• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • BAJAJ LAUNCHED THE NEW CT110X IN INDIA AND IT IS PRICED AT RS 55494 HERE FULL DETAILS NS GH

Bajaj CT110X: బజాజ్ సీటీ 110 ఎక్స్ బైక్ లాంఛ్​​.. లీటర్ కు 90 కిలో మీటర్ల మైలేజ్.. ధర కూడా చాలా తక్కువే..

ప్రతీకాత్మక చిత్రం

బజాజ్​ CT110 X పేరుతో సరికొత్త బైక్​ను భారత మార్కెట్​లోకి తీసుకువచ్చింది. ఈ బైక్​ ధరను రూ. 55,494 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ బైక్ ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:


ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ బజాజ్​ ఆటో CT110 X పేరుతో సరికొత్త బైక్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ బైక్​ ధరను రూ. 55,494 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ సరికొత్త బజాజ్​ సిటి 110 X ​ బైక్​లో దాని స్టాండర్డ్​ వేరియంట్​ కంటే ఎక్కువ అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. CT సిరీస్​లో ఇది టాప్​ ఎండ్​ వేరియంట్​. దీనిలో 115 సీసీ డీటీఎస్​ ఐ ఇంజిన్​, 7 కేజీల వరకూ బరువు మోయగలిగే క్యారియర్​ను అమర్చింది. ఈ కొత్త బైక్​ ఆకట్టుకునే డిజైన్​, కాస్మెటిక్​ అప్​గ్రేడ్స్​తో రూపొందించబడింది. దీనిలో వైడ్​ క్రాస్​ సెక్షన్​, రౌండ్ హెడ్​ లైట్​, ఆల్​ బ్లాక్​ విజర్​ వంటి ఫీచర్లను కూడా జోడించింది. కస్టమర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పాత వేరియంట్​కు అనేక మార్పులు చేసి ఈ సరికొత్త బైక్​ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్​లో అనేక మార్సులు చేసింది.

రైడింగ్​ చేసేటప్పుడు సేఫ్టీ, కంఫర్ట్ కోసం దీనిలో మందపాటి క్రాష్​ గార్డ్​ ఇవ్వబడింది. వీటితో పాటు, ఈ బైక్​లో సెమీ- నాబీ టైర్స్​, స్క్వేర్ ట్యూబ్, సెమీ -డబుల్​ క్రాడిల్​ ఫ్రేమ్, ఇంటిగ్రేటెడ్​ ట్యాంక్​ పాడ్స్​ వంటి ఫీచర్లను కూడా చేర్చింది. తద్వారా, గతుకుల రోడ్లపై కూడా సులభతరంగా ప్రయాణించవచ్చు. కఠినమైన రహదారి పాచెస్​ను సులభంగా నిర్వహించడానికి ఈ మోటార్​సైకిల్​ను సెమీ నైన్బై ఎంఆర్​ఎఫ్​ టైర్లతో రూపొందించారు.

లీటర్​కు 90 కి.మీ. మైలేజ్​..

కాగా, ఈ కొత్త బైక్​పై బజాజ్​ఆటో మోటార్​ సైకిల్​ ప్రెసిడెంట్​ సరంగ్​ కనడే మాట్లాడుతూ ‘‘సరికొత్త సిటి 110 ఎక్స్​ వేరియంట్​లో మైలేజీతో రాజీ పడకుండా ఉన్నతమైన ఫీచర్లను అందించాం. దీనిలోని సుపీరియర్​ ఫీచర్లు మీకు అద్భుతమైన రైడింగ్​ అనుభూతిని అందిస్తుంది. నాణ్యత, మైలేజీ విషయంలో రాజీపడకుండా ఈ బైక్​ను ఉత్పత్తి చేశాము. బడ్జెట్​ ధరలోనే ఎక్కువ మైలేజీ, మన్నిక గల ద్విచక్ర వాహనాన్ని అందిస్తున్నాము. మేము ఇటీవలే CT బ్రాండ్ ప్రధాన భాగంలో రైడర్-సెంట్రిక్ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాం. మా సరికొత్త CT110X వేరియంట్​ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించగలదని ఆశిస్తున్నాం.”


CT110X వేరియంట్​లో 115 సిసి డిటిఎస్-ఐ ఇంజిన్‌ను కూడా అందించారు. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.48 బిహెచ్‌పి, 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని ఇంజిన్ 4 -స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేసి ఉంటుంది. ఇంజిన్​ సెటప్​ బ్లాక్​ కలర్​లో ఉంటుంది. ఈ ఇంజిన్​ గార్డ్​, క్రాష్​ గార్డ్​ మాట్టే గ్రే కలర్స్​లో లభిస్తుంది. దీని ఫ్యుయల్​ ట్యాంక్​ కెపాసిటీ 11 లీటర్ల వరకు ఉంటుంది. ఈ బైక్​ మైలేజ్​​ విషయానికి వస్తే.. ఇది ఒక లీటర్​కు 90 కిలో మీటర్ల మైలేజ్​ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. 


Published by:Nikhil Kumar S
First published: