హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Best Gaming Smartphones: ఆన్‌లైన్ గేమ్స్‌కి బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. రూ.20 వేల బడ్జెట్‌‌లో గేమింగ్ మొబైల్స్ ఇవే!

Best Gaming Smartphones: ఆన్‌లైన్ గేమ్స్‌కి బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. రూ.20 వేల బడ్జెట్‌‌లో గేమింగ్ మొబైల్స్ ఇవే!

గేమింగ్ కోసం అతి తక్కువలో వచ్చే స్మార్ట్ ఫోన్లు.

గేమింగ్ కోసం అతి తక్కువలో వచ్చే స్మార్ట్ ఫోన్లు.

స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone)లో గేమ్స్‌ ఆడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. గేమింగ్‌ (Gaming)కు సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌లు సొంతం చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించాలని భావిస్తారు. కానీ బడ్జెట్‌ (Budget)లోనే బెస్ట్‌ ఫీచర్‌లతో, గేమింగ్‌ సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇంకా చదవండి ...

స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. గేమింగ్‌కు సపోర్ట్‌ చేసే Smart phoneలు సొంతం చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించాలని భావిస్తారు. కానీ బడ్జెట్‌లోనే బెస్ట్‌ ఫీచర్‌లతో, gaming సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే బెస్ట్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందవచ్చు. Redmi నోట్‌ 11 ప్రో, ఐక్యూ జెడ్‌6 నుంచి వివో టీ1 వరకు, రూ.20 వేల లోపు బెస్ట్‌ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

రూ.20000 లోపు లభించే గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో(Redmi Note 11 Pro)

షావోమి కంపెనీ లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్‌ 11 ప్రో 5G ధర ప్రస్తుతం రూ.18,999గా ఉంది. హీలియో G96 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది COD: మొబైల్, BGMI వంటి హై గ్రాఫిక్స్ గేమ్‌లను ఆడటానికి సపోర్ట్‌ చేస్తుంది. రూ.20 వేలు లోపు లభిస్తున్న ఫోన్‌లలో బెస్ట్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. లభించేది 6.67-అంగుళాల ఫుల్ HD+AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: వాట్సాప్ కొత్త ఫీచర్.. వీడియో కాల్‌లో మస్తు మజా.. ఇకపై ఆ గోల అస్సలుండదు


ఐక్యూ జెడ్‌6(iQOO Z6 5G)

కేవలం గేమింగ్ కోసం మాత్రమే కాకుండా ఇతర అదనపు ఫీచర్‌లతో ఐక్యూ జెడ్‌6 5G ఆకట్టుకుంటోంది. ఇది ఆండ్రాయిడ్ 12పై రన్‌ అవుతుంది. మంచి బ్యాటరీ లైఫ్, కెమెరాలను అందిస్తుంది. ఐక్యూ జెడ్‌6 ధర కేవలం రూ.13,999. స్నాప్‌డ్రాగన్ 696 చిప్‌సెట్, వెనుకవైపు 50MP, 2MP, 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ లేదా.. డోంట్‌వర్రీ! ఈ ఐదు స్కూటర్లు మీకోసమే ప్రత్యేకంగా..!


వివో టీ1 5G(Vivo T1 5G)

వివో టీ1 5G అనేది గేమింగ్‌ కోసం తయారు చేసిన బెస్ట్‌ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 6.58-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని ధర కేవలం రూ.14,499గా ఉంది.

పోకో ఎక్స్‌3 ప్రో(POCO X3 Pro)

పోకో ఎక్స్‌3 ప్రో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో బెస్ట్‌గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఇది పబ్జీ మొబైల్, COD మొబైల్, ఫోర్ట్‌నైట్, Asphalt 9: Legends వంటి మరిన్ని గేమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని ధర దాదాపు రూ.18,499.

రియల్ మీ 9 ఎస్‌ఈ 5జీ(Realme 9 SE 5G)

Realme 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్‌ 778G 5G చిప్‌సెట్‌తో వస్తుంది. బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ ధర ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది రూ.19,999లకు అందుబాటులో ఉంది. బెస్ట్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించే ఫోన్‌లలో రియల్మీ 9 ఎస్‌ఈ ఉత్తమంగా నిలిచింది.

First published:

Tags: Gaming, Redmi, Smart phone, Tech news

ఉత్తమ కథలు