Data Leak: ప్లేస్టోర్‌లోని ఆ యాప్‌లతో జాగ్రత్త.. యూజర్ల డేటా లీక్ అయ్యే అవకాశం ఉందంటున్న అవాస్ట్

ప్రతీకాత్మక చిత్రం

Data Leak: గూగుల్ ప్లే స్టోర్‌(Google Play Store) సురక్షితమైన యాప్స్‌నే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుందనే విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్‌ డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే బెస్ట్ ప్లాట్‌పాం అని చాలామంది నమ్ముతారు.

  • Share this:
గూగుల్ ప్లే స్టోర్‌(Google Play Store) సురక్షితమైన యాప్స్‌నే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుందనే విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్‌ డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే బెస్ట్ ప్లాట్‌పాం అని చాలామంది నమ్ముతారు. అయితే ప్లే స్టోర్‌లో ఉన్న 19 వేలకు పైగా యాప్స్‌, యూజర్ల డివైజ్ సేఫ్టీని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ అవాస్ట్ ఈ వివరాలు వెల్లడించింది. ప్లే స్టోర్‌లో ఉన్న 19,300 యాప్స్‌లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సమర్ధవంతంగా లీక్ చేయగల కీలకమైన మిస్‌కాన్ఫిగరేషన్‌ ఉన్నట్లు అవాస్ట్ గుర్తించింది.ఫైర్‌బేస్ డేటాబేస్ మిస్‌కాన్ఫిగరేషన్ కారణంగా ఈ యాప్స్‌ నుంచి వినియోగదారుల డేటా బహిర్గతమయ్యే ప్రమాదం ఉన్నట్లు స్తున్నట్లు అవాస్ట్ తెలిపింది. ఫైర్‌బేస్ అనేది యూజర్ డేటాను నిల్వ చేయడానికి ఆండ్రాయిడ్ డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్. యాప్‌లు సేకరించే పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్‌ (PII) అయిన యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్ డేటా, కొన్ని సందర్భాల్లో పాస్‌వర్డ్‌లు వంటి డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ విషయాలను సంస్థ గూగుల్‌కు తెలియజేయడంతో పాటు వీటి గురించి డెవలపర్లకు సూచించాలని కోరింది.

ఈ మిస్‌కాన్పిగరేషన్‌ లైఫ్‌స్టైల్, వ్యాయామం, గేమింగ్, మెయిల్, ఫుడ్ డెలివరీ, ఇతర విభాగాలకు చెందిన యాప్స్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య యూరప్, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల కోసం మొబైల్, వెబ్ యాప్‌లను అభివృద్ధి చేస్తున్నప్పుడు డెవలపర్లు ఫైర్‌బేస్‌ని ఉపయోగించవచ్చు. ఈ ఫైర్‌బేస్ అమలును ఇతర డెవలపర్‌లకు కనిపించేలా చేయవచ్చు. దీంతో డేటాబేస్‌లోని సమాచారం పబ్లిక్‌గా ఉంటుంది.

అవాస్ట్ థ్రెట్ ల్యాబ్స్ పరిశోధకులు 1,80,300 బహిరంగంగా అందుబాటులో ఉన్న ఫైర్‌బేస్‌లను పరిశీలించారు. వీటిలో 10 శాతానికి పైగా (19,300) యాప్స్ ఓపెన్‌గా ఉన్నాయని, డేటాను ప్రమాణీకరించని డెవలపర్‌లకు బహిర్గతం చేస్తున్నాయని గుర్తించారు. యాప్ డెవలపర్ల మిస్‌కాన్ఫిగరేషన్ కారణంగా ఇవి ఓపెన్‌గా ఉంటున్నాయని కనుగొన్నారు.

ఇది కూడా చదవండి : చిక్కుల్లో ధోనీ.. మిస్టర్ కూల్ కి 15 రోజుల డెడ్ లైన్ విధించిన సుప్రీం కోర్టు..

దీనివల్ల ఫైర్‌బేస్‌తో అభివృద్ధి చేసిన యాప్‌లు స్టోర్ చేసిన, ఉపయోగిస్తున్న డేటా దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ యాప్స్ స్టోర్ చేసే డేటాలో పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, లొకేషన్, సర్వీస్ టోకెన్స్, పాస్‌వర్డ్స్ వంటివి బహిరంగమయ్యే అవకాశం ఉంది. డెవలపర్ సరైన సెక్యూరిటీ పద్ధతులను పాటించకపోతే పాస్‌వర్డ్‌లు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల తప్పుగా కాన్ఫిగర్ చేసిన డేటాబేస్‌ల ప్రమాదం గురించి డెవలపర్లు తెలుసుకోవాలని, గూగుల్ అందించే ఉత్తమ పద్ధతులను అనుసరించాలని అవాస్ట్ హెచ్చరిస్తోంది.

ఇది కూడా చదవండి : " విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించాను.. అతడితో జ్ఞాపకాలు మర్చిపోలేను".. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

డేటా లీకేజీ భయాల నేపథ్యంలో.. యాప్‌లను వెరిఫై చేసిన తరువాతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. రివ్యూ, రేటింగ్‌లను పరిశీలించడంతో పాటు యాప్ అడిగే అనుమతులను సైతం వివరంగా చదవాలని చెబుతున్నారు. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్‌లో మంచి యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: