కరోనా తర్వాత స్మార్ట్‌ఫోన్ (Smart Phones)అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా, గేమింగ్ (Gaming) స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. దీంతో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండయా, పబ్జీ న్యూ స్టేట్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్(Mobile) వంటి గేమ్‌లకు ఆదరణ బాగా పెరిగింది. సాధారణంగా గేమింగ్ ఫోన్లు ప్రీమియం, మిడ్‌రేంజ్ ధరలోనే లభిస్తాయి. కానీ కొన్ని కంపెనీలు కేవలం రూ. 15 వేల బడ్జెట్ ధరలోనే గేమింగ్ ఫొన్లను అందుబాటులోకి తెచ్చాయి. మీరు సరసమైన ధరకే బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే.. వీటిపై ఓ లుక్కేయండి.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2..
మీరు కేవలం రూ. 15 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 బెస్ట్ ఆప్షన్. మైక్రోమాక్స్ ఇన్ ఫోన్ 6.43-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ పెద్ద డిస్ప్లే గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. తక్కువ నుంచి మీడియం గ్రాఫిక్‌లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిలో 5000mAh బ్యాటరీ అందించింది. సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 కేవలం రూ. 13,499 ధర వద్ద లభిస్తుంది.
Jio, Airtel, Vi అందించే ఈ డేటా బూస్టర్ ప్లాన్ల గురించి మీకు తెలుసా..? కేవలం రూ. 15 నుంచే..
మోటో జీ51 5G..
మోటరోలా నుంచి విడుదలైన మోటో G51 గేమింగ్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 -అంగుళాల హోల్-పంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480+ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 -మెగాపిక్సెల్ కెమెరా, వెనుకవైపు 2 -మెగాపిక్సెల్ కెమెరాలను అందించింది. మోటో G51 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. మోటో G51 5G స్మార్ట్‌ఫోన్ రూ. 14,999 ధర వద్ద లభిస్తుంది.
Union Budget 2022: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గబోతున్నాయి
ఇన్ఫినిక్స్ నోట్ 11..
ఇన్ఫినిక్స్ నోట్ 11 గేమింగ్ ప్రియులు ఎంచుకోగల మరో బెస్ట్ ఫోన్. ఇది 6.6 -అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 11 శక్తివంతమైన హీలియో G88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మీకు మంచి గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. దీనిలోని 5000mAh బ్యాటరీ సాధారణ వినియోగంలో మీకు రోజంతా బ్యాకప్ ఇస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 11లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలను చేర్చింది. సెల్ఫీల కోసం, 16 -మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఈ ఫోన్ రూ.11,999 ధర వద్ద అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Android