• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • BAJAJ CHETAK ELECTRIC SCOOTER TO BE LAUNCHED IN THESE TWO NEW INDIAN CITIES MK GH

Bajaj Chetak: బజాజ్​ చేతక్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​కు ఊహించని రెస్పాన్స్​..

Bajaj Chetak: బజాజ్​ చేతక్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​కు ఊహించని రెస్పాన్స్​..

ప్రతీకాత్మకచిత్రం

బజాజ్ చేతక్​ అంటే ఒకప్పుడు బెస్ట్​ ఫ్యామిలీ స్కూటర్​గా ప్రసిద్ధి. ఒక టైంలో మార్కెట్​ని ఏలిన బజాజ్​ చేతక్ ఆ తర్వాత క్రమంగా కనుమరు?

  • Share this:
బజాజ్ చేతక్​ అంటే ఒకప్పుడు బెస్ట్​ ఫ్యామిలీ స్కూటర్​గా ప్రసిద్ధి. ఒక టైంలో మార్కెట్​ని ఏలిన బజాజ్​ చేతక్ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది. అదే బజాజ్​ కంపెనీ తెచ్చిన పల్సర్​, డిస్కవర్​, ప్లాటినం, సీటీ 100 వంటి మోడల్స్​ కొనేందుకు సామాన్య ప్రజలు మొగ్గుచూపడంతో చేతక్​ ఉత్పత్తిని ఆపేసింది. అయితే, ఇప్పుడు దేశంలో భగ్గుమంటున్న పెట్రోల్​ ధరలతో ఎక్కువ మంది పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రికల్​ వాహనాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్​ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దీంతో, బజాజ్​ కూడా తన పాత చేతక్​ మోడల్​ను రీ మోడల్​ చేసి ఎలక్ట్రిక్​ వాహనంగా మార్చి మార్కెట్​లోకి విడుదల చేసింది. రూ.2,000 చెల్లించి ముందస్తు బుకింగ్స్​ చేసుకునేందుకు అనుమతించింది. అయితే, ఈ బుకింగ్స్​​ను ఈ నెల 13న ప్రారంభించగా భారీ రెస్పాన్స్​ వచ్చింది.

తొలి విడతలో ఉత్పత్తి చేసిన వాహనాల కంటే అధికంగా బుకింగ్స్​ వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ వాటి బుకింగ్స్​ను ఆపేసింది. ఊహించని డిమాండ్​ రావడంతో బజాజ్ కూడా డిమాండ్​ను తీర్చడానికి ఉత్పత్తి శ్రేణిని పెంచుతోంది. అంతేకాకుండా, అమ్మకాలను మరింత పెంచడానికి, తన డీలర్​షిప్​ సెంటర్లను కూడా విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరిన్ని నగరాల్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటివరకు పూణే, బెంగళూరు నగరాల్లో మాత్రమే బజాజ్ తన చేతక్​ వాహనాల డీలర్​షిప్​ సెంటర్లను కలిగి ఉంది. అయితే, ఇతర నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్​ దృష్ట్యా అతి త్వరలోనే చెన్నై, హైదరాబాద్​లోనూ డీలర్​షిప్​ సెంటర్లను తెరవనుంది. 2020 డిసెంబర్ నాటికి, బజాజ్ మొత్తం 18 చేతక్ డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. వీటిలో ఐదు పూణేలో ఉండగా, మిగిలినవి బెంగళూరులో ఉన్నాయి.

పెరుగుతున్న డిమాండ్​తో ఇతర నగరాల్లోకి..
పెరుగుతున్న డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు బజాజ్ ఇటీవలే చేతక్​ ఎలక్ట్రిక్​ వాహన ధరలను కూడా గణనీయంగా పెంచేసింది. దీని ధరను ఇటీవలే సుమారు రూ. 27,000 పెంచింది. దీంతో, బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ వాహనం రూ. 1,42,620 (ఎక్స్-షోరూమ్, పూణె)లకే లభిస్తుంది. బజాజ్​ చేతక్​ ఎలక్ట్రికల్​ స్కూటర్​ ఈ విభాగంలో ఉన్న ఇతర స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. అథర్ 450 ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్​ వంటి వాహనాలకు ఇది పోటీగా నిలుస్తోంది. దీని ధర రూ. 1.28 లక్షలు ఉండగా, ఆ తర్వాత రూ. 1.47 లక్షలకు పెరిగింది. అయితే, వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్​ను కట్టడి చేయడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ల్రికల్​ వాహనాలపై రాయితీ ప్రకటించింది. దీంతో ఢిల్లీలో ఇది రూ. 1.08 లక్షలకే లభిస్తుంది, అయితే, ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో ఇది రూ.1.30 లక్షలకు అందుబాటులో ఉంటుంది.
First published:

అగ్ర కథనాలు