Video : అరటిపండులో సూదితో గుచ్చితే ఏమవుతుంది?

ఇదో ట్రిక్. ఇతరుల్ని ఆశ్చర్యంలో పడేసేందుకు... కొంతమంది ఈ ట్రిక్ ప్లే చేస్తుంటారు. ఇదెలా పనిచేస్తుందో, ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 2:26 PM IST
Video : అరటిపండులో సూదితో గుచ్చితే ఏమవుతుంది?
ఇలా గుచ్చితే ఏమవుతుంది ? (Image : Youtube - How To Make Sushi)
  • Share this:
సాధారణంగా మనం అరటిపండును తొక్క తీస్తే... లోపల పండు కనిపిస్తుంది. కానీ... మనం కొయ్యకుండానే... లోపలి పండు... ముక్కలైనట్లుగా ఉంటే... తొక్క తియ్యగానే... విడివిడిగా ముక్కలుగా కనిపిస్తే అప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తొక్క తియ్యకుండానే లోపలి పండు ఎలా ముక్కలుగా ఉంది అనిపిస్తుంది. అదే ఈ ట్రిక్. దీన్ని బనానా నీడిల్ ట్రిక్ అంటారు. సరదాగా ఫ్రెండ్స్‌ని ఆటపట్టించేందుకు కొందరు ఈ ట్రిక్ ప్లే చేస్తారు. ఇందుకోసం ఏం చెయ్యాలంటే... ముందుగా తినడానికి అనుకూలంగా ఉన్న మంచి అరటిపండును తీసుకోవాలి. దానికి ఓ వైపున సూదిని లోపలికి గుచ్చాలి. ఆ సూదిని అటూ ఇటూ కదపాలి. తద్వారా లోపలి పండును ఆ సూది... కత్తితో కోసినట్లుగా కోసేస్తుంది. ఆ తర్వాత సూదిని తిరిగి వెనక్కి తీసి... కాస్త కిందవైపున మరోసారి గుచ్చాలి. మళ్లీ అలాగే చెయ్యాలి. ఇలా... ఒక అరటిపండును దాదాపు పదిసార్లు సూదితో గుచ్చి... పది ముక్కలు (స్లైసెస్) చెయ్యవచ్చు. ఆ తర్వాత సూదిని తీసేసి... ఆ పండును ఎవరికైనా తినమని ఇస్తే... వాళ్లు క్యాజువల్‌గా దాన్ని తీసుకొని... ఓపెన్ చేసి తిందామనుకుంటారు. తీరా చూస్తే... అది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇదేంటి ఇలా ఎలా అని షాకవుతారు. ఆ తర్వాత మన ట్రిక్ చెప్పి వాళ్లను ఆశ్చర్యపరచవచ్చు. ఈ ట్రిక్ ఎలా చెయ్యాలో ఈ వీడియోలో 1.47 దగ్గర నుంచీ తెలుసుకోవచ్చు.

ఈ ట్రిక్‌ చేసేవాళ్లు... సూదితో కోసిన వెంటనే అరటిపండును ఫ్రెండ్స్‌కి ఇచ్చేయాలి. అరగంట కంటే ఎక్కువ లేటు చేస్తే... సూదితో గుచ్చిన చోట... అరటిపండు కందిపోయినట్లు అవుతుంది. అందువల్ల వాళ్లు కనిపెట్టేసే అవకాశం ఉంటుంది.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>