హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

BGMI Lite: త్వరలో రానున్న బీజీఎంఐ లైట్ వెర్షన్ మొబైల్ గేమ్? కొత్త గేమ్ కోసం స్పెషల్ పోల్

BGMI Lite: త్వరలో రానున్న బీజీఎంఐ లైట్ వెర్షన్ మొబైల్ గేమ్? కొత్త గేమ్ కోసం స్పెషల్ పోల్

కొత్త గేమ్

కొత్త గేమ్

ప్రముఖ మొబైల్ గేమ్‌ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) సరికొత్త వెర్షన్‌లో గేమింగ్ ప్రియులను ఆకట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లో- ఎండ్ డివైజెస్ కోసం బీజీఎంఐలో ప్రత్యేక వెర్షన్‌ రానున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ మొబైల్ గేమ్‌ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) సరికొత్త వెర్షన్‌లో గేమింగ్ ప్రియులను ఆకట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లో- ఎండ్ డివైజెస్ కోసం బీజీఎంఐలో ప్రత్యేక వెర్షన్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఈ గేమ్ కు చెందిన లైట్ వెర్షన్‌ (BGMI Lite version) కోసం బీజీఎంఐ డిస్కార్డ్ ఛానెల్‌లో ఓ పోల్ నిర్వహించింది. ఇందులో భాగంగా "వినియోగదారులు పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్ లైట్ వెర్షన్ ను ఎందుకు కోరుకుంటున్నారు?" అని గేమింగ్ ప్రియులను అడిగింది.

అయితే గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ మాత్రం బీజీఎంఐ లైట్ లాంచ్ గురించి ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. జులైలో ఈ గేమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లు లెస్ రిసోర్స్ గా ఉండే ఇంటెన్సివ్ వెర్షన్ కోసం డిమాండ్ చేస్తున్నారు.

బీజీఎంఐ కోసం అధికారిక డిస్కార్డ్ ఛానల్ నవంబర్ 16న పోల్‌ను పోస్ట్ చేసింది. వినియోగదారులు లైట్ వెర్షన్ ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పాలని కోరింది. ఇందులో.. లో-ఎండ్ డివైజ్ లో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సమర్థవంతంగా ఉండదని మొదటి ఆప్షన్ గా పొందుపరిచింది. లైట్ వెర్షన్ లో మెరుగైన ఫ్రేమ్ రేట్లు, పనితీరు కోసం చూస్తున్నామననే సెకండ్ ఆప్షన్‌ను ఇచ్చింది. మూడో ఆప్షన్‌గా.. పబ్జీ మొబైల్ లైట్ లో కొనుగోలు చేసిన వస్తువుల జాబితాను లిస్ట్ చేయాలనుకుంటున్నామనే అంశాన్ని ఇచ్చింది. చివరి ఆప్షన్ గా "లైట్ వెర్షన్ లో నేను మ్యాప్స్, స్కిన్స్ ఇష్టపడతాను" అని పొందుపరిచింది. ఈ పోల్ ఈ రోజు రాత్రి 09.30 గంటలకు ముగియనుంది.

బీజీఎంఐ లైట్ వెర్షన్ కోసం క్రాఫ్టన్ ఇంకా ఎలాంటి ప్లాన్స్ ను ప్రకటించనప్పటికీ కమ్యునిటీకి చెందిన ప్రముఖ గేమర్లు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో గేమ్ ను విడుదల చేయవచ్చని ఇంతకముందే సూచించారు. వీరిలో మ్యాక్స్ టర్న్ లాంటి గేమర్లు ఉన్నారు.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

ప్రస్తుతానికి క్రాఫ్టన్ ఇంటెన్సివ్ గేమ్.. PUBGనే. దీన్ని ఇటీవలే విడుదల చేసింది. ఈ గేమ్ కోసం 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6(Marshmallow) లేదా అంతకంటే ఎక్కువ రన్ అయ్యే డివైజ్ అవసరమవుతుంది. దీని అనంతరం బీజీఎంఐ కోసం 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1.1 సాఫ్ట్ వేర్ లేదా అంతకంటే ఎక్కువ రన్ అయ్యే డివైజ్ సరిపోతుంది. ఒకవేళ క్రాఫ్టన్ బీజీఎంఐ లైట్ వెర్షన్ ను విడుదల చేస్తే PUBG మొబైల్ లైట్ మినిమమ్ రిక్వైర్మెంట్లు అవసరమవుతాయి. ఏది ఏమైనప్పటికీ అధికారికంగా బీజీఎంఐ లైట్ వెర్షన్ లాంచ్ అయ్యేంతవరకు ఆటగాళ్లు అనధికారిక లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ లింకులు మాల్వేర్ లేదా హానికరమైన కంటెంట్ కలిగి ఉండవచ్చు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Mobile game, Video Games

ఉత్తమ కథలు