Google Pixel 6: గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బ్యాడ్​న్యూస్.. భారత్​లో పిక్సెల్ 6 విడుదల ఇప్పుడు కాదట!

ప్రతీకాత్మక చిత్రం

టెక్​ దిగ్గజం గూగుల్​ నుంచి విడుదలయ్యే పిక్సెల్​ స్మార్ట్​ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రీమియం రేంజ్​లో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్లు హాట్​ కేకుల్లా అమ్ముడవుతాయి. అయితే..

  • Share this:
టెక్​ దిగ్గజం గూగుల్​ నుంచి విడుదలయ్యే పిక్సెల్​ స్మార్ట్​ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రీమియం రేంజ్​లో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్లు హాట్​ కేకుల్లా అమ్ముడవుతాయి. అందుకే గూగుల్ నుంచి నెక్స్ట్ వెర్షన్​ ఎప్పుడు వస్తుందా? అని టెక్​ ప్రియులు ఎదురు చూస్తుంటారు. వారి ఊహలకు తగ్గట్లే గూగుల్ నిన్న రాత్రి పిక్సెల్ 6 సిరీస్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ అనే ఎనిమిది దేశాల్లో పిక్సెల్ 6 సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ జాబితాలో భారత్​ లేకపోవడం గమనార్హం. దీంతో భారత్​లోని గూగుల్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. కేవలం భారత్​లోనే కాదు చైనా, ఇతర యూరోపియన్​ దేశాల్లోనూ ఈ స్మార్ట్​ఫోన్​ను ఇప్పుడు విడుదల చేయడం లేదు. అయితే వీటిని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది.
Smartphone Battery: మీ ఫోన్ బ్యాటరీని హరించే టాప్ 20 యాప్స్ ఇవే.. తెలుసుకోండి

గూగుల్ గతంలోనూ ఇదే ధోరణ అవలంభించింది. గతంలో విడుదలైన పిక్సెల్​ 4, పిక్సెల్​5 స్మార్ట్‌ఫోన్లను కూడా తొలివిడతలో తీసుకురాలేదు. గూగుల్​ ప్రొడక్ట్స్​కు ఎక్కువ బిజినెస్ ఉండే ప్రాంతాల్లో తొలుత విడుదల చేసి.. ఆ తర్వాత భారత్​తో సహా అనేక దేశాల్లో లాంచ్​ చేసింది.​ అయితే టోన్-డౌన్ పిక్సెల్ “ఎ” సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మాత్రం గ్లోబల్​ మార్కెట్​లోకి ఓకేసారి విడుదల చేయడం గమనార్హం.

సరికొత్త డిజైన్​, చిప్​సెట్​తో..
ఆయా దేశాల్లో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ మొత్తం రెండు మోడళ్లతో విడుదల కానుంది. ఇది​ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో పేర్లతో లాంచ్​ అవ్వనుంది. రాబోయే పిక్సెల్​ 6 సిరీస్​ను సరికొత్త డిజైన్, ఇన్-హౌస్ చిప్‌సెట్​తో రూపొందించినట్లు అనేక పుకార్లు ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ప్రస్తుతం గూగుల్​ పిక్సెల్​ 6 సిరీస్​ రానున్న ఎనిమిది దేశాలకు చెందిన యూజర్లు.. ఈ స్మార్ట్​ఫోన్లను పొందేందుకు గూగుల్ స్టోర్లలో పేర్లు నమోదు చేసుకోవాలి.

అయితే ఈ డివైజ్‌లు అన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్లు అన్ని రంగుల్లో లభించవని గూగుల్​ పేర్కొంది. ఉదాహరణకు, ఫ్రాన్స్ దేశంలో పిక్సెల్ 6 ప్రో ఒకే కలర్​ ఆప్షన్​లో లభిస్తుందని తెలిపింది. ఇక పిక్సెల్ 6 సిరీస్ కచ్చితమైన ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. 2021 చివరిలోగా ఇవి మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published: