Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ

Amazon Freedom Sale | Metz 40 అంగుళాల టీవీ మోడల్ నెంబర్ M40E6. 1920x1080 పిక్సెల్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 16 వాట్ టోటల్ సౌండ్ ఔట్‌పుట్ లాంటి ఫీచర్లున్నాయి.

news18-telugu
Updated: August 7, 2019, 4:39 PM IST
Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ
Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ
  • Share this:
స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో అద్భుతమైన డీల్ ఉంది. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ప్రైమ్ యూజర్లకు ఇప్పటికే ప్రారంభమైంది. నాన్-ప్రైమ్ యూజర్లకు ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ సేల్ జరగనుంది. జర్మన్ టెలివిజన్ కంపెనీ అయిన Metz డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీపై ఏకంగా రూ.2,000 డిస్కౌంట్ ప్రకటించింది. గతంలో Metz 40 అంగుళాల టీవీ ధర రూ.19,999 కాగా, ప్రస్తుత ధర రూ.17,999. అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుతో కొన్నవారికి అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.

Metz 40 అంగుళాల టీవీ మోడల్ నెంబర్ M40E6. 1920x1080 పిక్సెల్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 16 వాట్ టోటల్ సౌండ్ ఔట్‌పుట్ లాంటి ఫీచర్లున్నాయి. ఆండ్రాయిడ్ టీవీ కావడంతో గూగుల్ అసిస్టెంట్‌తో పాటు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, స్పాటిఫై, జీ5, సోనీ లివ్, వూట్, సన్ నెక్స్ట్‌ లాంటి యాప్స్ వాడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ ఫీచర్లు బాగా పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. వాయిస్ సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్స్ కోసం రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్ బటన్ కూడా ఉంటుంది.

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు




ఇవి కూడా చదవండి:

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?

SBI Wealth: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? 'ఎస్‌బీఐ వెల్త్' గురించి తెలుసా?WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?
First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు