Bajaj Chetak: బజాజ్​ ఆటో కీలక నిర్ణయం.. కొత్తగా మరో మూడు నగరాల్లో చేతక్​ బుకింగ్స్​ ప్రారంభం​

ప్రతీకాత్మకచిత్రం

చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బ్యాటరీ లైఫ్​ 70,000 కిలోమీటర్లు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుందని బజాజ్​ సంస్థ పేర్కొంది. ఈ బ్యాటరీపై కంపెన?

  • Share this:
దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఎలక్ట్రిక్​ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ డిమాండ్​ను అందిపుచ్చుకునేందుకు అనేక ఆటోమొబైల్​ సంస్థలు ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే దేశీయ ఆటో దిగ్గజం బజాజ్.. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్​ను విడుదల చేసింది. మార్కెట్​లో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​కు అదిరిపోయే రెస్పాన్స్​ వస్తోంది. దీంతో ప్రస్తుతం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైన బజాజ్​ చేతక్​ స్కూటర్లను మరిన్ని నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే తమ ఈ-స్కూటర్లను మైసూర్, మంగళూరు, ఔరంగాబాద్ నగరాల్లో ప్రవేశపెట్టింది. జూలై 22 నుంచి ఈ నగరాలకు చెందిన కస్టమర్లు సైతం వీటిని బుక్​​ చేసుకునే అవకాశం కల్పించింది.

ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 2,000 చెల్లించి చేతక్ ఈ-స్కూటర్​ను బుకింగ్​ చేసుకోవచ్చు. ఈ నగరాల్లోని వినియోగదారుల కోసం ఇప్పటికే ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది ఓలా సంస్థ. ఇదే జోరుతో 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 24 నగరాల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని బజాజ్ ఆటో యోచిస్తోంది. అందుకు అనుగుణంగా జూలై 16 నుంచి నాగ్​పూర్​లో సైతం బుకింగ్స్​ను ప్రారంభించింది. ఇంతకు ముందు పూణే, బెంగళూరు నగరాల్లో సైతం బుకింగ్స్​ను తెరిచింది. ఈ నగరాల్లో బుకింగ్స్​ ప్రారంభించిన కేవలం 48 గంటల్లోనే మొత్తం స్టాక్​ అయిపోవడం గమనార్హం. నాగ్‌పూర్‌లో కూడా ఇలాంటి రెస్పాన్స్​ వస్తుందని కంపెనీ ఆశిస్తోంది.

2022 చివరి నాటికి 24 నగరాల్లో..
బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ 3.8 కిలొ వాట్ల ఎలక్ట్రిక్​ మోటారుతో పనిచేస్తుంది. ఇది 5 హెచ్‌పి శక్తిని 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో IP67- రేటెడ్ 3 Kwh లిథియం -అయాన్ బ్యాటరీని అందించారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేసే 95 కిలో మీటర్ల దూరం ప్రయాణించగలదు. స్కూటర్​ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్​ కావడానికి 5 గంటలు పడుతుంది. అయితే ఫాస్ట్​ ఛార్జింగ్​ సిస్టమ్​ సహాయంతో దాని బ్యాటరీని కేవలం ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్​ చేయవచ్చు.

చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ బ్యాటరీ లైఫ్​ 70,000 కిలోమీటర్లు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుందని బజాజ్​ సంస్థ పేర్కొంది. ఈ బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలో మీటర్ల ప్రయాణం వరకు వారంటీ ఇస్తోంది. బజాజ్​ చేతక్​ ICE స్కూటర్​ విడుదలైన దాదాపు 15 సంవత్సరాల తరువాత.. మళ్లీ దీన్ని మార్కెట్​లోకి తెచ్చింది. 2020లో చేతక్ బ్రాండ్‌ను EVగా పునరుద్ధరించింది.
Published by:Kishore Akkaladevi
First published: