ప్రపంచవ్యాప్తంగా పబ్జీ గేమ్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ భారత్‌లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ గేమ్‌ను గతేడాది ప్రభుత్వం నిషేధించగా.. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ పేరుతో భారత్‌లో మళ్లీ లాంచ్ అయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ గేమ్ ఆగస్టు 5 నాటికి గూగుల్ ప్లే స్టోర్‌లో 47 మిలియన్ డౌన్లోడ్స్ను చేరుకుంది. ఇప్పుడు 50 మిలియన్ మార్కుకు దగ్గర్లో ఉంది. దీంతో ఎక్కువ మందిని ఆకట్టుకునేందుకు క్రాఫ్టన్ సంస్థ ప్రత్యేక రివార్డులను ప్రకటించింది. బీజీఎంఐ 48, 49 మిలియన్ డౌన్లోడ్ మార్క్‌ను చేరుకునే సందర్భంలో యూజర్లకు 'మూడు సప్లై కూపన్ క్రేట్ స్క్రాప్'ను అందిస్తామని ప్రకటించింది. ఇక, 50 మిలియన్ డౌన్లోడ్ల మైలురాయి చేరుకోగానే 'పర్మినెంట్ గెలాక్సీ మెసెంజర్'ను అందుకుంటారు.
బీజీఎంఐ ప్రస్తుతం, ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది జూలై 2న గూగుల్ ప్లే స్లోర్‌లో అందుబాటులోకి వచ్చింది. యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం ఇప్పటికీ అందుబాటులో లేదు. 2020 సెప్టెంబర్‌లో భారత్‌లో బ్యాన్ అయిన పాపులర్ గేమ్ పబ్జీ మొబైల్ ఇండియాకు ప్రత్యామ్నాయంగా ఇది విడుదలైంది.
త్వరలోనే యాపిల్ యూజర్లకు కూడా..
తాజాగా ప్రకటించిన రివార్డ్‌లను యూజర్లు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేయవచ్చని క్రాఫ్టన్ కంపెనీ తెలిపింది. అయితే ఈ రివార్డులు 50 మిలియన్ డౌన్లోడ్స్ చేరుకున్న తర్వాత నెల రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. బీజీఎంఐ ఆపిల్ ఐఓఎస్ వెర్షన్లో ఇంకా విడుదల కాకముందే రివార్డ్‌లను ప్రకటించడం విశేషం. ఈ గేమ్‌ను త్వరలోనే ఐఓఎస్ వెర్షన్లో కూడా తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. అయితే ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై మాత్రం క్రాఫ్టన్ ఇంకా స్పష్టతనివ్వలేదు.
ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లోకి విడుదలైన కొద్ది రోజుల్లోనే గణనీయమైన డౌన్లోడ్స్ను సాధించింది. విడుదలైన వారం రోజుల్లోనే 34 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్లను చేరుకుందని క్రాఫ్టన్ పేర్కొంది. ఇంత భారీ రెస్పాన్స్‌కు ఏకైక కారణం.. పబ్జీ గేమ్‌కు భారత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండటమే. ప్రస్తుతం పబ్జీ గేమ్ ప్రపంచవ్యాప్తంగా 180 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ కలిగి ఉంది. భారత్‌లో బ్యాన్ అయ్యే ముందు దీనికి 33 మిలియన్ల యూజర్ బేస్ ఉండటం గమనార్హం. మార్చి నెల నాటికి ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డౌన్లోడ్ల మైలురాయిని చేరుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.