Home /News /technology /

Best 5G Smartphones: తక్కువ ధరలో బెస్ట్​ 5జీ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా.. అయితే వీటిపై ఓలుక్కేయండి..

Best 5G Smartphones: తక్కువ ధరలో బెస్ట్​ 5జీ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా.. అయితే వీటిపై ఓలుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Best 5G Smartphones: భారత్​లో ఇంకా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అయినా ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థలు పోటీపోటీగా 5జీ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కేవలం రూ. 20 వేల ధరలోనే 5జీ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తున్నాయి.

భారత్​లో ఇంకా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అయినా ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థలు పోటీపోటీగా 5జీ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కేవలం రూ. 20 వేల ధరలోనే 5జీ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తున్నాయి. దీంతో 5జీ స్మార్ట్​ఫోన్​ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. మీరు కూడా రూ. 20 వేలలోపు బడ్జెట్​ 5జీ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే ఈ స్మార్ట్​ఫోన్లను పరిశీలించండి.

రియల్​మీ 8ఎస్​ 5G
భారత మార్కెట్​లో రూ. 20 వేల ధరలో లభిస్తున్న బెస్ట్​ స్మార్ట్‌ఫోన్లలో రియల్​మీ 8ఎస్​ 5జీ ఒకటి. ఈ స్మార్ట్​ఫోన్​ 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ గల 6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 64 -మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. ఇది మీడియా టెక్​ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలోని 5000mAh బ్యాటరీ డార్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.

Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


ఐక్యూ Z3
రూ. 20,000 లోపు బెస్ట్​ 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఐక్యూ Z3 డివైజ్ బెస్ట్ ఆప్షన్​. ఈ స్మార్ట్​ఫోన్​ 120hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్​ గల 6.58 అంగుళాల IPS LCD డిస్​ప్లేతో వస్తుంది. ఇది క్యాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 768G SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలోని 4400mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం42 5జీ
శామ్సంగ్​ గెలాక్సీ ఎం 42 5జీ ప్రస్తుతం భారత మార్కెట్​లో రూ. 20,000 ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్​ఫోన్​. ఇది 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్​ను అందించింది. ఇది క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 750జీ ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలోని 5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.

Amazon Final Days Offers: అమెజాన్ ఫైనల్ డేస్ ఆఫర్స్.. తగ్గిన స్మార్ట్ ఫోన్ ధరలు.. కొన్ని గంటల్లో ముగియనున్న ఆఫర్..


రెడ్​మీ నోట్ 10T 5G
రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్​ఫోన్లలో రెడ్​మీ నోట్​10T 5G కూడా ఒకటి. ఈ స్మార్ట్​ఫోన్​ 6.5 -అంగుళాల IPS LCD డిస్​ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్​ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 48- మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్​ను అందించింది. దీనిలోని 5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.

Airtel KYC Fraud: ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం.. ఆ కేటుగాళ్లు ఏం చేస్తారో తెలుసా..


పోకో ఎం3 ప్రో 5G
ప్రస్తుతం భారత మార్కెట్​లో రూ. 20,000 లోపు లభిస్తున్న బెస్ట్​ 5G స్మార్ట్‌ఫోన్లలో పోకో ఎం3 ప్రో 5G కూడా ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్​ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 6.5 -అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. 48- మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​తో వస్తుంది. దీనిలోని 5000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Latest Technology, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు