హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Budget Smartphones: రూ.10 వేలలోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్.. అన్నీ టాప్ బ్రాండ్ కంపెనీలవే..!

Budget Smartphones: రూ.10 వేలలోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్.. అన్నీ టాప్ బ్రాండ్ కంపెనీలవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ బడ్జెట్ రూ.10వేలు అయ్యి ఉండి, ఈ ధరలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తుంటే.. టాప్ ఫీచర్లతో వచ్చిన ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి..

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. ఎందుకంటే అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఫోన్లను రిలీజ్ చేశాయి. వీటి నుంచి బెస్ట్ ఫోన్‌ను సెలక్ట్ చేసుకోవడం కష్టమైన పని. ధరల వారీగా అన్ని ఫీచర్లను పోల్చి చూస్తూ మంచి హ్యాండ్‌సెట్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ బడ్జెట్ రూ.10వేలు అయ్యి ఉండి, ఈ ధరలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తుంటే.. టాప్ ఫీచర్లతో వచ్చిన ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి..

* Redmi 10A

బడ్జెట్ రేంజ్‌లో షియోమి డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 10A. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G35 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లే మంచి అవుట్‌పుట్ అందిస్తుంది. దీంట్లో 13MP, 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. దీని ప్రారంభ ధర రూ. 9,499. చార్‌కోల్ బ్లాక్, సీ బ్లూ, స్లేట్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

* జియో ఫోన్ నెక్స్ట్

దీని ధర రూ.7000 లోపే ఉండటం విశేషం. రిలయన్స్ నుంచి వచ్చిన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్.. జియో ఫోన్ నెక్ట్స్. దీంట్లో 5.45-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. బేసిక్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 3500mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ QM215 చిప్‌సెట్, డ్యుయల్ 4G SIM పోర్ట్‌లు.. వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు.

ఇదీ చదవండి: పొరిగింటోళ్లకి రూ.19 లక్షల గిఫ్ట్ ఇచ్చిన మహిళ.. ఎందుకో తెలుసా..? ఈ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే


* Realme Narzo 50i

రూ.10 వేల ప్రైస్ రేంజ్‌లో బెస్డ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. రియల్‌మీ నార్జో 50i ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.8,999గా ఉంది. 4GB RAM, 64GB మెమరీ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది.

* Poco C3

పోకో C3 స్మార్ట్‌ఫోన్ 6.53 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఈ ఫోన్ 13MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP పోర్ట్రెయిట్ లెన్స్, 2MP మాక్రో కెమెరాతో వస్తుంది, ముందు భాగంలో 5MP సెల్పీ కెమెరా ఉంది. ఇది 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ మాట్ బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 9,999.

* Redmi 9

రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,499. ఈ డివైజ్ 6.53 అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది. దీని పెద్ద డిస్‌ప్లే స్పెషల్ ఎట్రాక్షన్. ఈ ఫోన్ హీలియో G35 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంట్లో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోటోగ్రఫీ కోసం 13MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్, 5MP మాక్రో, 2MP డెప్త్ కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

First published:

Tags: 5g smart phone, Budget smart phone, New smart phone, Tech news

ఉత్తమ కథలు