TikTok Ban: టిక్‌టాక్ యాప్ బ్యాన్ చేస్తారా? అశ్లీలతను ప్రోత్సహిస్తోందన్న మద్రాస్ హైకోర్టు

Ban TikTok | టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని, డౌన్‌లోడ్స్‌ను నిషేధించాలని, టిక్‌టాక్ వీడియోలు మీడియా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

news18-telugu
Updated: April 4, 2019, 6:21 PM IST
TikTok Ban: టిక్‌టాక్ యాప్ బ్యాన్ చేస్తారా? అశ్లీలతను ప్రోత్సహిస్తోందన్న మద్రాస్ హైకోర్టు
TikTok Ban: టిక్‌టాక్ యాప్ బ్యాన్ చేస్తారా? అశ్లీలతను ప్రోత్సహిస్తోందన్న మద్రాస్ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 4, 2019, 6:21 PM IST
మీరు టిక్ టాక్ వీడియోస్ చూస్తుంటారా? మీరు టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటారా? మీ ఫోన్‌లో టిక్ టాక్ యాప్ ఉందా? ఇండియాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం తప్పేలా లేదు. చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. "పిల్లలు అపరిచితుల్ని నేరుగా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం. పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉంది" అని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని, డౌన్‌లోడ్స్‌ను నిషేధించాలని, టిక్‌టాక్ వీడియోలు మీడియా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.





టిక్‌టాక్... వీడియో మేకింగ్ అండ్ షేరింగ్ యాప్. యూత్‌లో టిక్ టాక్ యాప్‌కు క్రేజ్ ఎక్కువ. యువతీయువకుల్లో టిక్ టాక్ యాప్ వీడియోస్ చూడటం, చేయడం ఓ వ్యసనంగా మారిపోయింది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న యాప్ టిక్ టాక్. జోక్స్, ప్రాంక్స్, పాటలు, డైలాగులు రికార్డ్ చేసి స్నేహితులకు షేర్ చేస్తూ ఉంటారు. కొంతకాలంగా టిక్ టాక్ యాప్ చుట్టూ వివాదాలు పెరిగిపోయాయి. చైనాకు చెందిన ఈ యాప్‌ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. తమిళనాడుకు చెందిన నేతల దగ్గర్నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల వరకు అందరూ టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలనే కోరుతున్నారు.

Read this: WhatsApp: వాట్సప్‌లో కొత్తగా గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్... సెట్టింగ్స్ ఇవే
Loading...
టిక్ టాక్ యాప్‌పై మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... టిక్ టాక్ యాప్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. స్థానిక చట్టాలకు లోబడే టిక్ టాక్ యాప్ ఉందని, తమ యాప్ సురక్షితమని సంస్థ ప్రతినిధులు కోర్టుకు బదులిచ్చారు. భారతదేశంలో టిక్ టాక్ యాప్‌ను 24 కోట్లసార్లు డౌన్‌లోడ్ చేశారంటే ఈ యాప్‌కు ఉన్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి

IRCTC RAC: ఆర్ఏసీ టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ ఇవే...

 
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...