హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Phones: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్..రూ.15 వేలలో బెస్ట్ మోడల్స్ ఇవే..!

5G Phones: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్..రూ.15 వేలలో బెస్ట్ మోడల్స్ ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం రూ.15వేలలో మార్కెట్లో ఉన్న బెస్ట్ 5జీ డివైజ్‌లపై ఓ లుక్కేయండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

5G Phones: దేశంలో 5G సేవల ప్రారంభంతో, ఈ నెట్‌వర్క్‌ను క్రమంగా అన్ని ప్రాంతాలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి టెలికాం కంపెనీలు. ఇదే సమయంలో మార్కెట్లోకి కొత్త 5G ఫోన్లను తీసుకురావడంపై స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ దృష్టి పెట్టాయి. బడ్జెట్, మిడ్‌రేంజ్‌, ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్లు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం రూ.15వేలలో మార్కెట్లో ఉన్న బెస్ట్ 5జీ డివైజ్‌లపై ఓ లుక్కేయండి.

 Samsung Galaxy M13 5G

ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.14,299కు అందుబాటులో ఉంది. ఇది HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.5-అంగుళాల LCD స్క్రీన్‌తో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ను వినియోగించారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరలో 5G ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

 Poco M4 5G

ఈ స్మార్ట్‌ఫోన్ 4GB + 64GB వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,999కు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 6.58-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌తో లభిస్తుంది. ఇది మీడియా‌టెక్ డైమెన్షిటీ 700 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Amazon Alexa: స్మార్ట్‌ఫోన్లలో ఇక ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.. మార్చి 31 డెడ్‌లైన్!

 Redmi Note 11T 5G

ప్రస్తుతం నోట్ 11టీ 5G ఫోన్ రూ.16,999కు అందుబాటులో ఉంది. అయితే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో దీన్ని మరింత తక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో లభిస్తోంది. ఇది MediaTek డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.

 iQOO Z6 Lite 5G

ఐకూ జడ్6 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.13,990కు అందుబాటులో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో లభిస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4జెన్ 1 ప్రాసెసర్‌తో, ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ 5G ఫోన్ రెండు సంవత్సరాల మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

First published:

Tags: 5g phones, 5G Smartphone

ఉత్తమ కథలు