Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీటా వెర్షన్ విడుదల

Battlegrounds Mobile India: బ్యాటిల్​ గ్రౌండ్ మొబైల్​ ఇండియా బీటా వెర్షన్ విడుదల

Battlegrounds Mobile India | పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పబ్‌జీ ఇండియా కొత్త అవతారంలో వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఎర్లీ యాక్సెస్ మొదలైంది.

  • Share this:
దేశవ్యాప్తంగా ఉన్న పబ్​జీ మొబైల్​ గేమ్ ప్రియులకు శుభవార్త. గతేడాది కేంద్రం పబ్​జీ మొబైల్​ యాప్​ను బ్యాన్​ చేసినప్పటి నుంచి ఆ యాప్​ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని గేమ్ లవర్స్​ ఎదురుచూశారు. అటువంటి వారి సుదీర్ఘ నిరీక్షణ ఫలించేలా ‘బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా’ పేరుతో కొత్త గేమ్​ లాంచ్ అయ్యింది. ఎట్టకేలకు ఈ గేమ్​ బీటా వెర్షన్​ను గూగుల్​ ప్లే స్టోర్​లో అందుబాటులోకి తెచ్చింది క్రాఫ్టన్​ సంస్థ. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే, ప్రస్తుతం కేవలం కొద్ది మంది బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. గేమ్​ టెస్టింగ్​లో భాగంగా కొద్ది మందికి మాత్రమే యాక్సెస్​ అందించింది. ఈ క్రమంలోనే పూర్తి వెర్షన్​ను లాంచ్​ చేసేందుకు మరో 10–15 రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అదే నిజం అయితే, ఈ నెలాఖరు వరకు వినియోగదారులందరికీ గేమ్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Jio 4G Data Plans: మొబైల్ డేటా ఎక్కువ కావాలా? జియో అందిస్తున్న12 డేటా ప్లాన్స్ ఇవే

Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

ఇప్పటికే దీన్ని డౌన్​లోడ్​ చేసుకున్న కొంతమంది వినియోగదారులు ట్విట్టర్‌లో తమ స్క్రీన్​షాట్​లను పంచుకున్నారు. ఆ వివరాలను బట్టి చూస్తే.. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మొత్తం స్టోరేజ్​ సైజ్​ 720MB అని స్పష్టమవుతుంది. అందరూ ఊహించినట్లుగానే పబ్​జీ లాగే ఈ గేమ్​ను కూడా తీర్చిదిద్దారు. కొద్దిపాటి మార్పులు మాత్రమే చేశారు. PUBG మొబైల్ మాదిరిగానే, బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా యూజర్లు ఒక జట్టులోకి ప్రవేశించి​ రాయల్ గేమ్‌లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. ఈ బ్యాటిల్​ గేమ్​ రాయల్ మోడ్ లేదా ఫ్రీ ఫైర్ ఫైట్, వన్- టు వన్ టిడిఎమ్ మ్యాచెస్​ వంటి మల్టిపుల్​ మోడ్‌లను అందిస్తుందని గూగుల్ ప్లే లిస్టింగ్ వెల్లడించింది.

Jio Plans: జియో ఫోన్ యూజర్లకు రూ.39 నుంచి 7 రీఛార్జ్ ప్లాన్స్

Realme GT 5G: ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్... రియల్‌మీ జీటీ 5జీ ప్రత్యేకతలు ఇవే

మే 18వ తేదీన ఈ గేమ్​కు ప్రీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో, జూన్​ 18వ తేదీన ఈ గేమ్​ లాంచ్​ చేస్తారని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా అందుకు ఒక్క రోజు ముందుగానే గేమ్​కు సంబంధించిన బీటా వెర్షన్​ను విడుదల చేయడం విశేషం. కాగా, ఈ గేమ్​కు ప్రీ రిజిస్టర్​ చేసుకున్న యూజర్లకు పలు ఫ్రీ గిఫ్ట్​లను అందజేస్తామని క్రాఫ్టన్​ సంస్థ పేర్కొంది. ప్రత్యేకమైన 4 రివార్డులతో పాటు రెకాన్​ మాస్క్​, రెకాన్​ జౌట్​ ఫిట్​, సెలబ్రేషన్​ ఎక్స్​పర్ట్​ టైటిల్​, 300 ఏజీ వంటివి అందిస్తామని తెలిపింది. ఈ గేమ్​ను ఆండ్రాయిడ్​ 5.1.1 ఆపైన వెర్షన్​ కలిగిన డివైజెస్​లో కూడా ఆడవచ్చు. అయితే,​ కనీసం 2జీబీ ర్యామ్​ ఉన్న మొబైల్స్​లోనే ఇది పనిచేస్తుంది.

గతేడాది పబ్​జీని బ్యాన్​ చేయడంతో ఈ గేమ్ ప్రియులు ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ ఈ కొత్త గేమ్​ను అనౌన్స్​ చేసినప్పటిని నుంచి, దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు, ఈ గేమ్​ బీటా వెర్షన్​ కూడా వచ్చేసింది. దీంతో ఈ గేమ్​ తమకు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: