Battery Car: తక్కువ ధరలో బ్యాటరీ కారు.. మూడేళ్లలో తయారీ చేస్తామన్న టెస్లా

New Battery Cars: తక్కువ శక్తితో ఎక్కువ వేగంతో ప్రయాణించగల ప్లెయిడ్ మోడ్ మోడల్ ఎస్ కారును వచ్చే ఏడాది చివరినాటికి డెలివరీ చేస్తామని మస్క్ పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 23, 2020, 6:38 PM IST
Battery Car: తక్కువ ధరలో బ్యాటరీ కారు.. మూడేళ్లలో తయారీ చేస్తామన్న టెస్లా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమ కంపెనీ రూపొందిస్తున్న బ్యాటరీల ధరలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. బ్యాటరీ సెల్స్, ప్యాక్ల ధరలు తగ్గితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో తమ కంనెనీ రూపొందించే ఎలక్ర్టిక్ కారును 25,000 డాలర్ల( మన కరెన్సీలో దాదాపు రూ. 18 లక్షలు) కంటే తక్కువ ధరకే అందిస్తామని ప్రకటించారు.

బ్యాటరీల ధరలు తగ్గాలి

స్పేస్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడైన ఎలాన్ మస్క్ కొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎలక్ర్టిక్ కార్ల తయారీలో ఎక్కువ ఖర్చు బ్యాటరీలకే అవుతుందని... వాటి ధరలు తగ్గితే ఎలక్ర్టిక్ కార్ల ధరలు కూడా తగ్గి, అవి ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయని ఆయన చెబుతున్నారు. దీనిపై టెస్లా సంస్థ ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తోందని తెలిపారు. కొత్త రకం ట్యాబ్లెస్ బ్యాటరీ సెల్స్‌ను, చార్జింగ్ మెటీరియల్‌ను రూపొందించడం ద్వారా బ్యాటరీల ధరలు తగ్గించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమైతే ఒక కిలోవాట్ అవర్‌కు అయ్యే ఖర్చు చాలావరకు తగ్గనుంది.

మూడేళ్లలో రూపొందిస్తాం
25,000 డాలర్లకే ఎలక్ర్టిక్ కారును అందించాలంటే టెస్లాకు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మూడేళ్లలో కచ్చితంగా ఈ కారును అందుబాటులోకి తెస్తామని మస్క్ చెబుతున్నారు. కంపెనీ నుంచి వచ్చే కార్లలో ఇదే ధర తక్కువది కానుంది. టెస్లా నుంచి 35,000 డాలర్లకు ఎలక్ర్టిక్ మోడల్ 3 కారును అందిస్తామని మస్క్ ఇంతకు ముందే ప్రకటించారు. అన్నట్టుగానే ఆ సంస్థ అదే ధరకు ఎలక్ర్టిక్ కారును అందించింది. దీన్ని యూఎస్‌లో కొద్దికాలంలోనే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.

ప్లెయిడ్ మోడ్ వస్తోంది
తక్కువ శక్తితో ఎక్కువ వేగంతో ప్రయాణించగల ప్లెయిడ్ మోడ్ మోడల్ ఎస్ కారును వచ్చే ఏడాది చివరినాటికి డెలివరీ చేస్తామని మస్క్ పేర్కొన్నారు. 1,100 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ప్లెయిడ్ మోడ్‌కు ఆర్డర్లు తీసుకుంటున్నామని ఆయన వివరించాడు. ఈ అత్యాధునిక ఎలక్ర్టిక్ కారును మూడు మోటార్లతో రూపొందిస్తున్నారు. ఈ మోడల్-ఎస్ కారు కేవలం రెండు సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. తొమ్మిది సెకన్లలోనే క్వార్టర్ మైలు వరకు వెళ్లగలదు. అప్ గ్రేడెడ్ మోడల్- ఎస్ కారును 1,40,000 డాలర్లకు అందించనున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 321కిలోమీటర్లు(200 మైళ్లు) కావడం విశేషం. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 520 మైళ్లు(836 కిమీ) దూరం ప్రయాణించవచ్చు.
Published by: Kishore Akkaladevi
First published: September 23, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading