఫోన్లకు ధీటుగా తమ బ్రాండ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా భారత్ లో లభించే ఉత్తమ ఫోన్లపై ఓ లుక్కేద్దాం..

సాంసంగ్ గెలాక్సీ ఎం20

మీరు చైనా బ్రాండ్స్ రెడ్‌మి 8ఏ డ్యూయల్ లేదా రియల్‌ మీ నార్జో 10ఎకు ప్రత్యామ్నాయంగా స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే గెలాక్సీ ఎం20 మీకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సాంసంగ్ కొరియాకు చెందిన కంపెనీ. ఇది 6.3 -అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. ఎం20లో మైక్రో కెమెరా ఉండటం వల్ల మంచి క్లారిటీతో కెమెరా వస్తుంది. దీనిలో13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌ కెమెరా మరియు 8 ఎంపీ షూటర్ సెల్ఫీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 5,000mAh  లాంగ్ లైఫ్ బ్యాటరీతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్కువ సేపు చార్జింగ్ నిల్వ ఉంటుంది.

నోకియా 8.1
ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండి గ్లోబల్ చేత తయారు చేయబడిన నోకియా 8.1 దాదాపు అన్ని విభాగాల్లోనూ రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ మరియు రియల్‌మీ 6 ప్రో వంటి చైనా స్మార్ట్ ఫోన్లకు ధీటుగా నిలుస్తోంది. ఇది పూర్తి హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ 6.18- అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో పాటు స్నాప్‌ డ్రాగన్ 710 ఎస్ఓసీతో పనిచేస్తుంది. నోకియా 13 MP టెలి ఫొటో లెన్స్‌తో పాటు OIS తో జీస్-సర్టిఫైడ్ 12MP ప్రాథమిక కెమెరాను అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 20 ఎంపి సెల్ఫీ షూటర్ కెమెరా ఉంటుంది. దీనిలోని మూడు కెమెరాలను బోథీ మోడ్ ద్వారా సమష్టిగా ఉపయోగించవచ్చు. ఇది 3500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎం31
మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో చైనీస్ బ్రాండ్లకు మంచి ప్రత్యామ్నాయం సాంసంగ్ గెలాక్సీ ఎం31. ఇది ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.4- అంగుళాల అమోల్డెడ్ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోట్ 6GB RAMతో పనిచేస్తుంది. స్టోరేజి విషయానికి వస్తే 128GB RAM వరకు ఎక్స్పాండెబుల్ స్టోరేజ్ తో పనిచేస్తుంది. కెమెరా వెనుక భాగంలో 64 ఎంపీ క్వాడ్- కెమెరా ఉంటుంది. దీంతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 5 ఎంపి మాక్రో లెన్స్ మరియు 5 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్లో ఎక్కువ సేపు చార్జింగ్ నిల్వ ఉంటుంది.ఆసుస్ 6 జెడ్
తైవాన్ బ్రాండ్ అయిన ఆసుస్ 6 జెడ్ చైనా స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఆసుస్ స్మార్ట్ఫోన్ ఇన్నోవేటివ్ డిజైన్‌తో లభిస్తుంది. దీనిలో రొటేషనల్ కెమెరా మాడ్యూల్ తో లభించే డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇది ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాల లాగా పనిచేస్తుంది. స్నాప్‌ డ్రాగన్ 855తో పనిచేసే ఈ స్మార్ట్ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఆర్ఓజీ ఫోన్ 2
ROG ఫోన్ II స్మార్ట్ ఫోన్ ప్రెజర్-సెన్సిటివ్ ఎయిర్ ట్రిగ్గర్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది 6.59 ఇంచుల డిస్ ప్లేతో వస్తుంది. 8 జీబీ ర్యామ్ ఉండే ఈ ఫోన్లో 48 ఎంపి, 13 ఎంపి, 24 ఎంపి కెమెరాలు అందుబాటులో ఉంటాయి. దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్
మిడ్రేంజ్ చైనీస్ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ మరియు ఎస్ 10 లైట్ ఫోన్లు గొప్ప ఎంపికలుగా చెప్పవచ్చు. ప్రీమియం గెలాక్సీ లైనప్ నుంచి వచ్చే ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో హై-రిజల్యూషన్ 48 ఎంపీ కెమెరాలు ఉంటాయి. వీటిలో ప్రకాశవంతమైన, స్పష్టమైన అమోలెడ్ డిస్‌ప్లేలతో పాటు స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్ వంటి అడిషనల్ ఫీచర్లు ఉంటాయి.

పిల్ ఐఫోన్ ఎస్ఈ2020
హై-ఎండ్ సెగ్మెంట్లో భాగంగా ఈ ఏడాది ప్రారంభించిన బడ్జెట్ ఐఫోన్‌గా ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ2020ను పేర్కొనవచ్చు. ఐఫోన్ 8లో ఉన్న మాదిరిగానే ఐఫోన్ 11 సిరీస్‌లోనూ A13 బయోనిక్ ప్రాసెసర్‌ని చేర్చింది. సాధారణంగా ఆపిల్ డివైజెస్ లో ఉపయోగించే లాగ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ ను మీరు దీనిలో కూడా పొందుతారు. 4జీబీ ర్యామ్ తో వచ్చే ఈ ఐఫోన్ భారత మార్కెట్లో రూ.42500కు లభిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 11
ఆపిల్ నుంచి వచ్చిన ఐఫోన్ సిరీస్లలో అత్యంత ఆధరణ పొందిన స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 11. దీనిలో సున్నితమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుతారు. ఇది ఆండ్రాయిడ్ కు భిన్నంగా ఉంటుంది. ఐఫోన్ 11 12ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ తో వచ్చే రెండు బ్యాక్ కెమెరాలను అందిస్తుంది. తక్కువ కాంతి ఉన్నప్పుడు దానికదే ప్రారంభమయ్యే నైట్ మోడ్ దీనిలో అందుబాటులో ఉంది. న్యూరల్ ఇంజిన్ మరియు సిక్స్-కోర్ జిపియు కలిగిన A13 బయోనిక్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అయితే, అత్యాధునిక లక్షణాలతో వచ్చే ఈ ఫోన్ చైనా ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లతో ఫోన్లతో పోలిస్తే ఎక్కువ ధరకు లభిస్తుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎస్20
చైనా స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నయంగా వచ్చిన సాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ కు కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది. హై- రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, మల్టిపుల్ కెమెరాలతో వచ్చే ఈ ఫోన్ మునుపటి సిరీస్ల కంటే మంచి ఆప్టిమైజ్ యూఐను అందిస్తోంది. ఈ ఫోన్ ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ 25W ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, హెచ్‌డీఆర్ 10 ప్లస్ సర్టిఫికేషన్, ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌ వంటి ఫీచర్లతో వస్తుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎం 51
సాంసంగ్ గెలాక్సీ ఎం 51 భారీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. AMOLED డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 64MP క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 6 జీబీ ర్యామ్ తో వచ్చే ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading