పండుగ ఆఫర్ల (Festival Offers) సందడి చివరి దశకు చేరుకుంది. దసరా నుంచి వివిధ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పోర్టల్స్ ఫెస్టివల్ సేల్స్ ప్రకటించాయి. అయితే ధన త్రయోదశి, దీపావళి (Diwali 2022) సందర్భంగా కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేడు ధన త్రయోదశి సందర్బంగా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. మీరు కూడా ఈ సెంటిమెంట్ ప్రకారం కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (5G Smartphone) కొనుగోలు చేయాలనుకుంటే.. ప్రస్తుత ఆఫర్లలో రూ.20వేల బడ్జెట్లో లభిస్తున్న మోడల్స్ ఏవో చూద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ M33 5G
గెలాక్సీ M33 5G ఫోన్, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ One UI 4.1తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈక్వినాక్స్ 1280 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ డివైజ్‌లో స్పోర్ట్స్ క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ఫోన్‌పై అమెజాన్ 38 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో మిస్టిక్ గ్రీన్ కలర్ గెలాక్సీ M33 5G ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ లో దీవాళీ సేల్ షురూ.. ఆఫర్లే ఆఫర్లు.. ఈ 5G ఫోన్ పై ఏకంగా 40 వేల డిస్కౌంట్..
ఒప్పో K10 5G
ఈ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లే, 48MP ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఓషియన్ బ్లూ కలర్ ఒప్పో K10 5G ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై ప్రస్తుతం అమెజాన్ 22 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ఫోన్‌ను రూ. 19,499కే కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ 9i 5G
6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో వచ్చే రియల్మీ 9i ఫోన్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ 15 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. తాజా సేల్‌లో మెటాలిక్ గోల్డ్‌లో, 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన రియల్మీ 9i 5G ఫోన్‌ను రూ. 16,979కే సొంతం చేసుకోవచ్చు.
ఐక్యూ Z6 లైట్ 5G
ఈ ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్డి+ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీ, ఇతర ఫీచర్లతో ఐక్యూ ఈ మోడల్‌ను రూపొందించింది. ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్‌పై అమెజాన్ 18 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో 6GB RAM, 128GB స్టోరేజ్ స్టెల్లార్ గ్రీన్ కలర్ వేరియంట్‌ను రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు.
పోకో X4 ప్రో 5G
పోకో X4 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది DCI-P3కి సపోర్ట్ చేస్తుంది. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో బెస్ట్ పర్పార్మెన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో రన్ అయ్యే ఈ డివైజ్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. దీని మార్కెట్ ధర రూ.23,999 కాగా, ప్రస్తుతం అమెజాన్ దీనిపై 27 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు పోకో X4 ప్రో 5G ఫోన్ లేజర్ బ్లూ కలర్, 6GB RAM, 128GB వేరియంట్‌ను ఆఫర్లో రూ. 17490కు కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Diwali 2022, Mobile offers, Smartphone