BATTLEGROUNDS MOBILE MAY BRING GLOBAL PUBG TOURNAMENTS ESPORTS BRANDS TO INDIA VB GH
Battlegrounds Mobile India: తొలి ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ లాంచ్.. విజేతకు రూ.1 కోటి బహుమతి.. ఆ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ లాంచ్
Battlegrounds Mobile India: ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ మొత్తం 3 నెలల పాటు 5 స్టేజ్లలో జరగనుంది. దీనికి సంబంధించిన క్వాలిఫైయర్స్ ఆగస్టు 2, ఆగస్టు 8 తేదీల్లో ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ లను జూలై 19 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పబ్జీ గేమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ ఇండియాలో అత్యంత ఆదరణ కలిగిన ఈ గేమ్‌ను గతేడాది ప్రభుత్వం నిషేధించింది. అయితే భారత్‌లో దీని క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సౌత్ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీ పబ్జీ తరహాలోనే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ (బీజీఎంఐ)ను డిజైన్ చేసింది. దీన్ని జూన్ 2వ తేదీన భారతీయ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ గేమ్ గూగుల్ ప్లేస్టోర్‌లోకి విడుదలైన వారం రోజుల్లోనే 3 కోట్ల 40 లక్షల మంది రిజిస్టర్ యూజర్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ గేమ్ తొలి మెగా ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం జూలై 19 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనుంది. ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ మొత్తం 3 నెలల పాటు 5 స్టేజ్లలో జరగనుంది. దీనికి సంబంధించిన క్వాలిఫైయర్స్ ఆగస్టు 2, ఆగస్టు 8 తేదీల్లో ప్రారంభమవుతాయి. ప్లాటినం, అంతకంటే ఎక్కువ మెంబర్షిప్ కలిగిన భారతదేశంలోని ఏ ప్లేయర్ అయినా ఈ గేమ్ ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తొలుత వీరు క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో విజయం సాధించి ఒక్కో లెవల్ పూర్తి చేసుకుంటూ ఫైనల్ లెవల్‌కు చేరుకోవాలి. ఇలా అన్ని లెవల్స్ పూర్తి చేసిన ఫైనల్ విజేతకు రూ. 1 కోటి బహుమతి అందజేస్తారు. గేమ్‌లో భాగంగా ప్లేయర్లు టెస్లా మోడల్ Y ను నడిపే అవకాశాన్ని కల్పిస్తుంది. దీనికి గాను ఎలోన్ మస్క్ చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ సంస్థ టెస్లాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్లేయర్లు ఆటోపైలట్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని క్రాఫ్టన్ పేర్కొంది. కొత్త అప్డేట్ తర్వాత ప్లేయర్లు గిగాఫ్యాక్టరీలోకి ప్రవేశించి, టెస్లా మోడల్ Yను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
గేమ్ ఆడుతున్న సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కారు రహదారులపై ఆటోమేటిక్‌గా ప్రత్యక్షమవుతుంది. వీటిలోకి ఎక్కి అనేక మార్గాల్లో ప్రయాణించవచ్చు. కారు నడుపుతున్న సమయంలో గ్రౌండ్ బ్రేకింగ్ ఆటో పైలెట్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటి ద్వారా యుద్ధ సామాగ్రిని పొందవచ్చు. కాగా, ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే క్రాఫ్టన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.