Home /News /technology /

BEST ANDROID PHONE BUY REALME C11 2021 FOR RS 5699 ONLY HERE OFFER DETAILS NS

realme C11 2021: తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, ఈ ఫోన్ ధర రూ.5,699 మాత్రమే.. లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజు అంటే మే 8 ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌కి చివరి రోజు. ఈ సేల్‌లో వినియోగదారులు ప్రముఖ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, బెస్ట్ ఆఫర్‌లు అందుకోవచ్చు.

    ఈ రోజు అంటే మే 8 ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌కి చివరి రోజు. ఈ సేల్‌లో వినియోగదారులు ప్రముఖ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు మరియు ఆఫర్‌లు అందుకోవచ్చు. సెల్‌లో చాలా రకాల స్మార్ట్ ఫోన్‌లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. Realme C11 2021ని చాలా తక్కువ ధరకే ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. Realme C11 స్మార్ట్ ఫోన్ యొక్క అసలు ధర రూ. 7,999. కానీ ఈ సేల్‌లో అన్ని ఆఫర్‌ల తర్వాత రూ. 5,699కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ మీ C11 2021 6.5-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz. రియల్ మీ C11 Android 11 ఆధారంగా Realme UI 2.0పై పని చేస్తుంది. Unisoc SC9863 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఇవ్వబడింది.ఈ ఫోన్ 2 GB RAM మరియు 32 GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్టోరేజ్ ను మెమరీ కార్డ్ సహాయంతో పెంచవచ్చు.

    Realme C11 (2021)లో కెమెరా మరియు బ్యాటరీ ప్రత్యేకం. కెమెరా విషయానికి వస్తే రియాల్ మీ C11 2021లో 8-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఇవ్వబడింది. అదే సమయంలో, సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ ఇవ్వబడింది. ఇది 48 గంటల స్టాండ్‌బైతో పని చేస్తుందని చెబుతున్నారు. అలాగే, ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్‌లో GPS, మైక్రో USB పోర్ట్, USB OTG, 4G, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ ఉంది.

    ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు రూ.6,950 తగ్గింపు అందుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిసన్, మోడల్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Realme, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు