ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) మళ్లీ గూగుల్ ప్లేస్టోర్ (Google Playstore)లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. యాంటీవైరస్, క్లీనర్ వంటి యాప్‌ల రూపంలో ఇది దాగి ఉందని కొన్ని సైబర్ సెక్యూరిటీ కంపెనీల నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా Mister Phone Cleaner, Kylhavy Mobile Security యాప్‌లలో ఈ మాల్వేర్ ఉందని తెలిసింది. ఇది బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుంది. ఇది అకౌంట్స్ నుంచి కుకీలను దొంగిలించగలదు. వేలిముద్రల వంటి సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఈ మాల్వేర్ బైపాస్ చేయగలదు.
షార్క్‌బాట్ డ్రాపర్‌గా పేర్కొనే ఈ మాల్వేర్.. నిర్ధిష్ట యాప్‌లను యూజర్ డివైజ్‌లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్ఫెక్ట్ చేయడం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించి అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ మాల్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత, ఇది 'లాగిన్ విత్ ఫింగర్ ప్రింట్’ సెక్యూరిటీ ఆప్షన్‌ను క్యాన్సిల్ చేస్తుంది.
తద్వారా వినియోగదారులు పాస్వర్డ్, యూజర్ డీటైల్స్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా ఇది అధిగమించగలదు. ఈ కొత్త షార్క్‌బాట్ డ్రాపర్ థ్రెట్స్ నుంచి రక్షణ పొందడానికి యాంటీవైరస్ కోసం నకిలీ అప్డేట్గా మాల్వేర్ ఉన్న యాప్‌లను ఇన్స్టాల్ చేయమని సూచిస్తుంది. దాన్ని నమ్మి డౌన్లోడ్ చేసిన వెంటనే డివైజ్‌లోకి మాల్వేర్ చొరబడుతుంది.
షార్క్‌బాట్ మాల్వేర్ ప్రధాన లక్ష్యం మల్టి ఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్‌లను అధిగమించడం. ఆ తర్వాత ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి మాల్వేర్తో ఎఫెక్ట్ అయిన డివైజ్‌ల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభిస్తుంది.
* గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్వేర్
పబ్లిక్ గూగుల్ ప్లేస్టోర్ గణాంకాల ప్రకారం.. Mister Phone Cleaner యాప్‌ను 50,000 కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వైట్, బ్లూ బ్రూమ్తో బ్లూ కలర్ లోగో ఉంటుంది. ఈ యాప్ భారతదేశంలోని ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించదు. కానీ దీనికి 10,000 కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఉన్నాయని తెలిసింది.
* యాప్‌ల ద్వారానే..
స్మార్ట్ఫోన్లను లక్ష్యంగా చేసుకోవడానికి మొబైల్ యాప్‌లు సులభమైన మార్గం కాబట్టి చాలా మంది స్కామర్లు ఆండ్రాయిడ్ వినియోగదారులను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. Google Translate యాప్‌గా మారువేషంలో ఉన్న క్రిప్టో మైనింగ్ మాల్వేర్ వేలాది కంప్యూటర్లలోకి ప్రవేశించింది.
ఇది కూడా చదవండి : గెట్ రెడీ.. రేపే యాపిల్ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ ఇవే..
చెక్ పాయింట్ రీసెర్చ్(CPR) అధ్యయనం ప్రకారం.. “నిటోకోడ్” అని పేర్కొనే ఈ మాల్వేర్ను టర్కీ సంస్థ గూగుల్ ట్రాన్స్లేషన్ కోసం డెస్క్‌టాప్ అప్లికేషన్‌గా అభివృద్ధి చేసింది. ట్రాన్స్లేషన్ సేవల కోసం అధికారిక డెస్క్‌టాప్ యాప్ లేనప్పుడు చాలా మంది తమ PCలలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత, డివైజ్‌లలో క్రిప్టో మైనింగ్ ఆపరేషన్ సెటప్‌ను ఏర్పాటు చేస్తుంది.
ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నా సరే డౌన్లోడ్స్, యూజర్ రివ్యూస్ పరిశీలించాలని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Google Play store, Malware, Tech news