BGMI Downloads: 50 మిలియన్ డౌన్‌లోడ్‌లు సాధించిన బీజీఎంఐ గేమ్.. త్వరలోనే ఐఓఎస్ వెర్షన్‌పై ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం(image: Battlegrounds Mobile India)

పబ్‌జీ గేమ్ ఇండియాలో బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ డౌన్‌లోడ్‌ల సంఖ్య 5 కోట్ల (50 మిలియన్) మైలురాయిని దాటింది. ఈ పబ్జీ ఇండియన్ వెర్షన్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదల చేశారు. దీనికి మంచి ఆదరణ లభించిందని క్రాఫ్టన్ కంపెనీ ప్రకటించింది.

  • Share this:
పబ్‌జీ గేమ్ ఇండియాలో బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ గేమ్ డౌన్‌లోడ్‌ల సంఖ్య 5 కోట్ల (50 మిలియన్) మైలురాయిని దాటింది. ఈ పబ్జీ ఇండియన్ వెర్షన్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదల చేశారు. దీనికి మంచి ఆదరణ లభించిందని క్రాఫ్టన్ కంపెనీ ప్రకటించింది. విడుదలైన రెండు నెలల లోపే 50 మిలియన్ డౌన్లోడ్ మార్క్ దాటిన సందర్భంగా యూజర్లకు కొన్ని రివార్డులతో పాటు 'గెలాక్సీ మెసెంజర్ సెట్' అవుట్ ఫిట్‌ని పర్మినెంట్ గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించింది.

50 మిలియన్ డౌన్‌లోడ్ మార్కు చేరుకున్న సందర్భంగా రివార్డులు ఇస్తామన్న దక్షిణ కొరియా గేమ్ డెవలపర్ క్రాఫ్టన్.. తాజాగా ఆ ఫీట్ సాధించడంతో యూజర్లకు గిఫ్ట్స్ ఇస్తోంది. నిజానికి ఈ ఇండియన్ పబ్‌జీ సాధించిన 50 మిలియన్ డౌన్‌లోడ్‌ల సంఖ్య గత డౌన్‌లోడ్స్ సంఖ్యతో పోల్చుకుంటే చాలా చిన్నది అని చెప్పుకోవచ్చు.

భారత కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించక ముందు ఒరిజినల్ పబ్‌జీ మొబైల్ ఒక్క ఇండియాలోనే 180 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు సాధించింది. దేశంలో 33 మిలియన్ల రెగ్యులర్ యూజర్లతో పబ్‌జీ నంబర్ వన్ మొబైల్ గేమ్ గా నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో ప్రపంచవ్యాప్తంగా పబ్‌జీ డౌన్‌లోడ్‌ల సంఖ్య 1 బిలియన్ మార్క్ దాటి చెక్కుచెదరని రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉండగా, తాజాగా క్రాఫ్టన్ కంపెనీ‌లో బీజీఎంఐ డివిజన్ హెడ్ గా పనిచేస్తున్న వూయోల్ లిమ్ మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకలో భాగమైనందుకు తాము సంతోషిస్తున్నామని.. బీజీఎంఐ 50 మిలియన్ డౌన్‌లోడ్‌ల మార్కును చేరుకోవడం మరింత సంతోషంగా ఉందని వూయోల్ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే తమ మొట్టమొదటి ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆకాంక్షించారు.

బీజీఎంఐ గేమ్ ఐఓఎస్ గేమ్ వెర్షన్‌పై త్వరలోనే తమ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రకటన చేయనున్నట్లు క్రాఫ్టన్ కంపెనీ వెల్లడించింది. దీంతో త్వరలోనే ఐఓఎస్ యూజర్లు కూడా బీజీఎంఐ గేమ్ ఆస్వాదించవచ్చని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ ప్లేలో ఉన్న ఈ గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీజీఎంఐ "స్వాతంత్ర్య దినోత్సవ మహోత్సవం" ను ఆగస్టు 11- ఆగస్టు 20 వరకు జరుపుకుంటోంది. ఈ మహోత్సవం సందర్భంగా యూజర్లు ప్రత్యేక AGM స్కిన్ సహా ఇతర రివార్డులు గెలుచుకోవచ్చు. ఇక గేమ్‌లో చీటింగ్ చేసిన 336,000 ప్లేయర్లను గుర్తించిన కంపెనీ.. వారి అకౌంట్లను బ్యాన్ చేసింది. పర్మినెంట్‌గా బ్యాన్ అయిన ఈ అకౌంట్స్ తో మళ్లీ ఆట ఆడటం కుదరదు.
Published by:Krishna Adithya
First published: