Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు

Ban TikTok | టిక్ టాక్ ఒక్కటే కాదు హెలో లాంటి చైనా యాప్స్‌ను నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేస్తోంది. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్స్, ఇ-కామర్స్ కంపెనీలు రెండేళ్లలో ఇండియాలో వ్యాపారాన్ని పెంచుకున్నాయని ఆ సంస్థ చెబుతోంది.

news18-telugu
Updated: February 20, 2019, 7:23 AM IST
Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు
Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు
news18-telugu
Updated: February 20, 2019, 7:23 AM IST
టిక్‌ టాక్... ఇటీవల యూత్‌లో బాగా పాపులర్ అయిన వీడియో యాప్. ఈ యాప్‌లో క్రియేట్ చేసే షార్ట్ వీడియోలు చాలా పాపులర్. కానీ ఈ యాప్‌ను నిషేధించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. టిక్‌ టాక్ యాప్‌పై తమిళనాడు అసెంబ్లీలోనే చర్చ జరిగింది. టిక్‌ టాక్ యాప్‌ను నిషేధించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా చైనా యాప్ టిక్ టాక్‌ను నిషేధించాలని డిమాండే చేస్తోంది. మసూద్ అజహర్‌ను 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా గుర్తించాలని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చైనా ప్రభుత్వం అడ్డుకుంటున్నందున... భారతదేశంలో వ్యాపారాలు చేస్తున్న చైనా కంపెనీలకు అడ్డంకులు సృష్టించాలని కోరుతూ స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

తీవ్రవాద దాడులకు వ్యూహకర్త అయిన మసూద్ అజహర్‌ను 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా గుర్తించాలని భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను చైనా ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. అందుకే భారత ప్రభుత్వం కూడా ఇండియాలో వ్యాపారాలు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న చైనా కంపెనీలకు అడ్డంకులు సృష్టించడం అత్యవసరం.

మోదీకి రాసిన లేఖలో అశ్వనీ మహాజన్, స్వదేశీ జాగరణ్ మంచ్ కో-కన్వీనర్




టిక్ టాక్ ఒక్కటే కాదు హెలో లాంటి చైనా యాప్స్‌ను నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేస్తోంది. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్స్, ఇ-కామర్స్ కంపెనీలు రెండేళ్లలో ఇండియాలో వ్యాపారాన్ని పెంచుకున్నాయని ఆ సంస్థ చెబుతోంది. ఈ డిమాండ్లపై సదరు యాప్ డెవలపర్లు స్పందించారు.

Read this: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

ఇండియాలోని యూజర్లకు మా యాప్స్ ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, స్థానిక చట్టాలను గౌరవించడంలో టిక్ టాక్, హెలో యాప్స్ కట్టుబడి ఉన్నాయి. ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. యూజర్ డేటా విషయంలో సెక్యూరిటీ, సేఫ్టీని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం.
Loading...
బైట్ డ్యాన్స్ అధికార ప్రతినిధి వివరణ


టిక్ టాక్ యాప్‌ ఇండియాలో బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ యాప్‌కు మొత్తం 50 కోట్ల మంది యూజర్లు ఉండగా... ఇండియాలోనే 20 కోట్ల మంది యూజర్లున్నారు.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే

Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై
First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...