ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా బ్యాటరీ లైఫ్‌ను ఇచ్చి.. తర్వాత రోజు ఉదయానికి కూడా కాస్తంత ఛార్జింగ్ మిగిలి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది ప్రధాన అంశంగా మారింది. దీంతో బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచడంపై కంపెనీలు శ్రద్ధ పెడుతున్నాయి. చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను మల్టిపుల్ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీంతో యూజర్లకు బెస్ట్ బ్యాటరీ లైఫ్ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. మీరుకూడా మంచి బ్యాటరీ కెపాసిటీ ఉండే ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఈ నెలలో, ఈ విభాగంలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లను పరిశీలించండి.
Samsung Galaxy S22 Ultra
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ వేరియంట్ ఒక్క ఛార్జ్‌తో రోజంతా పని చేస్తుంది. ఈ ఫోన్లో WQHD+ 120Hz డిస్ప్లే, ఒక ఎస్ పెన్, బిగ్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్ వంటి బెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో ఒక్క గంటలోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
iPhone 13 Pro Max
బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువగా ఇచ్చే ఫోన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఒకటి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫోటోగ్రఫీ, గేమింగ్ వంటి హెవీ వర్క్స్ సపోర్ట్ చేస్తూ కూడా, ఐఫోన్ 13 మ్యాక్స్ రోజంతా పని చేసి అదనంగా 20- 30 శాతం బ్యాటరీని మిగులుస్తుంది. ఐడియల్ డ్రెయిన్ తక్కువగా ఉండటంతో 27 శాతం బ్యాటరీతోనే సాధారణ పనులకు రోజంతా ఫోన్‌ను ఉపయోగించవచ్చు. 20W యాపిల్ ఛార్జర్ ఫుల్ ఛార్జ్‌కి 1.5 గంటల సమయం పడుతుంది. నంబర్స్‌లో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా లేకపోయినా.. యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ క్లాస్-లీడింగ్ ఆప్టిమైజేషన్ ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ను బెస్ట్ ఆప్షన్‌గా నిలిపింది.
iQOO Neo 6
ఐక్యూ నియో 6 స్మార్టఫోన్ రూ.29,999కు అందుబాటులో ఉంది. ఇది గేమింగ్ ఫోన్, సాధారణంగా గేమింగ్ ఫోన్లు సాధారణంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందించవు. అయినప్పటికీ ఐక్యూ నియో 6 స్నాప్‌డ్రాగన్ 870 చిప్, అగ్రెసివ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్, 4700mAh బ్యాటరీతో రోజంతా పని చేస్తుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 45 నిమిషాలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
Oppo Reno 7 Pro 5G
బెస్ట్ కెమెరాలు, ఫ్యాన్సీ డిజైన్‌పై మాత్రమే దృష్టి సారించిన ఒప్పో రెనో 7 ప్రో 5జీ బ్యాటరీ ఛాంప్‌గా నిలిచింది. దీని ధర ప్రస్తుతం రూ.40,000గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్, కెమెరాలను పూర్తి సామర్థ్యంతో ఉపయోగిస్తే, సాధారణ పనులను వినియోగించినా రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఆ తర్వాత కూడా 20-30 శాతం ఛార్జ్ మిగిలి ఉంటుంది. రెనో 7 ప్రో 65W ఫాస్ట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, దాదాపు 45 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
Realme GT Neo 3
రియల్మీ జీటీ నియో 3 మరో అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను అందించే స్మార్ట్‌ఫోన్. పవర్ఫుల్ డైమెన్సిటీ 8100 చిప్, 120Hz AMOLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ రోజంతా బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. మరుసటి రోజు కోసం కూడా బ్యాటరీ ఉంటుంది. 150W ఛార్జింగ్ సొల్యూషన్ ద్వారా చాలా త్వరగా ఫోన్ ఛార్జ్ అవుతుంది.
Motorola Moto G52
మోటొరోలా మోటో జీ52 బెస్ట్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఒక్క ఛార్జ్‌తో రెండు రోజులపాటు సాధారణ అవసరాలకు ఫోన్‌ను ఉపయోగించవచ్చు. ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ 12, 5000mAh బ్యాటరీ, పవర్ ఎఫెక్టివ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 20W ఛార్జర్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మోటో జీ52 ధర రూ.13499గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Iphone, Oppo, Smart phones, Tech news