Home /News /technology /

BEST BIKE BETWEEN BAJAJ PULSAR N160 VS PULSAR NS160 UMG GH

Pulsar Bikes: బజాజ్ పల్సర్ N160 vs పల్సర్ NS160.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్ అంటే..?

బజాజ్ పల్సర్ N160 vs పల్సర్ NS160.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్ అంటే..?

బజాజ్ పల్సర్ N160 vs పల్సర్ NS160.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్ అంటే..?

బజాజ్ ఆటో కంపెనీ నుంచి 160సీసీ మోటార్‌సైకిళ్ల లైనప్‌లో రెండు పల్సర్లు హవా కొనసాగిస్తున్నాయి. వీటిలో ఒకటి పల్సర్ NS160 కాగా, మరొకటి కొత్త పల్సర్ N160. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్? ధర, ఫీచర్ల పరంగా ఏది మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది? వంటి వివరాలు మీకోసం..

ఇంకా చదవండి ...
బజాజ్ పల్సర్ బైక్స్‌ ఇండియాలో ఒక రేంజ్‌లో సేల్ అవుతుంటాయి. బజాజ్ ఆటో కంపెనీ 2004లో పల్సర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ లైనప్‌లో కొత్త వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ సిరీస్‌లో 150సీసీ నుంచి 250సీసీ ఇంజిన్ కెపాసిటీతో బైక్స్ వచ్చాయి. కొత్తగా 160సీసీ మోటార్‌సైకిళ్ల లైనప్‌లో రెండు పల్సర్లు హవా కొనసాగిస్తున్నాయి. వీటిలో ఒకటి పల్సర్ NS160 కాగా, మరొకటి కొత్త పల్సర్ N160. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్? ధర, ఫీచర్ల పరంగా ఏది మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది? వంటి వివరాలు మీకోసం..

* ఇంజిన్, గేర్‌బాక్స్
కొత్త బజాజ్ పల్సర్ N160 2-వాల్వ్ హెడ్‌ 164.8cc ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే NS160 మాత్రం 4-వాల్వ్ హెడ్‌ 160.3cc ఇంజిన్‌తో వస్తుంది. పవర్ ఫిగర్స్‌లో కూడా తేడాలు ఉంది. N వేరియంట్ 16 hp పవర్‌ను అందిస్తుంది. NS వేరియంట్ 17.2 hpతో కొంచెం ఎక్కువ శక్తివంతమైనది. N వేరియంట్ 14.65 Nm టార్క్, NS వేరియంట్ 14.6 Nm టార్స్‌ను అందిస్తాయి. రెండు ఇంజిన్‌లు ఒకే రకమైన ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఓవర్‌హెడ్ కామ్‌ను కలిగి ఉంటాయి. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లాంచ్ అయ్యాయి.

* ఫీచర్లు, ఎక్విప్‌మెంట్
పల్సన్ N160 బైక్ సింగిల్-డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌తో వస్తుంది. అయితే NS160 పెరిమీటర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. N160 చంకియర్ టైర్‌లతో వస్తుంది. అందువల్ల ఈ బైక్ NS160 కంటే హెవీగా ఉంటుంది. N మోడల్ సింగిల్-ఛానల్ ABS వేరియంట్ బరువు 152 kg కాగా, డ్యుయల్-ఛానల్ ABS వేరియంట్ బరువు 154 kgగా ఉంటుంది.

ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేసినా కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?


మరోవైపు, NS160 బరువు 151 కిలోలు ఉంటుంది. ఇందులో సింగిల్-ఛానల్ ABS వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. నిజానికి ఈ సెగ్మెంట్‌లో డ్యుయల్-ఛానల్ ABS ఉన్న మోడల్ N160 మాత్రమే. N 160 బ్రేక్‌లు కూడా పెద్దగా ఉంటాయి. వీటి కెపాసిటీ 300 mm లేదా 280 mm డిస్క్ అప్ ఫ్రంట్ (ABS వేరియంట్ ఆధారంగా), వెనుక వైపు 230 mm ఉంటాయి. NS 160 బైక్‌ బ్రేక్స్‌ సైజ్ ముందు 260 mm, వెనుక 230 mm ఉంటుంది. N160 వేరియంట్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, USB ఛార్జింగ్ పోర్ట్, కొత్త సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, గేర్ పొజిషన్ ఇండికేటర్‌ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. కానీ NS వేరియంట్లో ఇన్ని ఫీచర్లు లేవు.

* ధర
NS160, N160 సింగిల్-ఛానల్ ABS వేరియంట్ మోడళ్ల ధర రూ.1,22,854గా ఉంది. డ్యుయల్-ఛానల్ ABS N160 వేరియంట్‌ ధర రూ.5వేలు ఎక్కువగా ఉంది. ఇది రూ. 1,27,853 వద్ద లభిస్తోంది.



* రెండు మోడళ్లలో ఏది బెస్ట్?
NS160 మరింత శక్తివంతమైనది, తేలికైనది. అయితే N160 ఫ్లాటర్ టార్క్ కర్వ్‌ను డెలివర్ చేస్తుంది. విహారయాత్రలకు N160 బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇది స్పోర్టియర్ లుక్‌తో షార్ప్‌గా కనిపిస్తుంది. కమ్యూటింగ్ అవసరానికి మాత్రమే బైక్ కొనాలంటే.. NS160 మంచి ఆప్షన్‌గా ఉంటుంది. కానీ మంచి పర్పార్మెన్స్‌తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారు N160ను కొనుగోలు చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Bajaj, Bikes, New bikes

తదుపరి వార్తలు