హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp - Facebook: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను బ్యాన్ చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్

WhatsApp - Facebook: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను బ్యాన్ చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం తప్పనిసరిగా తగిన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సీఏఐటీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తీసుకొచ్చిన నూతన ప్రైవసీ (Privacy) విధానం పెద్ద దూమారాన్నే రేపుతోంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ నూతన ప్రైవసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది యూజర్లు తమ ఫోన్లలో నుంచి ఆ యాప్ను తొలగిస్తున్నారు. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న సిగ్నల్ (Signal), టెలిగ్రామ్ (Telegram) యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, వాట్సాప్, దాని మాతృ సంస్థ ఫేస్బుక్ (Facebook)ను నిషేధించాలని కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (CAIT) సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ‘‘ఈ కొత్త పాలసీతో యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, పేమెంట్ లావాదేవీలు, కాంటాక్ట్లు, లోకేషన్లతో పాటు ఇతర కీలక సమాచారాన్ని వాట్సాప్ సేకరించి తన మాతృ సంస్థ అయిన ఫేస్బుక్ కు అందించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. తద్వారా వినియోగదారుడి డేటా భద్రతతో పాటు దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల, ఈ రెండు యాప్స్‌ను నిషేధించేలా చూడాలి. లేదంటే, వినియోగదారుడి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఈ నూతన పైవసీ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయా సంస్థలను ఆదేశించగలరు.’’ అంటూ తన పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం

వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం తప్పనిసరిగా తగిన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సీఏఐటీ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ మార్గదర్శకాలు రూపొందించడంలో EU వంటి అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న విధానాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరింది. అంతేకాక, పెద్ద టెక్ కంపెనీలు యూజర్ డేటాను ఎలా దుర్వినియోగం చేయవచ్చో పిటిషన్ (Petition)లో స్పష్టంగా పేర్కొంది. కాగా, ప్రముఖ న్యాయవాదులు అబీర్ రాయ్ (Abir roy), వివేక్ నారాయణ్ శర్మ (Vivek Narayan sharma)లు ఈ దీనికి సంబంధించిన ముసాయిదా రూపొందించి సుప్రీంకోర్డులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై సిఐఐటి జాతీయ అధ్యక్షుడు బిసి భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘‘వాట్సాప్ నూతన పాలసీ వ్యక్తి గోప్యతను ఆక్రమించమే కాకుండా, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది. సుప్రీం కోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలి.” అని అన్నారు.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Facebook, Supreme Court, Whatsapp

ఉత్తమ కథలు