Home /News /technology /

BAD NEWS FOR IPHONE USERS YOU WILL NOT BE ABLE TO GO BACK TO IOS 15 4 AFTER UPDATING TO IOS 15 4 1 HERE WHY PRV GH

Apple iPhone: ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఓఎస్ 15.4.1 అప్‌గ్రేడ్ చేసిన వారికి ఓ బ్యాడ్​న్యూస్​.. ఏమిటంటే..?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

మార్చి 31న ఐఓఎస్ 15.4.1 (iOS 15.4.1) వెర్షన్‌ను యాపిల్ రోల్ అవుట్ చేసింది. అయితే దీనిని తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది

ఈ ఏడాది మార్చి ప్రారంభంలో ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం ఫీచర్-ప్యాక్డ్ వెర్షన్ ఐఓఎస్ 15.4 (iOS 15.4) వెర్షన్‌ను యాపిల్ (Apple) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఫీచర్లతో పాటు కొన్ని బగ్స్ (Bugs) కూడా ఉన్నాయి. దీంతో ఈ సాంకేతిక సమస్యలను ఫిక్స్ చేసి మార్చి 31న ఐఓఎస్ 15.4.1 (iOS 15.4.1) వెర్షన్‌ను యాపిల్ రోల్ అవుట్ చేసింది. అయితే దీనిని తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది తాజాగా ఐఓఎస్ 15.4 సైనింగ్ (iOS Signing) ఆపేసింది. దీనర్థం ఏమిటంటే, యూజర్లు తమ ఐఫోన్‌ (iPhone)ను ఐఓఎస్ 15.4.1కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, వారు తిరిగి ఐఓఎస్ 15.4కి డౌన్‌గ్రేడ్ చేయలేరు. ఇది కొందరు యూజర్లకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. యాపిల్ గత వారం లాంచ్ చేసిన ఐఓఎస్ 15.4.1 వెర్షన్ ఐఓఎస్ 15.4లో ఉన్న బ్యాటరీ డ్రెయిన్ సమస్యను ఫిక్స్ చేసింది. ఐఓఎస్ 15.4లో మాస్క్‌తో ఫేస్ఐడీని అన్‌లాక్ చేయగల ఫీచర్ ఉన్న విషయం తెలిసిందే.

బ్యాటరీ డ్రెయిన్ సమస్య ఫిక్స్..

ఐఓఎస్ 15.4.1 అప్‌డేట్ అనేది బగ్ ఫిక్సెస్, ఇంప్రూమెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇది ఎలాంటి కొత్త ఫీచర్లను తీసుకురాలేదు. ఐఓఎస్ 15.4, ఐప్యాడ్ ఓఎస్ 15.4కి అప్‌డేట్ చేసిన తర్వాత యూజర్లు ఎదుర్కొంటున్న బ్యాటరీ డ్రెయిన్ సమస్యను కంపెనీ ఫిక్స్ చేసినట్లు ఐఓఎస్ 15.4.1 అప్‌డేట్ చేంజ్‌లాగ్ పేర్కొంది. అంతేకాదు, నావిగేట్ చేస్తున్నప్పుడు లేదా అలర్ట్ ను డిస్‌ప్లే చేస్తున్నప్పుడు బ్రెయిలీ డివైజెస్ల అన్‌రెస్పాన్సివ్ సమస్యను ఫిక్స్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐఓఎస్ 15.4 అప్‌డేట్ చేశాక కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లలో ‘మేడ్ ఫర్ ఐఫోన్/ ఐప్యాడ్’ హియరింగ్ డివైజ్ లు కనెక్షన్‌ని కోల్పోయాయి. ఐతే ఈ సమస్యకు కూడా ఐఓఎస్ 15.4.1 అప్‌డేట్‌తో చెక్ పెట్టింది కంపెనీ.

మూడు నెలల్లో లాంచ్..

సాధారణంగా యూజర్లు సాఫ్ట్‌వేర్ కొత్త వెర్షన్‌లతో వచ్చే బగ్‌లను నివారించడానికి ఐఓఎస్ ఓల్డ్ వెర్షన్లకు డౌన్‌గ్రేడ్ చేసుకుంటారు. తమ ఐఫోన్‌లను జైల్‌బ్రేక్ చేసే వ్యక్తులు కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే, ఇప్పుడు యూజర్లు ఐఓఎస్ 15.4.1 అప్‌డేట్‌ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే, ఐఓఎస్ 15.4కి తిరిగి వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఈ వెర్షన్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. యాపిల్ ఇప్పటికే ఐఓఎస్ 15.5 బీటా వెర్షన్‌ను పరీక్షిస్తోంది. ఈ నెక్స్ట్ ఐఓఎస్ వెర్షన్‌ రెండు, మూడు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ముందుగా చెప్పినట్లు యాపిల్ గత నెలలో ఐఓఎస్ 15.4ని లాంచ్ చేసింది. అది ఒక మేజర్ అప్‌డేట్‌గా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ యూజర్లు కోసం ఐఓఎస్ 15.4 తీసుకువచ్చిన ఇతర ఫీచర్లలో సిరి కోసం న్యూ వాయిస్, తెలియని ఎయిర్‌ట్యాగ్‌ను గుర్తించే సామర్థ్యం, ​​37 కొత్త ఎమోజీలు, ఇంకా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Apple, Iphone, Software

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు