గతేడాది బ్యాన్ అయిన పబ్జీ గేమ్ స్థానంలో ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో మరో గేమ్ రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ గేమ్ లాంచింగ్ తేదీ అధికారికంగా వెల్లడికానప్పటికీ, ప్రీ రిజిస్ట్రేషన్లు మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మే 18న ప్రారంభమైన ఈ ప్రక్రియ రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. కేవలం రెండు వారాల్లోనే 20 మిలియన్ల ప్రీ రిజిస్ట్రేషన్లు దాటి రికార్డు సృష్టించింది. తొలిరోజే సుమారు 7.6 మిలియన్ల మంది ఇందుకు నమోదు చేసుకోవడం విశేషం. ఈ వివరాలను దక్షిణ కొరియాకు చెందిన గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ వెల్లడించింది. తమ గేమ్‌పై ఇంతటి ఆసక్తి కనబర్చిన భారతీయ గేమింగ్ ప్రియులకు క్రాఫ్టన్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
Realme Anniversary Sale: రియల్మీ యానివర్సరీ సేల్ మొదలు... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే
Realme X7 Max 5G: కాసేపట్లో రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ సేల్... ఆఫర్ వివరాలు ఇవే
అనూహ్య స్పందనపై క్రాఫ్టన్ సిఈఓ సిహెచ్ కిమ్ మాట్లాడుతూ "భారత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న PUBG మొబైల్ గేమ్ బ్యాన్ కావడంతో బ్యాటిల్ గ్రౌండ్స్ పేరుతో పబ్జీ తరహా మొబైల్ గేమ్స్ డెవలప్ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో రాయల్ గేమ్ డిజైన్ చేశాం. మే 18న ఈ గేమ్ ప్రీ రిజిస్ట్రేషన్లను ప్రారంభించాం. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. భారత గేమింగ్ ప్రియులకు మేం కృతజ్ఞతలు చెబుతున్నాం" అని పేర్కొన్నారు. ఈ గేమ్ పబ్జీని తలదన్నేలా ఉంటుందని క్రాఫ్టన్ చెబుతోంది. దీంట్లో వయలెన్స్ తక్కువగా, ప్రైవసీ ఎక్కువగా ఉండేలా సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది.
WhatsApp: వాట్సప్ నుంచి మూడు కొత్త ఫీచర్స్... ప్రకటించిన జుకర్‌బర్గ్
WhatsApp: వాట్సప్‌లో సమస్యలున్నాయా? ఈయనకు కంప్లైంట్ చేయండి
ఇప్పటికే ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన ఈ గేమ్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని క్రాఫ్టన్ తెలిపింది. దీన్ని జూన్ 18న ప్రారంభిస్తారనే పుకార్లు వినిపించాయి. కానీ, సంస్థ దీన్ని కొట్టి పారేసింది. ఏదేమైనప్పటికీ, అతి త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మెబైల్ గేమ్‌కు ప్రీరిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి Battlegrounds Mobile India అని టైప్ చేయాలి. అయితే, ఇదే పేరుతో కొన్ని ఫేక్ గేమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. అందువల్ల, జాగ్రత్తగా చెక్ చేసుకొని క్రాఫ్టన్ సంస్థ తయారు చేసిన గేమ్‌ను మాత్రమే ప్రీ రిజిస్టర్ చేసుకోవాలి. పిల్లలు పబ్జీలో మునిగిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని గతంలో వార్తలొచ్చాయి. దీంతో బీజీఎంఐ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటోంది. 18 ఏళ్ల కంటే చిన్న పిల్లలు ఈ గేమ్ ఆడే విషయంలో కొన్ని నిబంధనలు విధించారు. వారు గరిష్టంగా మూడు గంటలు మాత్రమే గేమ్ ఆడేలా దీన్ని డిజైన్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.