Home /News /technology /

BEST DEALS ON REDMI BLAUPUNKT AND MORE SMART TVS ON INDEPENDENCE DAY SALE UMG GH

ఇండిపెండెన్స్ డేకి దిమ్మతిరిగే ఆఫర్లు.. టీవీలపై భారీ డిస్కౌంట్స్.. మిస్ చేసుకోవద్దు..!

ఇండిపెండెన్స్ డేకి దిమ్మతిరిగే ఆఫర్లు.. టీవీలపై భారీ డిస్కౌంట్స్..

ఇండిపెండెన్స్ డేకి దిమ్మతిరిగే ఆఫర్లు.. టీవీలపై భారీ డిస్కౌంట్స్..

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో 70-అంగుళాల Sansui Ultra HD 4K స్మార్ట్ LED ఇప్పుడు రూ. 59,990కే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 71,990గా ఉంది. అంటే కొనుగోలుదారులు దాదాపు రూ.12 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
భారతదేశంలో దసరా, దీపావళి వంటి పండుగ వేళల్లో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు అదిరిపోయే డిస్కౌంట్స్‌ ప్రకటిస్తుంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా కూడా ఈ కంపెనీలు కళ్లు చెదిరే డిస్కౌంట్లు (Discounts), ఆఫర్లను (Offers) కొనుగోలుదారుల ముందు ఉంచుతాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవానికి మరో వారం రోజులు ఉండగానే అమెజాన్ (Amazon) గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 10 వరకు భారతదేశంలో నిర్వహిస్తోంది. ఈ సేల్స్ సమయంలో, కొనుగోలుదారులు భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లు అందుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్స్, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి మరిన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లను దక్కించుకోవచ్చు.

స్మార్ట్ టీవీలపై బెస్ట్ డీల్స్‌
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, విజయ్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో 70-అంగుళాల Sansui Ultra HD 4K స్మార్ట్ LED ఇప్పుడు రూ. 59,990కే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 71,990గా ఉంది. అంటే కొనుగోలుదారులు దాదాపు రూ.12 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ టీవీ HDR 10, వైడ్ కలర్ గామట్‌తో వస్తుంది. అలానే ఇందులో 3 HDMI, 2 USB పోర్ట్‌లు, బ్లూటూత్, Wi-Fi, అలాగే 3.5mmతో ఇయర్‌ఫోన్‌ జాక్ వంటి బెస్ట్ కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి. Sansui 40-అంగుళాల ఫుల్ HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED ఇప్పుడు రూ.19,990 నుంచి తగ్గి రూ.16,990కే దొరుకుతోంది. ఈ ధరలు ఏదైనా పాత వర్కింగ్ టీవీని విజయ్ స్టోర్‌లలో లేదా వెబ్‌సైట్‌లో ఎక్స్ఛేంజ్ చేస్తేనే వర్తిస్తాయి.



ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో కొనుగోలుదారులు 10 శాతం డిస్కౌంట్స్ అందుకోవచ్చు. 32-అంగుళాల Blaupunkt TV సైబర్ సౌండ్ ని రూ.13,499 ధరకు బదులుగా రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. Blaupunkt TV సైబర్ 40-అంగుళాల మోడల్‌ను రూ.1,000 డిస్కౌంట్‌తో రూ. 15,999కి దక్కించుకోవచ్చు. అలానే 42-అంగుళాల ఫుల్-హెచ్‌డీ టీవీ మోడల్ ఇప్పుడు మీకు రూ.19,999 నుంచి రూ.17,999 తగ్గుతుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ వెర్షన్, అల్ట్రా-థిన్‌ బెజెల్, 1GB RAM, 8GB ROM, అద్భుతమైన సరౌండ్ సౌండ్ సర్టిఫైడ్ ఆడియో, 40W స్పీకర్ అవుట్‌పుట్‌తో 2 స్పీకర్లతో వస్తుంది.

రెడ్‌మీ 32-అంగుళాల LED స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.24,999 నుంచి భారీగా తగ్గి రూ.12,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీకి సెట్-టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్, మరిన్నింటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో డాల్బీ అట్మోస్, ప్యాచ్ వాల్ 4, 2 HDMI పోర్ట్‌లు అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో iFFALCON టీవీ K61, F52 స్మార్ట్ టీవీలు కూడా తగ్గింపు ఇతరులతో కొనుగోలు చేయవచ్చు. iFFALCON టీవీ K61 రూ.29,999కే ఇస్తే F52 టీవీ రూ.10,999కే దొరుకుతుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget smart tv, Independence Day, Offers, Smart TV

తదుపరి వార్తలు