హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Battlegrounds Mobile India: షాక్ ఇస్తున్న బ్యాటిల్​గ్రౌండ్స్​ గేమ్... మళ్లీ చైనా కలకలం

Battlegrounds Mobile India: షాక్ ఇస్తున్న బ్యాటిల్​గ్రౌండ్స్​ గేమ్... మళ్లీ చైనా కలకలం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Battlegrounds Mobile India | రిలీజ్‌కు ముందే బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా కలకలం సృష్టిస్తోంది. యూజర్ల డేటాను చైనా సర్వర్లకు వెళ్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

పబ్జీ గేమ్ ఇండియా వెర్షన్‌గా భావిస్తున్న ‘బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా’ గేమ్​ ప్లేయర్లకు బ్యాడ్​ న్యూస్​. ఈ గేమ్ ఆడుతున్న వారి డేటా చైనా సర్వర్లకు అందుతోందన్న షాకింగ్ విషయం బయటికి వచ్చింది. యూజర్ల మొబైల్స్ నుంచి డేటా చైనాలోని బీజింగ్​లో ఉన్న సర్వర్లకు చేరుతోందని ఐజీఎన్ వార్తాసంస్థ ఓ కథనం ప్రచురించింది. టెన్సెంట్​తో పాటు పలు చైనా సంస్థల సర్వర్లకు బ్యాటిల్​గ్రౌండ్స్​​ ఇండియా గేమ్ ఆడుతున్న వారి డేటా చేరుతోందట. అలాగే హాంకాంగ్​, మాస్కో, అమెరికా, ముంబైలోని సర్వర్లకు సైతం డేటా వెళుతోందని కథనం వెల్లడించింది. చైనా సర్వర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించబోమని 2020లో చెప్పిన క్రాఫ్టాన్​ దాన్ని పాటించడం లేదని ఐజీఎన్ కథనం వెల్లడించింది.

కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్ బీటా వెర్షన్​ను భారత్​లో ఇప్పటికే లక్షలాది మంది వాడుతున్నారు. డేటా పాకెట్ స్నిఫర్ యాప్​ను వినియోగించి బ్యాటిల్​ గ్రౌండ్స్​​ గేమ్​ను ఆడగా.. డేటా చైనా సర్వర్లకు వెళుతోందన్న విషయం బయటికి వచ్చింది. అలాగే భారత్​లో పబ్​జీని ఒకప్పుడు నడిపిన టెన్సెంట్ సర్వర్లకు డేటా చేరుతోందని స్పష్టమైందని ఆ కథనంలో ఉంది.

Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

Motorola Rugged Mobile: ఈ స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లల్లో నానబెట్టి, సబ్బుతో కడిగేయొచ్చు

చైనా సర్వర్లకు డేటాను చేరవేస్తూ దేశ భద్రతకు ప్రమాదంగా మారిందనే కారణంతో 2020 సెప్టెంబర్​లో పబ్జీ గేమ్​ను భారత్​లో ప్రభుత్వం నిషేధించింది. దీంతో దక్షిణ కొరియా సంస్థ క్రాఫ్టాన్​.. బ్యాటిల్ గ్రౌండ్స్​ మొబైల్​ పేరుతో భారత్ కోసం కొత్త వెర్షన్​ను తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి ఆండ్రాయడ్ యూజర్లకు బీటా వర్షన్​ను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పటికే లక్షలాది మంది ఈ గేమ్​ను ఆడుతున్నారు. అయితే చైనా సర్వర్లకు యూజర్ల డేటా అందుతోందన్న ఆరోపణలతో క్రాఫ్టాన్ ఏం చేస్తుందో చూడాలి.

అలాగే బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియాకు చెందిన గూగుల్ ప్లేస్టోర్ యూఆర్​ఎల్​లో కూడా పబ్​జీ మొబైల్ అని ఉందని ఐజీఎన్ గుర్తించింది. మరోవైపు భారత ప్లేయర్ల డేటా, గోప్యత, సెక్యూరిటీ కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని క్రాఫ్టాన్​ ఇటీవల ప్రకటించింది. ఇదే తమ ప్రధాన ధ్యేయమని చెప్పింది. అయితే తాజా ఆరోపణలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme 7 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... మూడు రోజులే అవకాశం


మరోవైపు బ్యాటింగ్ గ్రౌండ్స్​ మొబైల్ ఇండియాను నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ గేమ్ ద్వారా టెన్సెంట్ మళ్లీ భారత మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే అభిషేక్ సింఘ్వీ కూడా ఈ గేమ్​ను నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే పబ్​జీ గేమ్​ వల్ల చాలా మంది యువత నష్టపోయారని, మళ్లీ గేమ్ తీసుకురావడం వల్ల అలాంటి పరిస్థితులే వస్తాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Battlegrounds Mobile India, PUBG, PUBG Mobile India

ఉత్తమ కథలు