విస్కీనా? బ్రాందీనా?.. బార్లో మందు కలుపుతున్న రోబో...

కరోనా వైరస్ సంగతేమో కానీ.. కొత్త కొత్త ఐడియాలన్నీ ముందుకు వస్తున్నాయి.

news18-telugu
Updated: June 4, 2020, 6:18 PM IST
విస్కీనా? బ్రాందీనా?.. బార్లో మందు కలుపుతున్న రోబో...
రోబో బార్ టెండర్ (Image;Reuters)
  • Share this:
కరోనా వైరస్ సంగతేమో కానీ.. కొత్త కొత్త ఐడియాలన్నీ ముందుకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కరోనా పేషెంట్లకు మందులు అందించేందుకు రోబోలు ఆస్పత్రిలో డ్యూటీ చేయడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా బార్లలోకి ఎంట్రీ ఇచ్చాయి. రోబో బార్ టెండర్లు సిద్ధమయ్యాయి. ఓ రోబో అల్మారాలో ఉన్న ఫుల్ బాటిల్ మందు తీసుకుని గ్లాసుల్లో పోస్తుంటే.. మరో రోబో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తూ.. పర్ ఫెక్ట్‌గా మందు మిక్స్ చేస్తున్నాయి. ఇది ఎక్కడో కాదు. దక్షిణ కొరియాలో. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు సామాజికదూరాన్ని పాటిస్తున్నారు. అపరిచితులతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, చేతులు కలపడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ రోబో బార్ టెండర్లను ప్రవేశపెట్టింది రెస్టారెంట్ యాజమాన్యం. సియోల్‌లోని ఓ బార్‌లో కాబో అనే రోబోను ప్రవేశపెట్టారు. ఆరు అడుగుల ఎత్తున్న ఆ రోబో ఎంచక్కా ‘ఇది చూశారా? ఐస్ బాల్‌తో చేసింది. ఓ పెగ్ విస్కీ తాగుతారా?’ అంటూ కొరియన్ భాషలో రోబో పలుకులు పలుకుతోంది. వాస్తవానికి ఈ కాబో అనే రోబోను 2017లోనే తీసుకొచ్చారు. అయితే, అప్పటికంటే ఇప్పుడు ఇది బాగా పాపులర్ అయింది. అదే బార్‌లో పనిచేసే ఉద్యోగి కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. మందులో ఐస్ తాము కలిపే కంటే రోబోలు కలుపుతుంటే కస్టమర్లకు కూడా ఆనందంగా ఉంటుందని చెబుతున్నాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 4, 2020, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading