హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Battlegrounds: రికార్డు బద్దలు కొట్టిన బ్యాటిల్​గ్రౌండ్ మొబైల్ ఇండియా..పబ్ జీ 2.0 సూపర్ హిట్..

Battlegrounds: రికార్డు బద్దలు కొట్టిన బ్యాటిల్​గ్రౌండ్ మొబైల్ ఇండియా..పబ్ జీ 2.0 సూపర్ హిట్..

ప్రతీకాత్మక చిత్రం(image: Battlegrounds Mobile India)

ప్రతీకాత్మక చిత్రం(image: Battlegrounds Mobile India)

ఈ నెల 2వ తేదీన భారత్​లో బ్యాటిల్​గ్రౌండ్స్ మొబైల్​ ఇండియా లాంచ్ అయింది. అయితే గేమ్​ను గూగుల్​ ప్లే స్టోర్​లో విడుదల చేసిన వారంలోనే 3 కోట్ల 40 లక్షల మంది రిజిస్టర్ యూజర్లు వచ్చారని గేమ్ డెవలపర్​ క్రాఫ్టాన్​ ప్రకటించింది.

దేశంలో పబ్జీ బ్యాన్​ అయిన చాలా కాలానికి వచ్చిన బ్యాటిల్​గ్రౌండ్స్ మొబైల్​ ఇండియా గేమ్ (BGMI) భారత్​లో సూపర్ హిట్టయినట్టే కనిపిస్తోంది. ఈ పబ్జీ ఇండియా వర్షన్​కు ముందు నుంచే ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఈ గేమ్ లాంచ్ అవ్వక ముందే రిజిస్ట్రేషన్లు కూడా భారీ మొత్తంలో అయ్యాయి. మొత్తానికి ఈ నెల 2వ తేదీన భారత్​లో బ్యాటిల్​గ్రౌండ్స్ మొబైల్​ ఇండియా లాంచ్ అయింది. అయితే గేమ్​ను గూగుల్​ ప్లే స్టోర్​లో విడుదల చేసిన వారంలోనే 3 కోట్ల 40 లక్షల మంది రిజిస్టర్ యూజర్లు వచ్చారని గేమ్ డెవలపర్​ క్రాఫ్టాన్​ ప్రకటించింది. బీజీఎంఐకు కోటి ఆరు లక్షల మంది డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పింది. మరోవైపు గూగుల్ ప్లే స్టోర్​లోనూ డౌన్​లోడ్​లలో ఈ గేమ్ దూసుకుపోతోంది. టాప్ ఫ్రీ గేమ్స్ లిస్ట్​లో మొదటిస్థానానికి వచ్చేసింది. జూలై 8న తమ లాంచ్​పార్టీని ఏకంగా 50లక్షల మంది యూట్యూబ్​ ద్వారా చూశారని క్రాఫ్టాన్ ప్రకటించింది. మరోవైపు ఐఓఎస్​కు బీజీఎంఐను ఎప్పుడు లాంచ్ చేసేదీ క్రాఫ్టాన్ స్పష్టం చేయలేదు.

భారత్​లో ఈ గేమ్ మరింత దూసుకెళుతుందని తాము అంచనా వేస్తున్నామని క్రాఫ్టాన్ ఇండియా బీజీఎంఐ హెడ్ వూయోల్ లిమ్ చెప్పారు. భారత గేమింగ్​, ఈస్పోర్ట్స్​ ఇండస్ట్రీలో తమ గేమ్​ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా బ్యాటిల్​గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఈస్పోర్ట్స్​ టోర్నమెంట్లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తామని ప్రకటించారు. ఒరిజినల్ పబ్జీలాగే బీజీఎంఐ కూడా దూసుకుపోవడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. 2020 సెప్టెంబర్​లో దేశంలో పబ్జీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇప్పటికే 3.3 కోట్ల మంది పబ్జీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. దీంతో దీని ఇండియా వర్షన్​ బ్యాటిల్​గ్రౌండ్ మొబైల్ ఇండియా రాగానే గేమర్లు ఆసక్తి చూపారు. అధికంగా డౌన్​లోడ్​లు చేసుకున్నారు.


అయితే బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా ఆండ్రాయిడ్ వర్షన్​కు త్వరలోనే తొలి మేజర్ అప్​డేట్ రానుంది. అప్​డేట్ ద్వారా.. ప్రతీ రీలోడ్​లో 75 బుల్లెట్ల హోల్డ్ చేయగల ఎంజీ 2 అనే వెపన్​ను యూజర్లు వినియోగించుకోవచ్చని క్రాఫ్టాన్ చెప్పింది. అలాగే మిషన్​ ఇగ్నిటేషన్​తో పాటు ఆరు రిజన్ల ఎరాంగిల్​ థీమ్​ కూడా కొత్త అప్​డేట్​లో ఉండనుంది. ట్రాన్సిట్​ సెంటర్​, జార్జ్​పొల్​, టెక్​సెంటర్​ లాంటి థీమ్​లు ఉండనున్నాయి. అలాగే బుల్లెట్లను ఎదుర్కొనేందుకు రూట్ షీల్డ్​ను కూడా యూజర్లు వాడుకోవచ్చు.

First published:

Tags: Mobile App, Video Games

ఉత్తమ కథలు