దిగ్గజ వీడియో గేమ్స్ తయారీదారు క్రాఫ్టన్ పీసీ (Krafton PC), కన్సోల్ ఆటగాళ్లకు శుభవార్త అందించింది. పబ్జీ: బ్యాటిల్‌గ్రౌండ్స్ గేమ్ (PUBG Battlegrounds)ను వచ్చే ఏడాది జనవరి నుంచి పీసీ, కన్సోల్ గేమర్లకు ఉచితంగా ఆఫర్ చేస్తామని తాజాగా క్రాఫ్టన్ వెల్లడించింది. కంప్యూటర్, కన్సోల్ యూజర్లు ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌ల్లో పబ్జీ బ్యాటిల్‌గ్రౌండ్స్ పై వరుసలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతానికి కేవలం పెయిడ్ వెర్షన్‌గా మాత్రమే అందుబాటులో ఉన్న పబ్జీ: బ్యాటిల్‌గ్రౌండ్స్ వచ్చే ఏడాది జనవరి 12 నుంచి ఫ్రీ వెర్షన్‌గా అందుబాటులోకి రానుంది.సౌత్ కొరియన్ గేమింగ్ పబ్లిషర్ క్రాఫ్టన్ గేమ్ అవార్డ్స్ 2021 ఈవెంట్లో భాగంగా పబ్జీ: బ్యాటిల్‌గ్రౌండ్స్ ఫ్రీ-టూ-ప్లే (F2P) గేమ్‌గా మారనుందని వెల్లడించింది.
ఉచిత వెర్షన్ అందుబాటులోకి వచ్చాక ఆటగాళ్లకు బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్ అనే పెయిడ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఉచిత వెర్షన్ బేసిక్ అకౌంట్ అయితే, బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్ (BATTLEGROUNDS Plus) అనేది ప్రీమియం అకౌంట్. ఒకరకంగా దీన్ని అప్‌గ్రేడ్ వెర్షన్ అని పిలవచ్చు. ఇందులో వివిధ రకాల కొత్త, ప్రత్యేకమైన ఇన్-గేమ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి 12.99 డాలర్లు (సుమారు రూ.950) చెల్లిస్తే ఆటగాళ్లు బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్ ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇది కేవలం ఆప్షనల్ అకౌంట్ మాత్రమే.
మీ హోటల్ రూమ్‌ను యాపిల్ ఐఫోన్‌తో అన్‌లాక్ చేయవచ్చు.. ఎలాగంటే..
జనవరి 12 నుంచి పీసీ, కన్సోల్ ఆటగాళ్లందరూ డబ్బులు చెల్లించకుండానే బేసిక్ అకౌంట్ ద్వారా గేమ్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్ల కోసం మాత్రమే అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌గ్రేడ్ చేశాక యూజర్లు.. బోనస్ 1,300 జీ- కాయిన్, సర్వైవల్ మాస్టరీ ఎక్స్పీ+ 100 శాతం బూస్ట్, కెరీర్-మెడల్ ట్యాబ్, ర్యాంక్ మోడ్, కస్టమ్ మ్యాచ్ ఫంక్షనాలిటీ, టోపీ, క్యామో మాస్క్, కామో గ్లోవ్‌లను కలిగి ఉన్న కెప్టెన్ కామో సెట్‌తో సహా గేమ్‌లోని ఇతర ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు.
ఫ్రీ-టు-ప్లే(F2P)కి మారడానికి ముందు గతంలో గేమ్‌ను ఎవరైతే కొనుగోలు చేశారో వారంతా కూడా ఇప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. అంతేకాదు, పబ్జీ - స్పెషల్ ప్యాక్‌ని అందుకుంటారు. ఈ ప్యాక్‌లో బ్యాటిల్-హార్డెన్డ్ కాస్ట్యూమ్ స్కిన్ సెట్, షాకిల్ అండ్ షాంక్స్ లెగసీ పాన్, ది బ్యాటిల్డ్-హార్డెన్డ్ లెగసీ నేమ్‌ప్లేట్ ఉంటాయి.
ఫేవరెట్ క్రోమ్ ఎక్స్టెన్షన్లను ప్రకటించిన గూగుల్.. జాబితాలో ఉన్నవి ఇవే..
"పబ్జీ: బ్యాటిల్‌గ్రౌండ్స్ బ్యాటిల్ రాయల్ జానర్ కు మార్గదర్శకంగా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన గేమ్ ఐపీగా ఎదిగింది. F2Pకి మారడానికి, గేమ్‌కు కొత్త ఆటగాళ్లను స్వాగతించడానికి ఇదే సరైన సమయం. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం మేం దీన్ని ఎర్లీ యాక్సెస్‌కి తీసుకువచ్చినప్పటి నుంచి గేమ్ వినియోగం బాగా పెరిగింది. ఇది గేమింగ్‌లో అత్యుత్తమ విలువలలో ఒకదానిని అందిస్తుందని మేం నమ్ముతున్నాం" అని క్రాఫ్టన్ సీఈఓ, సీహెచ్ కిమ్ చెప్పారు.
"గేమ్ లో ఎనిమిది ప్రత్యేకమైన మ్యాప్‌లు ఉన్నాయి. ఇది స్థిరంగా అప్డేట్లు, ఫీచర్లు పొందుతోంది. ఇందులో ఇన్-గేమ్ పార్ట్నర్ యాక్టివేషన్లు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మించి F2Pకి మారడం ద్వారా కొత్త, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కంటెంట్ అందించడం సులభమవుతుంది. తద్వారా పబ్జీ ఐపీ పరిధిని విస్తృతం చేయడానికి మా ప్రయాణంలో మరో ముందడుగు పడుతుంది" అని కిమ్ వివరించారు.
Oppo Find N: ఒప్పో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి (Video)
గత సంవత్సరం సెప్టెంబర్‌లో, భారత ప్రభుత్వం 118 యాప్‌లను నిషేధించింది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ (PUBG) మొబైల్ కూడా ఉంది. అయితే, గేమ్‌ను పీసీ, కన్సోల్‌లలో మాత్రం బ్యాన్ చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Battlegrounds Mobile India, Latest Technology, PUBG, Technology