హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Best 5G Phones: రూ.35 వేలలో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ మోడళ్లను పరిశీలించండి..

Best 5G Phones: రూ.35 వేలలో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ మోడళ్లను పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5G టెక్నాలజీతో అనేక మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మన దేశంలో రిలీజ్ అయ్యాయి. మీరు రూ.35 వేలలో బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో(Smartphone Market) ఇప్పుడు 5G డివైజ్‌ల(Devise) హవా నడుస్తోంది. చాలా కంపెనీలు(Companies) ఇప్పుడు ఈ లేటెస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీతో(Connectivity Technology) ఫోన్లను(Phones) తయారుచేస్తున్నాయి. 5G టెక్నాలజీతో(5G Technology) అనేక మిడ్ రేంజ్(Mid Range), ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మన దేశంలో రిలీజ్(Release) అయ్యాయి. మీరు రూ.35 వేలలో బెస్ట్ 5G ఫోన్(Best 5G Smart Phone) కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.

* Samsung Galaxy S20 FE 5G

ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్‌లలో ఇది బెస్ట్ మోడల్‌గా చెప్పుకోవచ్చు. క్వాల్‌కామ్ స్నాప్‌గ్రాగన్ 865 SoC చిప్, బెస్ట్ క్వాలిటీ లెన్స్‌తో వచ్చింది. ఇది శక్తివంతమైన 120Hz AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. డివైజ్‌ 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే రిటైల్ బాక్స్‌లో 15W ఛార్జర్‌ను మాత్రమే కంపెనీ అందిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 36,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే రూ. 2,000 డిస్కౌంట్ కూపన్‌తో దీని ధర రూ.34,990కి తగ్గనుంది.

* వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2)

ఈ ఫోన్ 2021లో లాంచ్ అయింది. కొత్త వెర్షన్ ఇంకా అప్‌గ్రేడ్ కావాల్సి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED ప్యానెల్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ, స్టీరియో స్పీకర్లతో వస్తుంది. ఇది మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి, హార్డ్‌వేర్, కెమెరా లెన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇండియాలో OnePlus Nord 2 ఫోన్ రూ. 29,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీన్ని Amazon ద్వారా పొందవచ్చు.

Realme GT 2: రియల్‌మీ జీటీ 2 ఫస్ట్ సేల్ కాసేపట్లో... తొలి సేల్‌లో రూ.5,000 డిస్కౌంట్

* రియల్‌మీ జీటీ 2 (Realme GT 2)

రియల్‌మీ GT 2 5G ఫోన్ గత సంవత్సరం ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌తో రిలీజ్ అయింది. 120Hz AMOLED డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ వంటివి దీని ప్రధాన ఆకర్షణ. సాధారణ వినియోగానికి బ్యాటరీ లైఫ్ ఒక రోజు వరకు ఉంటుంది. దీని 65W ఛార్జర్‌.. ఫోన్‌ బ్యాటరీని 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలదు. ఈ ఫోన్‌లోని స్టీరియో స్పీకర్‌లు బాస్-హెవీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. భారతదేశంలో రియల్‌మీ GT 2 ఫోన్ ధర రూ.34,999.

iQOO 9 SE

గేమింగ్ లవర్స్‌కు ఐక్యూ 9 SE 5జీ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌గ్రాగన్ 888 SoC చిప్‌ను కలిగి ఉంది. మేకర్స్ దీని కెమెరా కంటే పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల దీని నుంచి గొప్ప ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ ఆశించవద్దు. iQOO 9 SE క్లాసీ, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. దీని గ్రే కలర్ వేరియంట్ ఆకట్టుకుంటుంది. AMOLED 120Hz HDR 10+ స్క్రీన్, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వంటి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని ధర రూ.34,000 వరకు ఉంది.

Xiaomi 12 Pro: యాపిల్ ఐఫోన్‌కు పోటీగాషావోమీ 12 ప్రో... ప్రీమియం ఫీచర్స్ అదుర్స్

Xiaomi Mi 11X

Xiaomi 11X 5G స్మార్ట్‌ఫోన్.. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 870 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. Mi 11X బెస్ట్ క్వాలిటీ కెమెరా సెటప్‌తో వస్తుంది. అయితే లెన్స్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ లేదు. ఇది 4,520mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫోన్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి గంట సమయం పడుతుంది. ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది. ఇండియాలో Xiaomi 11X ధర రూ. 26,999. దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. OLED HDR 10+ 120Hz డిస్‌ప్లే, డ్యూయల్ స్పీకర్‌లతో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: 5g mobile, 5g smart phone, Smartphone

ఉత్తమ కథలు