హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

6G Technology : 5G కన్నా ముందే వస్తున్న 6G.. ప్రత్యేకత ఏంటి..? ఇండియాకు ఎప్పుడు వస్తుంది..?

6G Technology : 5G కన్నా ముందే వస్తున్న 6G.. ప్రత్యేకత ఏంటి..? ఇండియాకు ఎప్పుడు వస్తుంది..?

త్వరలో 6జీ టెక్నాలజీ

త్వరలో 6జీ టెక్నాలజీ

6G Technology: భారత దేశానికి త్వరలోనే 6G టెక్నాలజీ వస్తోంది. అవును మీరు వింటున్నది నిజమే.. అది ఎప్పుడో కూడా కేంద్రమంత్రి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఇంకా ఇండియాకు 5జీనే రాలేదు.. అప్పుడే 6జీ ఎంటని ఆశ్చర్య వేస్తోందా.. కానీ అదే జరబోతోంది అంటున్నారు.

ఇంకా చదవండి ...

India 6G technology:  భారత దేశానికి అతి త్వరలో 6G టెక్నాలజీ (6g Technology) వచ్చేస్తోంది. ఇది వంద శాతం నిజం.. ప్రస్తుతానికి ఇంకా ఇండియాకు 5G టెక్నాలజీ (5g technology)నే రాలేదు. కానీ దానికంటే ముందే 6G టెక్నాలజీ వస్తోంది అంట.. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట.. వెబ్‌నార్ కు హాజరైన కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 6G రాబోతందంటూ చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే ఇండియా (India)కు 6G వస్తోందని క్లారిటీ ఇచ్చారు. అది కూడా స్వదేశీ పరిజ్ఞానం (Made in india)తో తయారైన 6G టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నట్టు అయన చెప్పారు. ఇప్పటికే 6G టెక్నాలజీకి సంబంధించి డెవలప్ మెంట్స్ మొదలయ్యాయట.. ఇండియాలో లభించే డివైజ్ లతోనే ఈ టెక్నాలజీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాదు.. అంతర్జాతీయ ప్రమాణాల  (International stand)కు ఏమాత్రం తీసిపోనంతగా డెవలప్ చేస్తున్నామని మంత్రి అశ్వినీ వెల్లడించారు. 2023 చివరిలో లేదా 2024 ఏడాది ప్రారంభంలో స్వదేశీ 6G సిస్టమ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే ఏడాదిలోనే 5G టెక్నాలజీ కూడా లాంచ్ చేయనున్నారట.

వచ్చే ఏడాది మిడిల్ లో లేదా మార్చి తర్వాత 5G టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందన్నారు. 5G స్పెక్ట్రమ్‌ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ట్రాయ్‌ (TRAI) పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టు ఆయన వివరించారు. ఈ చర్చలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ముగిసే అవకాశం ఉందన్నారు. అంటే 2022 రెండో త్రైమాసికంలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు మంత్రి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : ఏ బ్రాండ్ కావాలో తేల్చుకోలేకపోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. పెగ్ వేయడంలోనూ స్టైల్

అసలు ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే ఎంతో ఖరీదు. 2జీ నెట్ కోసం గంటల తరబడి వేచి చూసిన రోజులు సైతం ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 3జీ, 4జీ వచ్చింది. 5జీ కూడా వచ్చేస్తోంది. ప్రస్తుతం 4జీ నెట్వర్క్ ఫోన్లు అంతటా వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే 5జీ టెక్నాలజీ వస్తోంది. త్వరలో 6జీ సైతం అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. 6జీపై రిసెర్చ్ చేసింది. 5జీతో పోలిస్తే ఇది 50 రేట్లు వేగంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..

ఇదీ చదవండి : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైఫ్ లో ట్విస్ట్ లు.. మిస్ ఇండియా కాలేక పోయారు కానీ..

6జీ చాలా విభిన్నమైన నెట్ వర్క్ అంటున్నారు నిపుణులు. ఇది అభివృద్ధి చెందుతున్న అనుభవాలు, సేవల నమూనాను పూర్తిగా రూపొందిస్తుందని అంటున్నారు. ప్రెజెంటేషన్ స్లైడ్ విషయంలో 6జీ వేగం.. 5జీ కంటే 50 రెట్లు ఎక్కువగా ఉందని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే దీనిపై సంస్థ శ్వేత పత్రం కూడా విడుదల చేసింది. 6జీ స్టాండార్డ్‌ను 2028నాటికి అందుబాటులోకి తీసుకురావచ్చని శాంసంగ్ ఆశిస్తోంది. 2030 నాటికి ఇది మాస్ కమర్షియలైజేషన్ అవుతుందని భావిస్తోంది.

First published:

ఉత్తమ కథలు